ఎంతయినా పెళ్ళాల కంటే అమ్మలు చేసిన వంటలే నచ్చుతాయి మీకు అని భోజనం
వడ్డిస్తూ కాస్త ఆరోపణగా తను అంటున్నప్పుడు:
దోస కాయ పప్పుతో ముద్దమ్మటి ముద్ద కుక్కుకుంటూ లోలోపల తను ఇలా అనుకున్నాడు కదా-
అనేకానేకమై
నిబిఢాంతర్గత సంకేత జాలమై పొరలు పొరలుగా అలుముకపోయిన కీకారణ్యపు లోకంలో
దోసకాయ పప్పు దేనిని సూచించుచున్నది?
అదియునూ పచ్చి మిరపకాయలు వేసి అమ్మ వండిన దోసకాయ పప్పు-?
బహుశా కాసేపు దానినొక సేద తీర్చే గూటిగానో
దూరాన ఎక్కడో వెలిగే సన్నని దివ్వెగానో
పురానుభవాలవైపుగా ఒక అమాయకపు బాల్యం పేరుతో పొందే ఆశ్రయంగానో
ఇంకా ఏమిటేమిటిగానో అతను తలపోసి లోలోతులకు తరచి చూస్తున్నప్పుడు
ఆమె అతనితో అన్నది కదా :
మీ అమ్మకు బొత్తిగా ఉన్న మతి కూడా పోయింది
ఇంట్లో జరిగే నానా పెంటా కనపడిన వాళ్ళకంతా చెప్పేయడమూ, తిరిగి వాళ్ళంతా
వచ్చి మళ్ళీ నాకు చెప్పడమున్నూ-
పప్పుగుత్తి కింద నలిగీ నలగని పచ్చి మిరప కారం అంగిట్లో ఎక్కడో తగిలి
తను అన్నాడు కదా:
ముసలి ముండకు ఉన్న మతి కూడా పోయినట్టుంది
ఇంకో గెంటెడు పప్పేసి తగలడు
డైరెక్ట్ పోయెమ్ లాగ లేదు .అనువాద కవియ్హ్వం లాగ వుంది . గ్రాంధిక భాష వాసన గప్పు మంటోంది
ఎందుకో జీవన వాస్తవాలు అర్ధం అవుతున్నా ఆ ప్రవాహం లో మనమూ కొట్టుకు పోతుంటాము …కవీ కొట్టుకు పోయాడు …అసహనంతో ….చేదు మిగిల్చింది…అంతే… ఔషదరూపం ఇస్తే బాగు అనుకొన్నా ……..