ఇప్పుడు నాకు విషాదమే అవసరమైంది
జడలు విప్పిన విషాదం
అది నన్ను గుచ్చి గుచ్చి బాధపెట్టి
నాకో వ్యథను మిగిల్చాలనుంది
నాకు బాధే కావాలి
ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను
కాల్చేసే మంటొకటి
నాకిప్పుడు అవసరం
ఆ కాలుతున్న బాధే నాకిప్పుడు కావాలి
హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని
పలుగులతో తొలగించే నొప్పి కావాలి
ఆ పలుగు చేసే గాయం కావాలి
గుండెలోతుల్లో ఘనీభవించిన ఆమె మధురానుభూతులను
ఎగదోసి రగిలించి
కరిగించే సెగ కావాలి
ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి
ఆమె అంతర్ సౌందర్యాన్ని
అతికించుకొన్న మనసుపొరలను
విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి
ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం
మనసును పదే పదే తడుముతూ
ఎంత ఎండినా ఆవిరవని ఆమె జ్ఞాపకాలను
నిలదీసి అంటించే అగ్గొకటి కావాలి
విరబూసిన మా కలల విరితోటలను
కబళించి దహించే దావానలం కావాలి
నన్నో జీవశ్ఛవం చేసే
నన్ను భౌతికంగా మాయంచేసే
నా గుండెను రాయిగ మార్చి
ఇంద్రజాలికుడొకడు నాకు ఎదురవ్వాలి
అవును..
నాకొక విషాదం కావాలి………!
హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని
పలుగులతో తొలగించే నొప్పి కావాలి
ఆ పలుగు చేసే గాయం కావాలి
గుండెలోతుల్లో ఘనీభవించిన ఆమె మధురానుభూతులను
ఎగదోసి రగిలించి
కరిగించే సెగ కావాలి
ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి
ఆమె అంతర్ సౌందర్యాన్ని…exlent words sir
అతికించుకొన్న మనసుపొరలను
విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి
ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం
ఆమె జ్ఞాపకాలే ఊపిరి చేసుకొని ,ఆమెను మనోమందిరాన్ని చేసుకుని ఆమె నీవు నీవే ఆమెగా మారిన నీ నుండి ఆమెను విడదీయతమంటే నీకు నువ్వు చితి పెర్చుకోవడమే
gundenu raaega cheese indrajaalikudokadu kaavaali…grt ..expression of a sensitive heart….veedhnchee aame gnapakaalaloonchi vidudalaky oka hrudaveedana telipee sangharshana..grt …, viraboosina kalala viritoota nu kabalinchee davaanalam…grt words of poets heights of literary knowledge negative ness of a positive dreams.. standard poem.
dhanyavadhalu anuradha garu
విషాదాన్ని అత్యద్భుతం గా పండించారు సురేష్ గారు వేదన కూడా ఇంత మధురం గా వర్ణించారు ఎంతకి ఆవిరవ్వని జ్ఞాపకాలు అగ్ని కి మాత్రం ఆహుతవుతాయా గుండె ని రాయి గా చేసే ఇంద్రజాలమే ఉంటె విశ్వం లో ఇన్ని వేదనలు విరహాలు ఉండవు గా విరబూసిన నా కలల తోట కబళించే దావానలం ఉంది అంటే అది మండే నా చితి మంటే అవును ప్రియా నా మరణం తోనే అది సాధ్యం
ఈ కవిత చదివి చెమ్మగిల్లిన మా కళ్ళను తుడిచే చెయ్యోకటి కావాలి…చాలా బాగారాసారు సురేష్ గారు..
ధన్యవాదాలు పద్మశ్రీ గారు, లక్ష్మి ఎలమ౦చిలి గారూ, శశిబాల గారు, అదూరి ఇన్నారెడ్డి గారు నా కవితపైన కామె౦ట్ చేసిన౦దులకు
మంచి బాష.భావాలు ఆకాశాన్నంటాయి.
విషాదాన్ని మరచిపోవడానికి మల్లి విషాదాన్నే ఎంచుకోవడం ఈ కవిత యొక్క అగ్రస్థానం.బాషపై మంచి పట్టు ఆరాధన గోచరిస్తున్నాయి,ఏ ఒక్క అక్షరం కూడా అసంధర్భంగా లేదు.మంచి కవిత్వాన్ని అందించిన సురేష్ గారికి అభినందనలు.
thank you kavya sree garu for your nice comment
నన్ను భౌతికంగా మాయంచేసే
నా గుండెను రాయిగ మార్చి
ఇంద్రజాలికుడొకడు నాకు ఎదురవ్వాలి
అవును..
నాకొక విషాదం కావాలి………!… చాలా నచ్చింది సార్.. కవిత భావం హత్తుకుంది..
మనసును పదే పదే తడుముతూ
ఎంత ఎండినా ఆవిరవని ఆమె జ్ఞాపకాలను
నిలదీసి అంటించే అగ్గొకటి కావాలి…… chala chala baga rasaru annaya.. to be frank soooo jelous abt u annaya..
dhanyavadhalu varma jee! and sonia chodary sister
అద్భుతమైన కవిత. భావ పరంపర ఉవ్వెత్తుగా ఎగసింది.
గరికపాటి పవన్ కుమార్
కవిత పేరు “నాకొక విషాదం కావాలి…!” అంటె బాగుంటుంది అని నా అభిప్రాయం.
గరికపాటి పవన్ కుమార్
ధన్యవాదాలు పవన్. మొదట మీరు ఊహి౦చినట్లుగానీ నాకొక విషాద౦ టైటిల్ పెట్టాను. తర్వాత మార్చారు.
-అతికించుకొన్న మనసుపొరలనువిడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం- ee vishaadham antha .. ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను కాల్చేసేenduku kadhaa … edho tadi aa jnapakala venaka vishadham lone vundi vishadham kavalantaarea?
మెర్సీ మేడమ్! కొన్నిజ్ఞాపకాలు ఎప్పుడూ తడుముతూ ఉంటాయి. వాటి ముప్పేట దాడి జరుగుతూనే ఉంటుంది. విరామం తర్వాత వచ్చే అలల వలే అవి దేహాన్ని తాకుతూనే ఉంటాయి. అవి పెట్టే బాధ కన్నా తీవ్రంగా ఉండే విషాదం అవసరమని …ధన్యవాదాలు
babai ur poetry is simply superb.Especially wen i read the last 6 lines really i thought tht it should be there in each and every one’s life.Because in every ones life our feelings will be hurted at some or othertime.really i loved those last lines.they r really heart touching.
ప్రశా౦తి…నీ పరిశీలనకు మొదట విషస్ చెపుతున్నాను. జీవిత౦ లో ఎదురైన స౦ఘటనలతోనే స్ప౦దన.
<<<<<<<<<<<<<>>>>>>>>>>వావ్ సురేష్ వావ్…ఎక్ష్చల్లన్త్త్ వర్డ్స్ ..నిజం గా చదివిన తరువాత చాల సేపటి వరకు ఏమి చెప్పాలో అర్ధ కాలేదు ….నిజమైన ప్రేమ దూరం ఐతే ఇలా ఉంటుందేమో అనిపించింది . ఒకింత కళ్ళు చెమ్మ గిల్లాయి ..చాల సేపటివరకు భావనలు అలానే ఉంది పోయాయి మదిలో ,,,
<<<>>
మీరే ఈ కవితతో ఇంద్ర జాలం చేసేసారు గా మరి …..ఇంకో ఇంద్రజాలికుడు ఎందుకు ?..
Quite amazing…n excellent perfomance….really really fabulous ..keep it up suresg