ఒక కవిత చదివి
తలదించుకుని
పొగిలి పొగిలి
ఏడుస్తోంది
ఆమెకు దుఃఖం
ఎలాగూ అనివార్యం
ఈ రోజుకీకారణంగా
ఈ కవిత దొరికింది
పూర్తిగా »
ఒక కవిత చదివి
తలదించుకుని
పొగిలి పొగిలి
ఏడుస్తోంది
ఆమెకు దుఃఖం
ఎలాగూ అనివార్యం
ఈ రోజుకీకారణంగా
ఈ కవిత దొరికింది
పూర్తిగా »
ఆకాశంలో వేలాడే మేఘాలు
అంతరమధ్యన ఊగుతుండగా
రాయడానికి కూర్చుంటాను
కిటికీ తలుపులను గాలి తడుతుండగా
అది తీసే ముందు
కాగితాలను సర్దుకుంటాను
పూర్తిగా »
రవయిత: సుజాత
అనువాదం: అవినేని భాస్కర్
కాలేజినుండి తిరిగొస్తుండగా వర్షం బలపడి, చివరి ఫర్లాంగ్ లో ముద్దగా తడిసిపోయింది రాజ్యలక్ష్మి. ఇది చాలదన్నట్టు రయ్యిమని పోతున్న సిటీబస్సొకటి బురద నీళ్లని వంటిమీద చిమ్మేసిపోయేసరికి ఇల్లు చేరేసరికి కోపం నషాళానికంటింది. పాలవాడు రాలేదు. మేనక ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంట్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. అమె కళ్ళల్లో కోపం తాండవిస్తోంది. గుప్పిళ్ళు బిగించడంతో, రక్తం స్థానచలనం చెంది మణికట్టు పాలిపోయింది.
రాజ్యలక్ష్మీ, కోపాన్నితగ్గించుకో. లేకపోతే బ్లడ్‌ప్రెషర్ తగ్గదు. పాలురాకపోతే పోనీ? మేనక లేట్ గా వస్తే రానీ? ఫోన్ అలా మోగి చావనీ..
మేనక భయపడుతూ సైకిల్ దిగింది.
మెజనైన్ ఫ్లోర్ దాటగానే మహాసభల మొదటి హాల్ కనిపించింది. ఎయిర్ కండిషన్డ్ కావడంతో తలుపులు బిగించారు. లోపలి మాటలు వినబడటం లేదు. అప్పుడప్పుడు డెలిగేట్లు ఎవరో ఒకరు టాయ్లెట్ కోసమో, జీడిపప్పు కేక్ సహితం తయారుగా ఉన్న కాఫీ కోసమో తలుపు తీసినప్పుడు "అతను అంతర్జాతీయ కవి. ఫిజీ దీవి ప్రజలకొరకు కళ్ళుచెమర్చుతూ కవితలు రాసినాడు. మహాకాళి రష్యాదేశాన్ని కరుణించింది... అని రష్యా విప్లవాన్ని పాడినాడు" ఒక వక్త ఆవేశ ప్రసంగంతో మహాసభ దద్దరిల్లుతోంది.
పూర్తిగా »
అక్కడా ఇక్కడా
ఎక్కడెక్కడో అల్లల్లాడి
అలసి సొలసి వేసారిన తెమ్మెర
పడకకై వెతికింది
ఆ రాత్రి కునుకుతీద్దామనిపూవులను పరచి
పడుకుందాం అనుకుందికొన్ని పూలలో తేనెచుక్కలు
కొన్ని పూలలో మంచుముత్యాలు
కొన్ని పూలలో తుమ్మెదలు
పూవుల్లో ఖాళీల్లేవు
తెమ్మెర ముందుకు సాగింది
*
ఉద్యానవనంలో -
వెలుగు తుడవని
చిమ్మ చీకట్లో
నిద్రపోదాం అనుకుంది
అక్కడ -
ఏకాంతంగా ప్రేమికులు
తెమ్మెర దూరి వెళ్ళేందుకు
వారి బిగికౌగిట సందులేదు
ఆశ్చర్యపోయి, ఓసారి తిరిగి చూసి
వెను తిరిగింది తెమ్మెర.
*
తెమ్మెరకు…
పూర్తిగా »
నన్ను క్షమించండి
తేనెటీగలు వెంటబడితే
చెల్లాచెదురై పరుగుతీసే పిల్లల్లా
గబగబా ప్రయాణానికి బయల్దేరే
ఉల్లాస జీవుల్లారా
నన్ను క్షమించండి
మీతో పరుగు
అసాధ్యం నాకు
నన్ను వెంబడించడం
వీలుకాదు మీకు
పెట్టెలో మీ
బట్టలతోబాటు దుఃఖాలనూ
కుక్కుకుంటున్న యాత్రికులారా
కండరాలు గట్టిబడి
కొయ్యబారిపోయాక
హఠాత్తుగా ఆత్మవికాసమంటూ
బయలుదేరిన పర్యాటకులారా
త్వరత్వరగా మనుషులవ్వాలని
ఆశపడిన సంచారులారా
వీపున గూటినిమోసే నత్తల్లా
గుండెల్లో ఇల్లుమోసుకుంటూ
విహారానికి బయలుదేరిన ప్రయాణికులారా
మీతో పరుగు
అసాధ్యం నాకు
నన్ను వెంబడించడం
వీలుకాదు మీకు
*
మీరు పక్షులను…
పూర్తిగా »
నోటికందిన పువ్వులో
మధువు సేవించి ఎగిరుంటుందా?
ఇప్పుడు ముళ్ళకంపలో
శవమై వేలాడుతూంటుందా?
ఒంటిరెక్కతో పాకుతూ
మరోరెక్కకై వెతుకుతుందా?
చీమల పుట్టలో వేయిముక్కలై
సమాధి అయ్యుంటుందా?
పూర్తిగా »
( ప్రపంచంతో మనసుకున్న బంధాలు తెగ్గొట్టుకుని గాఢనిద్రా కడలిలో మునిగిపోయి, ఆ లోతుల్లోకి తనువును జార్చుకునే నడిజాముల్లో ఒక్కోసారి నా ఫోను మ్రోగుతుంది. తీస్తే, “నేను కెనడానుండి మాట్లాడుతున్నాను” అని ఒక ఆడ గొంతు పలుకుతుంది. ఆ శ్రీలంక సోదరి నన్ను మాటిమాటికీ అడిగే ప్రశ్న : “ఎప్పుడెప్పుడు కవిత రాస్తారు? కవితకి ఏది ఇంధనం?” అన్నదే. నిద్ర మత్తులో ఒక సారైనా సరిగ్గా జవాబు చెప్పలేదు. కవిత్వంలో చెప్పగలనేమో చూస్తాను)
ఎప్పుడెప్పుడు మనసులో
ఆకారం తెలియని మంచుపొర కమ్ముకుని
చెదిరిపోతుందో
ఎప్పుడెప్పుడు పాషాణ హృదయం
మెత్తబడి మెత్తబడి
నీరవుతుందో
వెంటనే కరిగి ప్రవహించందే
ప్రాణం గడ్డకట్టిపోయే ప్రమాదముందని
పూర్తిగా »
వెలుతురు శిల్పంలా కళ్ళల్లో నీ రూపం
కిరణాల అంచులకి గుచ్చుకుంటూ
నరాల్లో పాకుతూ నీ జ్ఞాపకాలు
ఏడుపుదీవిలో ఏకాకినైపోయాను
గాయం మాన్పుకోవాలి
ఎక్కణ్ణుండొచ్చావో… రెక్కలు తొడిగావు
ఎగరగల్గినంతా ఎగిరాను, హఠాత్తుగా ఏమైందో – తెలీదు.
కఠినమైన యథార్థంమీద వేగంగా మోదుకుని
వేసవి సుడిగాలిలో దిశకొక రేణువుగా ఎగిరిపోయాను
ఇదిగో ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను నేను దోసిట్లో పోగుచేసుకుంటున్నాను
వైరాగ్యాన్ని బలవంతంగా పులుముకుంటున్నాను
సున్నితత్వానికి తెలిసింది హింసించడమొక్కటే!
తెలుసు, అన్నీ తెలుసు తెలియకూడని వాటితో సహా అన్నీ తెలుసు
తీగ వదిలేసిందనో పువ్వే వదిలించుకుందనో నిందించడం తప్ప!
కొత్త మొగ్గ తొడగడం చూసి శపించడం తప్ప
ఇలాగే
ఇంతకు మునుపు
ఎందరి మనసుల్లో ఉన్నావో
ఎవరెవరి కళ్ళల్లో నిండావో
ఎన్నెన్ని జ్ఞాపకాలని మిగిల్చావో
ఎవరెవరి గమనాన్ని మార్చావో
ఎన్ని రహస్యాలను నింపుంటావో
*
ఇలాగే
ఇంతకు మునుపు
నీ కోసం గడియలు పెట్టుకుని
ఎవరైనా ఏడ్చుండచ్చు
నీ కోసం చయ్యకూడని ద్రోహమోకటి చేసుండచ్చు
నీ కోసం అపురూపమైన దేన్నో తాకట్టు పెట్టుండచ్చు
నీ కోసం పోగొట్టుకోకూడని దేన్నో పోగొట్టుకుని ఉండచ్చు
*
ఇలాగే
ఇంతకు మునుపు
ఋతువు తల్లకిందులు అయినాయా
నీ ప్రభావంతో ఎగసిన జ్వాలలు
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్