పరిచయం

ప్రాచీన కధా లహరికి ఆధునికత నిచ్చిన భావ మౌక్తికాల సరాగమాల డా. ముక్తేవి భారతి

జనవరి 2014

తెలుగుతో పాటు చరిత్రలోనూ స్నాతకోత్తర పట్టభద్రులై భాష శాస్త్ర౦ అభ్యసించి చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసిన సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతల నిర్వహణతో పాటు సవ్య సాచిలా సాహిత్య ప్రపంచంలోనూ మని రత్నంలా వెలిగారు. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కధా సంపుటాలు ,ఎనిమిది నవలలు ,ఎనిమిది సాంఘిక నవలలు ,5మోనోగ్రాఫ్ లు ఒక కవితా సంకలనం నాలుగు వ్యాస సంకలనాలతో వివిధ పత్రికలలో ఎన్నో కాలమ్స్ రాసి , రాస్తూ సాహితీ సదస్సులలో నిరంతరం పాల్గొంటూ అత్యుత్తమ సత్కారాలు పొంది నిరంతరం సాహితీ క్షేత్రం లో విరాజిల్లుతున్న విదుషీమణి డా. ముక్తేవి భారతి.

చిరునవ్వుతో ఆప్యాయత కలగలిపి పలకరించడం ఆమె విలక్షణత.1963 లో తొలి కధారచన “చెల్లాయి పెళ్లి” మొదలు ఇప్పటికీ రచనా వ్యాసంగం కొనసాగిస్తూనే ఉన్నారు. అన్ని ప్రక్రియల్లోకి ఇష్టమైనది కధారచన అప్పటి సంస్స్కరనలతో మొదలైన కదా రచన ఇప్పటి ఆధునిక జీవన విధానం వరకూ కొనసాగుతూనే ఉంది. విధవా వివాహం, బాల్య వివాహాలు ,ఉద్యోగినుల బాధలు -మొత్తానికి స్త్రీ సమస్యల చిత్రీకరణతో సాగేవి ఆమె కధలు. ధర్మ గంట మొగాడు కధాసంపుటి , ముఖ్యంగా వృద్ధుల సమస్యపై రాసిన ఆ కదా కు గొప్ప గుర్తింపు స్పందన లభించింది . రాసిన ప్రతికధా ఒక స్పందన , ఒక సంఘర్షణ , జీవన నేపధ్యంలో౦చే వచ్చాయంటారు.

మార్పు, విప్లవం యువతను౦డే రావాలి, ఇంట్లో వాతావరణం సహకరించాలి,కాలానుగునంగా మారనప్పుడు సంఘర్షణ అనివార్యమని అంటారు. కధ మనచుట్టూ జరిగే సంఘటనల్లో౦చే పుట్టుకు వస్తుంది.పాత తరంతో పాటు కొత్త తరాన్నీ అధ్యయనం చేసిన రచయిత్రి పాత కొత్తల మేలు కలయికలో జీవనవిధానం ,కుటుంబ వ్యవస్థ వ్యక్తిగత ఆనందం సమపాళ్ళలో ఉండాలని అభిలషిస్తున్నారు. ఎదుటి వారిలో మార్పు కోరుకునేముందు ఎవరికి వారు మారవలసిన ఆవశ్యకత,అనూహ్యమైన ,ప్రచండ వేగంతో వస్తున్నా మార్పుతో పాటు మానవీయత మృగ్యం కాకుండా చూడవలసిన బాధ్యతా రచనలదే అంటారు.

సాహిత్యం విలువ సతత హరితం. సమాజానికి చుక్కాని సాహిత్యమే. అయితే ప్రస్తుత పరిస్థితులలో యాంత్రికత బారిన పడకుండా సజీవత నిలుపుకోవలసిన బాధ్యతా ప్రతి వ్యక్తిమీదా ఉంది. హోదాలకూ ,అధికారానికీ ,అమ్తస్తుకూ ఎవరిని వారు అమ్ముకునే వ్యవస్థ మారాలి. దానికి మూలం నిజాయితీ.నిజాయితీ అనేది ఉగ్గుపాలతో నేర్పవలసిన బాధ్యతా తల్లులదే. తల్లీ పిల్లల మధ్య సాన్నిహిత్యం అవగాహనకు చక్కని రాచబాట అవుతుంది. ప్రతి తల్లీ ఒక గురువైనప్పుడు , మన పాఠాలలో నీటి నిజాయితీ లను చేర్చినప్పుడు మార్పు ఇమ్తినుమ్డే మొదలవుతుంది. అందుకే ప్రాచీన సాహిత్యాలలో సారాని మామూలు వాడుక భాషలో కధలుగా అందించాను. దానివల్ల చరిత్ర అనేది మరుగున పడదు.

అవార్డ్ ల విషయానికి వస్తే అవి తీసుకునేందుకు నిజాయితీ ఉండాలి. తీసుకున్నాక బాధ్యతా గుర్తుంచుకోవాలి. అనువాదాలు అవసరం ఒకరినుండి మరొకరు ఎన్నో విషయాలు తెలుసుకుందుకు , సంస్కృతిని పంచుకు నేందుకు. సాహిత్యంలో నిరంతరకృషి జీవన లక్షణం ,జీవలక్ష్యం అంటున్న రచయిత్రి డా. ముక్తేవి భారతి. ఎన్నో పురస్కారాలతో పాటు ప్రతిష్టాత్మకమైన జాషువా విశిష్ట మహిళా పురస్కారం , గురజాడ పురస్కారం అందుకున్నారు. ఈ నాటి రచయిత్రులలో చిరస్మరణీయులు , ప్రముఖులు.

-స్వాతీ శ్రీపాద
-రేణుక అయోలా