కవిత్వం

దయగల్ల లోకంలో…

అక్టోబర్ 2015

మ్మకాలు చెదిరిపోతాయి. నటనలు
వ్యవస్థీకృతమవుతాయి. వాగ్దానాలు
వట్టిపోతాయి. అబద్ధాలు ఆశువుగా
జాలువారతాయి. సందర్భాలు
త్రిశంకుస్వర్గంలో వేలాడదీస్తాయి.
నిశ్శబ్దం గడ్డకట్టుకుపోతుంది. మెదడుకు
దిక్కుతోచదు. దుఃఖించడానికి స్థలం
దొరకదు.

అలమటించి. అలసటించి. అటూఇటూ
పరుగులు. వొంటిపైన కనబడని దేవరోని
కొరడాదెబ్బలు. ఓడి, అల్లాడి, తండ్లాడి. నీ
కన్నీటి సముద్రంలోనే మునిగి, ఒకానొక
అర్ధరాత్రి సమయాన ఒక ఒంటరి చేపవై
ఒడ్డుకు చేరుకుంటావు.