‘ ఆర్. దమయంతి ’ రచనలు

నువ్వు నేనూ ప్రేమా!

జూలై 2015


నువ్వు నేనూ ప్రేమా!

మచ్చ లేని చందమామని చూసే అవకాశం వుంటుందా? -’ ఓ యెస్. దాందేముంది. ఎవరైనా కొత్త శాస్త్రజ్ఞుడొచ్చి, చంద్రుని మీద ఆ నల్ల బండ తొలగించేస్తే, నిండు కాంతి బింబాన్ని చూశే అవకాశం వుండొచ్చు. కానీ, స్త్రీ ముఖ బింబం మీద విషాదాన్ని తొలగించగల సైంటిస్టు మాత్రం ఒక్కడూ లేడు. పుట్టలేదు. ఇక పుట్టడు.

ఎన్ని యుగాల్నించి చూడటం లేదని తను?’ ఆవేశం గా అనుకున్నా.

‘ఛ! అలానా? అంత గొప్ప యుగాల పురుషుడువేవిటి నువ్వు?’ – ఇంటర్ కనెక్షనోడి మాటలకి పెల్లుబుకొచ్చింది నవ్వు.

బెర్త్ సీట్లో కదిలి, వెనక్కి నిఠారై కూర్చున్నా. పైకిముఖమెత్తి, కళ్ళు మూసుకుని నాలో నేనే నవ్వుకుంటుండిపోయా.

కానీ, కళ్ళ…
పూర్తిగా »

వొస్తే రానీ పొద్దుమీకి..

జూన్ 2015


వొస్తే రానీ పొద్దుమీకి..

ఆ గట్టు మీంచి ఈ గట్టుకి రివ్వురివ్వున దూకే మెరుపు పురుగు రెక్కవిరిగిన చప్పుడుకి గుండె గుభేల్మంటుంది. బండి లాంటి వెండి వాడు నడుస్తూ నడుస్తూ అలా.. ఆ మలుపు లోయలో జారిపడి కళ్ళ ముందే శూన్యమైపోయినప్పుడు- పగిలిన కాలానికి, మిగిలిన నిశ్శబ్దానికి మనసు బరువై దివులౌతుంది.
పూర్తిగా »

బికినికిల్లర్ ని గుర్తుకు తెచ్చిన కథ

నవంబర్ 2014


బికినికిల్లర్ ని గుర్తుకు తెచ్చిన కథ

‘మనుషులందరూ ఒక్కటే. అందర్లో ప్రవహించేదీ రక్తమే.’ అనే మాటలతో ఏ మాత్రం ఏకీభవించబుధ్ధి కాదు. కారణం – మనుషులందు అసలైన మనుషులు వేరు కాబట్టి. కొందర్లో రక్తానికి బదులు రాక్షత్వం ప్రవహిస్తూంటుంది కాబట్టి. ఒకొక్కరిలో ఎర్ర మనిషీ, నల్ల మనిషీ కూడా రహస్యంగా దాగి వుంటారు కనక. కౄరమృగాలు, శాడిస్టులు, హంతకులు, పరమనీచులు – మనిషితోలు కప్పుకునుంటారు కనక. అందుకే కామోసు మార్క్ ట్వైన్ మనిషి కౄరత్వం గురించి ఇలా అంటాడు: of all the animals man is the Only one that is cruel.

ఎన్ని రూపాలు, ఎన్ని మోసాలు, ఎన్ని కపటి వేషధారణలు! ఎన్ని వికృత చేష్టలు, మరెన్ని దుర్మార్గపు…
పూర్తిగా »

ఈ సముద్రం లోతెంతో చెప్పడం అసాధ్యం!

సెప్టెంబర్ 2014


ఈ సముద్రం లోతెంతో చెప్పడం అసాధ్యం!

ప్రియమైన వాకిలి పాఠకులకు!
ఈ తడవ మీకు నే పరిచయం చేస్తున్న ఈ కథంటే –
నాకు చెప్పలేనంత ఇష్టం.
అమితమైన గౌరవం.
నే సమ్మతించిన విషాదం.

ముందుగా కథాంశం గురించి :

ఎంత మోహనమని, మరెంత వ్యామోహమని!
ఎప్పట్నించి మాటేసుకునున్న సౌందర్యమనీ!? -చూపులతోటి ఇట్టే లాగేసుకుని, ఆహ్వానించినంతనే వొచ్చి, చేతుల్లోకి వాలిపోయి, మనసుని హత్తుకుపోతుంది. ఎటెటో ఎత్తుకుపోతుంది.
దివులు మబ్బుల్ని దూరం చేస్తుంది. రాను రాను తనే ఓ గొప్ప దిగులై కూర్చుంటుంది.
ఎప్పటికప్పుడే నవ వధువులా తోస్తుంది.
దాని సౌందర్యాస్వాదనలో అలసిపోయి, నిద్రలోకి జారినప్పుడు ఎద మీద ఎద వుంచి, వొద్దికగా…
పూర్తిగా »

ఆమె స్నేహానికి అతని మోహానికి మధ్య – గోడ!

జూలై 2014


ఆమె స్నేహానికి అతని మోహానికి మధ్య – గోడ!


ఆడది ఒంటరి గా బ్రతికితే ఏమౌతుంది?
ఆమెకీమీ కాదు. ఎంచక్కా ఆరోగ్యంగా, ఆనందంగా బాగానే వుంటుంది.
ఎటొచ్చీ చుట్టూ వుండే మగాళ్ళకే బోలెడంత దిగులౌద్ది. పాపం. మగ దిక్కులేకుండా ఎలా మనగల్గుతుందీ, ఒక్కత్తెనూ? ప్చ్. అని తెగ బాధ పడిపోతారు. పనిమాలా వెళ్ళి మరీ బ్రతిమాల్తారు. కాదు ప్రాధేయపడుతారు. తామూ ఓ చేయి వేస్తామని.
సాయం చేయడానికి ఇంతమంది మగాళ్ళు ముందుకొస్తే, నిజానికి – ఎంతమంది స్త్రీలు స్వేచ్చ గా, ఒంటరిగా బ్రతకటానికి ఇష్టపడరనీ, ఈ సమాజం లో? అయితే ఆ సాయం నిస్వార్ధమైనదైతే కదా?

కథ గురించి క్లుప్తంగా :
మహీ ఒక ఒంటరి స్త్రీ.…
పూర్తిగా »

గుండెగాటు పెట్టిపోయిన ఓ కొండకేక!

గుండెగాటు పెట్టిపోయిన ఓ కొండకేక!

శిక్ష!
ఈ కథ బావుంది అనడం – తప్పు.
బావోలేదనడం ఇంకా తప్పు.
మరేమనీ అనడం?
తెలీదు… చాలా అరుదైన కథలు మాత్రమే నన్నిలాటి సందిగ్ధావస్థలోకి తోసేస్తాయి. ఇదని ఏదీ ఇతమిత్థం గా చెప్పలేని ఓ ఆలోచన్ని కలిగిస్తాయి. అగ్గిని రగిలిస్తాయి. అలాటిదే ఈ కథాను.

కటిక నిశ్శబ్దంలో – ఈ సమాజాన్ని నిలబెట్టేసి నిలదీస్తున్నట్టు, ఒక ఈదురు గాలొచ్చి, నివురూదేసి నిప్పు కణికను రూపు తేల్చినట్టు, ఈ భయంకర దురగతానికి రక్తం మరిగి, లోలోన అడవి చిచ్చు రగులుకున్నట్టు… అలా ఫీలౌతాం కథని చదువుతున్నప్పుడు, చదివాకానూ!
ఆ తర్వాత, మనసంతా చేదైపోతుంది. మళ్లా మళ్ళా గుర్తొస్తుంది. వెంటాడేస్తుంది.…
పూర్తిగా »

గుప్ఫున నవ్వించే హాస్య కథనం – సామగానం!

మార్చి 2014


గుప్ఫున నవ్వించే హాస్య కథనం – సామగానం!

కథలు అనేక రకాలు. అనేక వర్ణాలు.

ఒక కథకున్న తీరు మరో కథకుండదు.

కానీ, చిత్రం! ప్రతి కథకి ఒక తీరం మాత్రం వుంటుంది. ఉండి తీరుతుంది.

‘ఇదిగో, ఈ రచయిత చెప్పదలచుకున్న విషయం ఇదీ’అని తేలిపోతూనో, తెలిసిపోతూనో వుంటుంది – కథాంతం లో! అదొక తీరు. అదే దరిదాపు అందరూ అనుసరించే జోరు కూడా.

కానీ చిక్కల్లా ఎక్కడంటే, ఎంత చదివినా, కథ లో రచయిత ఏంచెప్పాడని కానీ, ఏం చెప్పాలని ప్రయత్నించాడని కానీ వెదుక్కోవడం వుంటుంది చూశారూ, అక్కడ..అక్కడ వుంటుంది పాఠకుని గుండె చిక్కుకోవడమైతేనేం, చిక్కబడిపోడమైతేనేం.
నాకు అలా అనిపించే కథలు చాలా చాలా అరుదుగా దొరుకుతుంటాయి.

అనేక వృక్షాల వనం…
పూర్తిగా »

నును రెక్కల ఆశల చివుళ్ళు- ‘రెక్కలున్న పిల్ల’ గుండె చప్పుళ్ళు…

జనవరి 2014


నును రెక్కల ఆశల చివుళ్ళు- ‘రెక్కలున్న పిల్ల’ గుండె చప్పుళ్ళు…

కథ అంటే కేవలం ఊహ మాత్రమే కానిది.

కథంటే నిజానికి – మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్నట్టుండేది,మ న్లని తనలోకి వొంపుకుని, ముంచి తేల్చేది, – మనల్ని అచ్చవైన మనిషిలా ఆలోచింపచేసేది, అదే – కథ. అసలైన కథ. -అని అంటాను. మనుషుల్లోకి మల్లేనే, కథల్లోనూ అనేక రకాలుంటాయి.

అనేక మనస్తత్వాలు. అనేకానేక సమస్యలు. పరిష్కారాలు. రాని జవాబు కోసం ఎదురుచూసే కళ్ళు. జాడ తెలీక తిరుగాడు ఆకారాలు..ఇలా ఎన్నో షేడ్స్..షెడ్డింగ్ టియర్స్..చూస్తుంటాం.

కొందరు – కొందరి కథల్ని మాత్రమే చదివేందుకిష్టపడతారు. నేనైతే కనిపించిన కథని కనిపించినట్టు చదివేస్తాను. రోజుకి నా దగ్గరికొచ్చే కథలు ఏడెనిమిదుంటాయి. నేను దగ్గరకెళ్ళి చదివేవి మరికొన్నుంటాయి. ఇదని, అదని ఏముంది.…
పూర్తిగా »