
పోలీసు చర్య తరవాత హైదరాబాద్ స్టేట్ స్వరూపమే మారిపోయింది. దాంతోపాటు అందరి జీవితాలూ మారిపోయాయ్, ముఖ్యంగా స్త్రీల జీవితాల్లో చెప్పలేనంత మార్పు వచ్చింది. యీ మార్పు అకస్మాత్తుగా వచ్చిందని కాదు. అంతకుముందు పదేళ్లుగా నలుగుతూన్న మార్పు. హైదరాబాద్ ముస్లిం స్త్రీలు పరదా వ్యవస్థ నించి బయటపడుతూ ఇస్లామిక్ చదువు మాత్రమే కాకుండా బయటి చదువుల కోసం వెళ్తున్న కాలం. ఈ నవలలో వొక పాత్ర అన్నట్టు: “ముస్లిం సమాజానికి ఇవి ఇక చివరి రోజులు. ప్రళయం ఎంతో దూరాన లేదు!” ఉస్మానియా యూనివర్సిటీ మధ్య తరగతి వున్నత తరగతి ముస్లిం స్త్రీల జీవితాల్లో పెద్ద కుదుపు. అభ్యుదయ భావాలు రాజభవనాల గోడల్ని బద్దలు కొడుతున్న రోజులు.…
పూర్తిగా »
వ్యాఖ్యలు
dasaraju ramarao on కవిత్వం- ధ్వని, ప్రతిధ్వని
Resoju Malleshwar on ఛందోయుక్త కవిత్వం నేర్వటం ఎలా?
Yerriswamy Swamy on శైశవగీతి
Mani Sarma on కృతి
శ్రీధర్ చౌడారపు on సాక్షి