తర్జుమా

అరచేతులు

ఏప్రిల్ 2014

మేం కలసిపాడుతాం
పాటలో లయవుండదు
అయినా మే పాడుతాం
ఎందుకంటే…?
ఆ రాగం మాదికాబట్టి
మేం ఎండలో పనిచేస్తాం
మా స్వేదం ప్రవహిస్తుంది ఎండలో
శ్రమకు ఫలితమేంటో తెలుసా…?
మూడుపూటలాతిండి..!
ఇక ఎవడైనా
సంతోషంగా పాడగలడా సుమధుర గీతాన్ని….?!
రాత్రి ఒక స్వరం వినిపిస్తుంది
చల్లని వణికించే స్వరం
హోళీ నో….
ఇంకేదో…..
కృతజ్ఞత మరచిన దెయ్యాల పాట
ఏదైతేనేం….!
ఇప్పుడు పాటల రాగం మారిపోతుంది
హొయ్య…హో.
హొయ్యా…. హొయ్యా
చిన్న గోతామును ఎత్తినట్టు
మా దుఃఖాన్ని ఎత్తి అవతల పారేస్తాం
కన్నీళ్ళను చెమటలో కలిపి పారిస్తాం
ఇప్పుడుచేతిలో ఆయుధం ఉంది
ఆయుధం రాపిడికి
అరచెతులు వేడెక్కుతున్నాయ్

హిందీ:-హరీశ్ పర్మార్
స్వేచ్చానువాదం:-శ్రీనివాసుగద్దపాటి