పుట్టింది మొదలు ఘడియ ఘడియనూ
ముడిపెడుతూ జీవనదిలా సాగుతూ పోయేది
ఈ దారమే!
అవ్యక్తంగా మొదలైన జీవితానికి
అమ్మ దిష్టి పూస కట్టినా,
కంట నలుసుతీసేందుకు
వేడి ఆవిరి ముద్దయ్యే
అమ్మ కొంగైనా,
ఈ దారమే!
మెడకు చుట్టుకున్నా
ఇంకొకరి మెడకు చుట్టినా
ఈ దారమే!
గుప్పెడంత
గూట్లో
రగులుతూ వెలుగు
నింపే వత్తీ ఇదే!
***
ఇది దారమే కాదు-
తీయని బాధ కూడా!
భావాల
మధ్య పెనవేసుకునేదీ
అహంభావాల కుదుపుల్లో
నలిగి చిద్రమౌతున్నదీ కూడా ఇదే!
పోగులు పోగులై విడిపోయే
ఈజ్ఞాపకాల దారాన్ని
ఏ వూపిరితో నేసాడో కానీ,
పిగిలిపోతున్నపుడల్లా
గుండెను
కుట్టుకుంటునే వస్తోంది.
ఏ రాట్నం మీదదో
ఏ నేతగాడి చేతిదో
తెలియదు!
ఈ ప్రయాణం పొడవునా
వీలుంటే ఆపైనా,
ఘడియ ఘడియకూ
అతుకు వెయ్యాలని
ప్రయత్నిస్తూ
అతక లేక దుఃఖిస్తూ…
డా . విజయబాబు గారూ
మీ కవిత చాలా బాగుంది . అభినందనలు
శ్రీ మూర్తి గారూ,
కృతజ్ఞతలు!
Vijaya Babu
: )… anubhavalane pogula sammelanam ee daaram… anni daaraala samaahaaame jeevitham…
“పోగులు పోగులై విడిపోయే
ఈజ్ఞాపకాల దారాన్ని
ఏ వూపిరితో నేసాడో కానీ,
పిగిలిపోతున్నపుడల్లా
గుండెను
కుట్టుకుంటునే వస్తోంది.”
వావ్! చాలా బాగా చెప్పారు. మంచి కవిత.
బంధం చాలా అందంగా ఆలోచన కలిగిస్తూ జీవితాన్ని పూర్థిగా బంధించింది
మంచి కవిత
304, MAYURI HEIGHTS
OPP KING మార్కెట్
కర్నూల్ – 518001
విజయ బాబు రచించిన కవిత చాల బాగుంది. చివర రాసిన చరణాన్నిబొమ్మ బాగా సూచిస్తుంది. కవిత మానవ జీవితాన్నిబాగా వివరిస్తుంది. మానవ జీవితాన్ని బాగు చేసేదిగా ఉన్న కవితలన్నీ ఘనమైనవి. కవి మిత్రులకు నా ధన్యవాదాలు.
మనసును హత్తుకునే భావం, తేలికైన పదాలతో సరళమైన భాష, ప్రతి మనసు భావన వ్యక్తీకరించిన కవిత. అభినందనలు. మరిన్ని కవితలు ఆశిస్తాం.
- పద్మ
శ్రీ రామకృష్ణా రెడ్డి గారికి, డా. శరత్ బాబు గార్కి , శ్రీమతి వరలక్ష్మి , పద్మ గార్లకి నమస్సులు. మీ ప్రశంస కు ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
- విజయబాబు
Dr. Vijaya Babu garu
మీరు విషయంగా ఒక అతి పరిచితమైన సింపల్ వస్తువుని ఎంచుకుని ఎంతో గూడమైన లోతుల్లోకి దాన్ని అల్లుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంది.
regards
వకుళ గారూ మీ పరిశీలన, ప్రశంస చాలా సంతోషం కలిగించాయి. ధన్యవాదాలు.
మీరు రాసిన ఈ బంధం అనే అక్షర బంధం చాలా అద్భుతంగా ఉంది బాబాయి.
బంధం కవిత చాలా అర్ధవంతం గా వుంది అభినందనలు విజయ్ బాబుగారూ !
కృతజ్ఞతలు శ్రీ నాగేశ్వర రావు గారు . మీ వంటి మిత్రుల ప్రోత్సాహం ఎప్పటికీ ఉత్సాహాన్నిస్తుంది.
Thank you డియర్ పెరుమాళ్!
chala baagundi sir mi BANDAM.
విజయ బాబు నీ కధలు కవితలు బాగున్నాయి
Sir meeru raastunna ee kavithalu chustunte aanandam tho notiki maata ravatam ledu sir kaani aanandanni maatram pondhutunnanu..