ఆ గట్టు మీంచి ఈ గట్టుకి రివ్వురివ్వున దూకే మెరుపు పురుగు రెక్కవిరిగిన చప్పుడుకి గుండె గుభేల్మంటుంది. బండి లాంటి వెండి వాడు నడుస్తూ నడుస్తూ అలా.. ఆ మలుపు లోయలో జారిపడి కళ్ళ ముందే శూన్యమైపోయినప్పుడు- పగిలిన కాలానికి, మిగిలిన నిశ్శబ్దానికి మనసు బరువై దివులౌతుంది.
నలుపు తెలుపు దారాల్ని పెనేసి నేసిన వస్త్రం – కాలం. నా అంతరంగాన ఎగిసిపడే మిశ్ర వర్ణ భావాల తరంగం – సాయంత్రం. కొన్ని సాయంత్రాలు ఆలోచనా సముద్రాలుగా మారతాయి. మరి కొన్ని సాయంకాలాలు కోకిల విషాద గానంలా, కిలకిలలు లేని పక్షిగూడులా అనిపిస్తాయి. బోసిగా, ఖాళీ గా.. శీతాకాలంలో లేక్ పక్క ఇల్లు లా..!
ఓ సాయంత్రం రామప్ప దేవాలయంలో, వాలిపోతున్న పొద్దులో కూలిన స్థూపాన్ని చూస్తున్నప్పుడు నాకు పూర్వజన్మ మరణం గుర్తొచ్చినట్టైంది. చివరి శ్వాస తీస్తూ, అప్పుడు నే వినని సన్న మూనుగేదో వినొస్తూ… ఎంత వైరాగ్యమేసిందనీ!
ఒక్కో సాయంత్రం ఏమనిపిస్తుందంటే, గొప్ప ఆత్మీయుడు ఎదురై మొహంలోకి చూసి కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇదేమిటని విస్తుపోతూ చూస్తిని కదా, తలొంచుకుపోతున్నట్టు కనిపిస్తుంది ఆ ఆకారం. ‘ఏం మాట్లాడమంటావ్ మిత్రమా!’ అంటూ శొక భారంతో భుజాలు కుంగి, చేయని నేరానికి బలి అవుతున్నట్టు.. ఉరి కంబం ఎక్కబోతున్నట్టు అగుపిస్తుంది..
***
రోజూ అకాశాన్ని డై చేస్తుంటారెవరో. తెల్ల చీరకి నల్ల రంగు పులుముతున్న ఆ క్షణం.. చెప్పలేనంత గుబులు పుట్టించే కాలం. నా చూపులకదొక మౌన ద్వీపం.
కాల చక్రాల బండి జంక్షన్లో ఆగినప్పుడు దిగుతూ ఒకరు..ఎక్కబోతూ మరొకరు అభిముఖులై ఏదో సంభాషించుకుంటూ కనిపిస్తారు. ఏం మాట్లాడుకుంటారు? అంతా వినిపిస్తూనే వుంటుంది. కానీ అనువదించేందుకే భాష లేదంటుంది.
ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన విజయునికైనా …వెను తిరిగి రావడమే అసలైన గమ్యమా? ఎంత ఎదిగిన వీరుని వెలుగూ చివరికి చీకట్లో కలిసి మాయమైపోయేందుకేనా? అసలెందుకూ రావడం సాయంత్రం?- తీరిగ్గా తగుదునమ్మా అంటూ? కొన్ని సందేహాత్మక సన్నివేశాలను తిరగ తోడుకుని, ఆ పైన చర్చించుకుని ఒక తెగిపోయే నిశ్చయానికి రావడం కన్నా.. వాటిమానాన వాట్లని వదిలేయడమే సబబు అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ నడక పూర్తయ్యేలోపు ఎక్కడో ఓ మనిషి ఎదురవకపోతాడా.. ఎప్పుడో ఓ అప్పుడు ఈ చింత తీర్చకపోతాడా అనే ధీమా నాకెప్పుడూ భరోసా నిస్తూనే వుంటుంది.
వృక్ష ఛాయల నడిచే వానికి ఎండ బాధించదు. శోధకుల వెంట సాగే మనిషికి మాట సాయం దొరక్కా పోదు. దొరికింది. అలానే దొరికిందీ పోయెమ్.
‘సాయంత్రం వస్తే రానీ.. బెంగ ఎందుకు పోతావ్’ అని ఒక సత్యాన్ని వివరిస్తూ.. మీరూ చదివి చూస్తారు కదూ?
LET EVENING COME
- Jane Kenyon
Let the light of late afternoon
shine through chinks in the barn, moving
up the bales as the sun moves down.
Let the cricket take up chafing
as a woman takes up her needles
and her yarn. Let evening come.
Let dew collect on the hoe abandoned
in long grass. Let the stars appear
and the moon disclose her silver horn.
Let the fox go back to its sandy den.
Let the wind die down. Let the shed
go back inside. Let evening come.
To the bottle in the ditch, to the scoop
in the oats, to air in the lung
let evening come.
Let it come, as it will, and don’t
be afraid. God does not leave us
comfortless, so let evening come.
**** (*) ****
ఎంత పొయెటిక్ గా రాసారండి. చాలా బాగుంది.
ధన్యవాదాలు రామకృష్ణ గారు.
శుభాభాకాంక్షలతో..
..
మీకు ఈ పోయెమ్ దొరకటం …మా అదృష్టం. అధ్బుతం!!
సురేష్, మీ లాంటి గొప్ప పాఠకుడు దొరకడం రైటర్స్ అదృష్టం.
ఎంత శ్రద్ధగా చదివి, ఆనందిస్తారు సాహిత్యాన్ని. నిజంగా అద్భుతం గా వుంటుంది నాకు.
చాలా చాలా థాంక్స్.
రోజూ ఆకాశాన్ని డై చేస్తుంటారెవరో..
మంచి భావన.
జేన్ కెన్యన్ పోయమ్ చాలా బాగుంది. ధన్యవాదాలు దమయంతీ.
థాంక్స్ భానక్కా..!
మీ ప్రశంస నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది.
నమస్సులతో..
మీ
సోదరి.
దమయంతీ !
హృదయం అనుభూతితో నిండి ఆనందంతో తొణికిస లాడింది .
ఎంత అందమైన చిక్కని కవిత్వం ..ప్రతీ వాక్యమూ మనసుని తాకి
ఒక చిరుగాలి స్పర్శ లా హాయిగా అనిపించింది ..
సాయంత్ర వర్ణన అద్భువృక్ష ఛాయల నడిచే వానికి ఎండ బాధించదు. శోధకుల వెంట సాగే మనిషికి మాట సాయం దొరక్కా పోదు. దొరికింది. అలానే దొరికిందీ పోయెమ్.
‘సాయంత్రం వస్తే రానీ.. బెంగ ఎందుకు పోతావ్’ అని ఒక సత్యాన్ని వివరిస్తూ.. మీరూ చదివి చూస్తారు కదూ?
ధన్యవాదాలు దమయంతీ ..మంచి అనంభవ కవిత్వం మాకు పంచినందుకు
వసంత లక్ష్మి ..
రవి గారు అననే అన్నారు వసంత.
పోనీ కవిత గా రాయండి అని.
నా సాయంత్రం మీద భావానికి సమీపమ్గ వుంది ఆమె కవిత అనిపించి మాటల్లో మాటల్ని పరిచా.
నా భావం – ఆమె కవిత్వం గా.
థాంక్స్ వసంత. అందమైన మీ స్పందన తెలియచేసినందుకు.
చాలా బావుంది దమయంతి గారూ, ప్రతి వాక్యమూ రెండు సార్లు చదువుకునేంత అందంగా….
చాలా థాంక్స్ రాధా, మీ అందమైన స్పందన నాకెంతో నచ్చింది.
చాలా బాగుందండీ దమయంతి గారూ! హృదయాన్ని తాకే మీ అద్భుత పరిచయమూ జేన్ పద్యమూ –
వృక్ష ఛాయల నడిచే వానికి ఎండ బాధించదు. శోధకుల వెంట సాగే మనిషికి మాట సాయం దొరక్కా పోదు. దొరికింది
అట్లానే మీ పరిచయమూ కూడా – నెనర్లు!
నారాయణ స్వామీ గారూ!
మీతో ఇలా పరిచయం కలగడం చాలా సంతోషం గా వుంది.
చాలా ధన్యవాదాలు. – మీ స్పందన తెలియచేసినందుకు.
శుభాకాంక్షలతో..
“కాల చక్రాల బండి జంక్షన్లో ఆగినప్పుడు దిగుతూ ఒకరు..ఎక్కబోతూ మరొకరు అభిముఖులై ఏదో సంభాషించుకుంటూ కనిపిస్తారు. ఏం మాట్లాడుకుంటారు? అంతా వినిపిస్తూనే వుంటుంది. కానీ అనువదించేందుకే భాష లేదంటుంది.”
భావ గర్భితమై మనసుకు తోడై నిలిచే రచన. Kenyon కవితను తోడు చేసినందుకు ప్రత్యేక అభినందనలు.
ధన్యవాదాలు విజయ బాబు గారు!
శుభాభినందనలతో..
నా చూపులకదొక మౌన ద్వీపం…పదప్రయోగం బాగుంది….! అంతరంగంలోని ‘దిగుళ్ళు’ మనిషి తో సంభాషిస్తే ఇలాగే ఉంటుందేమో ! మనం వ్రాసే భాషనైతే – అనువదించగలం….కాని ఆలోచనల్ని అనువదించలేముగా ?! భాషలో ప్రతిధ్వనింపజేయగలంగాని తర్జుమా చెయ్యలేం…చేసేశాం…అనుకున్నా – అది తృప్తి నివ్వదు….ఇది నా అభిప్రాయం మాత్రమేసుమా! దమయంతి “రచన” బాగుంది . ఆత్మగతంగా వ్రాసినట్లనిపించింది .
హైమ అక్కా! చాలా చక్కటి భావనతో కూడిన అభిప్రాయాన్ని అందచేసారు.
ధన్యవాదాలు మీకు.