నేను గదిలో ఒక్కడినే కూర్చున్నప్పుడు సముద్రమంత నిశబ్దం అలుముకుంది నా చుట్టూ
నేనెక్కడొ అగాధంలో పడిపోతున్నట్టుగా కొన్ని ఆలోచనా సరళ రేఖలు నా ఖగోళంలో
గీసుకుని వాటి మీద నడుస్తున్నప్పుడు
దూదిమేడలా నేను కూలిపోతున్నపుడు నాకు ఆసరా ఇస్తూ ఇంకొన్ని జ్ఞాపకాలు
ప్రహరీలా నిర్మించినపుడు
వాటి కింద ఏనాడో శిధిలమైపోయిన కొన్ని పిచ్చుకగూళ్ళు
అందులో నేనో మూల నన్ను నేను తడుముకుంటున్నపుడు
ఏమితోచక తోకచుక్కలా రాలుతున్న నా కన్నీళ్ళు కొన్ని అక్కడక్కడా
నీటిచెమ్మలుగా నిద్రాణమైపోతుంటాయి నువ్వొచ్చేసరికికి
నేను కరుగుతూ నిన్ను కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటాను నువ్వు
గుర్తొచ్చినప్పుడల్లా…
చాలా బాగుంది. తిలక్ గారు , మీరు మనస్సు తో రాస్తారు.
చాలా బాగుంది తిలక్ గారు..చిక్కనవుతున్నారు..
‘నేను కరుగుతూ నిన్ను కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటాను నువ్వు
గుర్తొచ్చినప్పుడల్లా… ‘
*మాటలకందని కొన్ని అపురూప భావాలను కూడబెట్టి అక్షరాల హారాన్ని తయారు చేయడమే కవిత్వం..అని అనిపిం చారు.
అభినందనలు.