కవిత్వం

ఏకాంత ఛాయ

జూన్ 2014

ఏకాంతంలోనే దృశ్యాలనీడలు
సమూహలలో ఒంతటిరితనం
కలిసి పెనవేసుకున్న శరీర చిత్రం
క్రీనీడలలో ఎండలో విడిపోయి
నేలమీద వాలిపోయిన రూపం
ఎప్పుడో గాని పలకరించదు

నడక కింద జారిపోయి
దూరంగా జరిగి శరీరంతో వేరుపడని నీడ
గోడలని నీళ్ళని అద్దలుగా చేసుకుంటుంది
ఏముంది చీకటి రూపంలో
వెలుతురు అంటని నలుపు
దీపాలు కొండెక్కిన నలుపు

వెలుగుని గాలించినా
కంచుకాగడలతో వెతికినా
కొంచంకూడ నక్షత్రంల్లా వెలగదు

శరీరంలో రూపం
ఏకాంతంలో వులి శబ్దం
చెక్కుతున్న విషయాలు
రంగులు కలుపుకుంటున్న కుంచెలు

నల్లని నీళ్లని కదిల్చినా
వెలుగుని వెలిగించినా
స్వచ్చమైన ఛాయ చిత్రం
కనిస్తూనే వుంటుంది

ఆకర్షణలేని రూపం చూపులలో ఒదగదు
పేరువున్నా నిద్రపోతుంది
భాషవున్న అంతరంగంలో
జ్జాలకాల సందుగలో
అలికిడిచేయని సర్పం

అప్పుడప్పుడు
ఏకంతసమూహంలో
గోడమీదవాలి చూపిస్తుంది
రంగులేనిరూపం
కళ్ళకి ఆనని నీడ

అది ఒక తోడు అంటే ఒప్పుకోని మనసుతోటి
దేహంతోటి బంధాలు దహనక్రియదాక ..