‘ అవ్వారి నాగరాజు ’ రచనలు

కొన్ని రోజుల తర్వాత

ఉద్వేగ రహిత మృత్యు సమానమైన కొన్ని రోజుల తర్వాత
తిరిగి లేచిన అతనిని

గడ్డ కట్టుక పోయిన రోజుల గురించి
రోజుల లోతులలో ఇరుక్కపోయిన శిలాజ సదృశ సందర్భాల గురించి
సందర్భాలలో మిణుక్కున మెరిసే
ఉద్వేగ సంబంధిత సజీవ సంస్పందనల గురించి వాళ్ళు తరచి తరచి అడిగారు

ప్రతీ ప్రశ్నకూ అతను మౌనాన్ని సమాధానంగా చెబుతూ
తనలో తను:

కొన్ని రోజులను మనము నిజంగానే మరణంలా, ఆభరణంలా ధరించాలి
రణగొణ ధ్వనుల జీవితం నుండి, మందమెక్కిన వ్యక్తులు, వ్యక్తీకరణలనుండి
దూరంగా ఉండాలి

సర్వమూ పరిత్యజించిన బైరాగిలా సంచరిస్తూ అన్నింటిలోనూ ఉంటూ
దేనిలోనూ లేకుండా చివరకు…
పూర్తిగా »

దోసకాయ పప్పు మరియు unsetteled wars

22-మార్చి-2013


ఎంతయినా పెళ్ళాల కంటే అమ్మలు చేసిన వంటలే నచ్చుతాయి మీకు అని భోజనం
వడ్డిస్తూ కాస్త ఆరోపణగా తను అంటున్నప్పుడు:

దోస కాయ పప్పుతో ముద్దమ్మటి ముద్ద కుక్కుకుంటూ లోలోపల తను ఇలా అనుకున్నాడు కదా-

అనేకానేకమై
నిబిఢాంతర్గత సంకేత జాలమై పొరలు పొరలుగా అలుముకపోయిన కీకారణ్యపు లోకంలో
దోసకాయ పప్పు దేనిని సూచించుచున్నది?
అదియునూ పచ్చి మిరపకాయలు వేసి అమ్మ వండిన దోసకాయ పప్పు-?

బహుశా కాసేపు దానినొక సేద తీర్చే గూటిగానో
దూరాన ఎక్కడో వెలిగే సన్నని దివ్వెగానో
పురానుభవాలవైపుగా ఒక అమాయకపు బాల్యం పేరుతో పొందే ఆశ్రయంగానో
ఇంకా ఏమిటేమిటిగానో అతను…
పూర్తిగా »

పాత నేరస్తుడు

15-ఫిబ్రవరి-2013


గుర్తుందా నీకు

మోకాళ్ళ వరకూ మట్టి కొట్టుకపోయిన కాళ్ళతో గొంతు కూర్చొని ఉన్న వసివాడని పిల్లల నడుమ దిస మొలతో
అర చేతులలో లావు పాటి లాఠీలు విరిగి తునాతునకలవుతున్నప్పుడు ఒడ్డున పడిన చేప పిల్లల వలే గిజగిజలాడి బాధతో వణుకుతున్నఆ లేత వేళ్ళతో
కాళ్ళ వెంట ఉచ్చ, దేహం యావత్తూ ఒక్కలా ప్రసరించే భయంతో

మట్టిలో నేలపై ఆ పిల్లలతో కలిసి హత్తుక కూర్చొని ఉన్న రోజు

సంవత్సరాలు గడచినా చెరగని అదే నిందితుని ముద్ర
ఊహించగలవు నువ్వు కన్న ఊరిని విడిచి అయిన వాళ్లను విడిచి రెక్కలు తెగిన పక్షివై యుగాల దూరంలో తిరుగాడుతున్నప్పుడు కూడా కశ్మీర్ నాగా…
పూర్తిగా »

దూరంగా

అప్పుడప్పుడయినా నీ లోకాన్ని ఒదిలి దిగివొచ్చి కిందికి
సర్వమూ విడిచి
ఇదిగో నీ దేహం నీ ఊహా సరికొత్తగా
అపపరిచితమై నిన్ను నీవు అన్ని విదిలించుకొని చూసినట్టుగా

ఎత్తయిన గుట్టపై కాకుంటె ఒకానొక అలల చింపిరి జుట్టు సముద్రం ముందర కదిలే ఆకుల సడి లీలగా

వస్తూ పోతూ ఉన్న కదలికల పురా పురా ఙ్ఞాపకాల ఆవరణంలో
తడి బారిన ఇసుక తీరాల ఒడ్డున చెరిగిపోయే పాదముద్రలతో ప్రాచీనపు దారులలో మలిగిన అడుగుల నిద్రిత నిరామయ ధ్వానంలో

బహుశా నిన్ను నీవు చూసుకుంటున్నప్పుడు
నీలోని ఖాళీ నీ చుట్టూ పరివ్యాపితమవుతున్నప్పుడు
పాడే పిట్టగొంతుకలోని పచ్చదనపు కాంతుల నడుమపూర్తిగా »

అమ్మకు ప్రేమతో

అలలను సవరిస్తూ దుఃఖపు సడిలో
ఒక ప్రవాహం ముంగిట నిలబడ్డాను

దరులను ఒరుసుక పారే నదికి
ఈ వైపు నేను ఆవైపు నేను

ప్రవాహం ఒక దూరమే కాదు
ఇద్దరినీ కలిపే ఒక దగ్గర కూడా

2
బహుశా నదికి తెలియదు
అనేకానేక చలనాల నడుమ గిరికీలుకొట్టే పక్షికీ తెలియదు

ఒకే సమయంలో సమాంతరంగా రెండు కాలాలు
అన్వేషణల ఒరిపిడిలో ఇద్దరు మనుషులు

3
నది ఇవాళే మా ఇంటి కొచ్చింది
యుగాలన్నీ ఇన్నాళ్ళూ ఉత్తినే దొర్లి పోయాయి

నది అంచున కవిత్వం
ఇప్పుడే కదా మొదలయింది
ప్రవాహం ఒక దూరమే…
పూర్తిగా »

అతడు నవ్విన రాత్రికి వెన్నెల పూచింది

ఒకానొక రాత్రి మిణుగురు పూల దారిలో
అతడిని నేను వెతుకుతుంటాను

అతడు మోరలెత్తి ఊగే ప్రవాహాలకు
మురళిని ఊదుతుంటాడు

పాడే పెదవులై
చేమంతి పువ్వలుగా విచ్చుకొనే అరమోడ్పు కన్నుల ఙ్ఞాపకం

అతడు ఉన్నట్టుండి
ఒక ఆకస్మిక కవి సమయంలా అదాటు పడతాడు

అతడు కొంచెం యుద్ధం
కొంచెం కవిత్వం
నాగేటి కర్రుకు పొదిగిన చంద్రవంక

ఒంటరి దుఃఖమయ సమయాలకు
సామూహిక స్వాప్నికతను అద్దే ఓడ సరంగు

అతడు కొంచెం బెంగ కూడా
కాలం ఙ్ఞాపకాలను అతడు ఒక తాత్వికతగా మోసుక తిరుగుతాడు

అతడిని నేను ఇలా అడుగుతాను
ఇంత దుఃఖం కదా ఎలా…
పూర్తిగా »