‘ మమత కొడిదెల ’ రచనలు

ఒక పాట… మూడు గొంతులు

ఫిబ్రవరి 2017


ఒక పాట… మూడు గొంతులు

ఇక్తొమి – నేటివ్ అమెరికన్ తెగల్లో ఒకటైన లకోట తెగ లెజండరీ హీరో. జనాన్ని బురిడీ కొట్టించి, అవహేళన చేసి మరీ పాఠాలు నేర్పిస్తుంటాడీ మాంత్రికుడు. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి తన ప్రాణం అడ్డం పెట్టడానికి వెనుకాడని వీరుడు.

ఇక్తొమి అంటే సాలీడు అని అర్థం. చెప్పాను కదా, వాడొక మాంత్రికుడు. వాడికి ఎన్నో రూపాలు. ఒకసారి మనిషిలాగా, ఇంకోసారి ఏదో జంతువులాగా, గాలి లాగా, మబ్బు లాగా – ఒక్కోసారి ఒక పాటై నిన్ను హత్తుకుంటాడు.

ఒక పాట. ఒక్క పాట – గుప్పెడు అక్షరాలు కలిసిన కొన్ని పదాలు. అంతే.

అంతేనా? అనుభవాల దారం పోగులను ఒక్కొక్కటి జత చేసి నీ…
పూర్తిగా »

విక్టర్ హార: ముగింపులేని పాట

విక్టర్ హార: ముగింపులేని పాట

చిలీ! దక్షిణ అమెరికా పడమటి తీరంలో సన్నని రిబ్బను పీలిక లాంటి దేశం. దేశ రాజధాని సాంటియాగో దగ్గర్లో లాంకెన్ అనే ప్రాంతంలో రైతుకూలీ కుటుంబంలో, సెప్టెంబరు 28, 1932 లో పుట్టాడు విక్టర్. మానుఎల్ హార, అమాందా మార్తీనెస్ అతని తల్లిదండ్రులు. అమాందా మంచి గాయని, గిటార్ , పియానో వాయించేది. కష్టపడి పని చేసేది. మానుఎల్ తాగుబోతు, సోమరిపోతు. అమాందాను కొట్టేవాడు. పిల్లలను చిన్నప్పుడే పనుల్లో ఇరికించాడు. విక్టర్ ఆరేళ్లకే పొలంలో పని చేశాడు. తన అనుభవాలనుంచే పాటలు కట్టాడు విక్టర్.
పూర్తిగా »

“యో నో వీనె అ మతార్. యో వీనె అ మొరిర్“ – “నేను చంపడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చాను.”

“యో నో వీనె అ మతార్. యో వీనె అ మొరిర్“  – “నేను చంపడానికి రాలేదు. చచ్చిపోవడానికి వచ్చాను.”

పోర్టరికొ! స్పానిష్ ఆక్రమణదారులు మంత్రాలదీవి అని ప్రేమగా పిలుచుకున్న ద్వీపం. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆధిపత్యంలో ఒక కామన్ వెల్త్. అమెరికన్ ప్రజలకు అత్యంత ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్. అందమైన ఈ ద్వీపం కంటే మనోహరమైన మనసున్న వాళ్లు ద్వీప వాసులు.

ఈ చిన్న ద్వీపంలో తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. ఒక సందర్శన స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్తున్న హడావిడిలో రోడ్డు పక్కన మామిడిపళ్లు అమ్ముతున్న యువకుడ్ని పలకరించి చూడు. నీకు ముందు సమాధానమిస్తుంది అతని చిరునవ్వు. అతనితో మాటలెలా కలపాలో తికమకగా వుందా? అతని ఇంగ్లీషు, నీ స్పానిష్ మామిడి పండు అమ్మడం/కొనడం వరకే పరిమితమవుతున్నాయా? అయితే, “లొలీత…
పూర్తిగా »

ఎటువైపు తడిమినా చల్లగా తగిలే అన్ని రాత్రుల లాంటిదే ఒక రాత్రి..

ఎటువైపు తడిమినా చల్లగా తగిలే అన్ని రాత్రుల లాంటిదే ఒక రాత్రి..

రెక్కకు బురద అంటిన సీతాకోకను నేను. ప్రేమించగలవా అంతే ఇష్టంతో? ఐ స్టిల్ థింక్ ఔట్సైడ్ ద బాక్స్. ఐ స్టిల్ హావ్ వండర్ఫుల్ థింగ్స్ టు సే. ఏం? మాటసాయం మరీచికా!
ముడుచుకుని. షెల్ - అల్చిప్పలో. ఇక వద్దు. ఒక్క కాంతి రేఖ కూడా.
ఒక్క ఇసుక కణం - ఎట్లాగో సందు చేసుకుని.
ఒక ముత్యం - ఎప్పటికో.
అప్పటిదాకా, ఒక్క గాయం - ఎడతెగకుండా సలుపుతూ
బతకనివ్వదు
చావనివ్వదు
మానిపోదు

పూర్తిగా »

ఉండిపోతే..

మార్చి 2016


ఒంటరిగా ఒక పిలగాడు. వాడంటే చీకటికీ ఇష్టమే. చల్లగా కమ్మేస్తుంది వాడిని. మరెవరూ, మరేదీ ఇవ్వలేనంత ప్రేమతో.
వాడు అందర్లో చీకటిని వెతుక్కుంటాడు.

“ఉండు”

“….”

“ఉండూ”

“…ఏదీ కాసింత … చో… టు”

“నీదేంటో నీకు తెలిస్తే బాగుండు.”

పురివడిన కలల్ని చెదరగొడుతూ గు గ్గు గ్గూ అంటూ కిటికీలో ఒక పావురం. వాడంటే పక్షులకు ఇష్టం. రెక్కలున్న వాళ్లకు కూడా. పక్షులు ఎగిరిపోతాయి. రెక్కలున్న వాళ్లు… ఈరోజో, రేపో, వాడి తడికళ్లను తప్పించుకోగలిగిన క్షణాల్లో…

“ఏం? ఉంటావా?”

“మ్.. నాకు కేటాయించిన అరలోనా?”

“కాదు. నాకళ్లల్లో…”

“అబ్బ, ఎంత ముతక! ఇంకేదైనా చెప్పు.”

“ఉంటానంటే చెప్తా.”

ఆ పిలగాడికి నవ్వంటే…
పూర్తిగా »

పీటర్ లఫార్జ్

డిసెంబర్ 2015


పీటర్ లఫార్జ్

ఒక్కోసారి ఇక్తొమి రావడానికి వెళ్లిపోవడానికి దారితీసే పరిస్థితులు ఏవైనా, క్షణకాలపు తన ఉనికిలో అడుగడుగున ఎదురయ్యే వివక్షను ధిక్కరించి లోకం గుండెలో మాసిపోని ముద్రవేసి వెళ్తుంది. ఉన్నంత కాసేపూ ప్రపంచం బాధను తన బాధ చేసుకుని ముందు తరాలకు మార్గదర్శి అవుతుంది. అలాంటి ఒక ఇక్తొమి పీటర్ లఫార్జ్.

దాదాపు పదిహేనేళ్ల క్రితం, నేను ఒకరోజు రేడియోలో పాటలు వింటున్నప్పుడు హఠాత్తుగా పాటకు బదులు ఒక పిలుపు వినిపించింది. “ఐ..రా హేయ్స్! ఐ.. రా… హే… య్స్” అంటూ ఐరా హేయ్స్ ను అతడి సమాధి లోంచి కుదిపి లేపుతున్నట్టున్న, ఆర్తి నిండిన ఆ పిలుపు వినగానే నా మెడమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. తరువాతి…
పూర్తిగా »

మనస్సు చురకత్తి: లియొనార్డ్ పెల్టియర్

నవంబర్ 2015


మనస్సు చురకత్తి: లియొనార్డ్ పెల్టియర్

తెరలు తెరలుగా గూడు అల్లుతోంది నిరంకుశత్వం, ఒక అస్తిత్వం చుట్టూ. కట్టుదిట్టం చేస్తోంది ప్రతి కదలికనూ, ప్రతి శ్వాసనూ. ఆ దిగ్బంధంలోనే ఒక సన్నని కదలిక. ఆ కదలిక లోంచి నిరంతరంగా వెలువడుతున్న సన్నని రాగం ప్రత్యర్థి గుండెల్ని అదరగొడుతోంది పొలికేకై; నేనింకా వున్నానంటూ. ఈ కదలిక అంటే నిరంకుశత్వానికి భయం. అందుకే ఇప్పుడిక ఏ భేషజాలు లేకుండా, అందరి కట్టెదుటే ఇంకా గట్టి పొరలు పొరలుగా ఇనుప తెరలు కప్పుతూనే వుంది. నిరంకుశత్వానికి తెలుసు తాను బంధించింది ఒక ఇక్తోమిని అని. పట్టు వదిలేస్తే తనకే ప్రమాదమని.

ఈ ఇక్తొమీకి అతని అమ్మా నాన్న పెట్టిన పేరు లియొనార్డ్ పెల్టియర్. అతన్ని యునైటెడ్…
పూర్తిగా »

జాన్ ట్రుడెల్

సెప్టెంబర్ 2015


జాన్ ట్రుడెల్


అదిగో అటు చూడు…, అవును చిరుజల్లుల్లో తడుస్తున్న మిట్టపల్లాల పొలం, దూరాన కొండలపై ఇంకా చివుర్లు తొడగని చెట్ల మధ్య నెమ్మదిగా సాగుతున్న ఒక పల్చని మేఘం. నిజమే చాలా అందంగా వుంది దృశ్యం.

కానీ అదికాదు, నేను చూడమంటున్నది. మరీ అంత దూరం ఆకాశంలోకి కాదు, ఆ కొండల కాళ్ల దగ్గర, ఎర్రని చివికిపోయిన పైకప్పున్న ఇల్లు చూడు. చూడు, ఓ పక్కకు ఎలా ఒరిగిపోతోందో.

విరిగిన ఇంటి తలుపుల్లోంచి, పగిలిన అద్దాల్లోంచి, పెద్ద చిల్లు పడ్డ పైకప్పులోంచి పొడుచుకొచ్చి ఆ ఇంటిని కబళిస్తూ బలిసిన కొమ్మలున్న ఆ చెట్టు చూడు. సన్నటి గాలి తెమ్మెరలో మెల్లగా వూగుతున్న ఆ కొమ్మలు…
పూర్తిగా »

రాళ్లు మాట్లాడగలిగితే

రాళ్లు మాట్లాడగలిగితే

ఉదయం పదిగంటలవుతోంది. పొద్దున్నే లేచి బయల్దేరినా నా మ్యాప్ పై గుర్తు పెట్టుకున్న ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయాను. టెన్నెస్సీ రాష్ట్రంలోని న్యాష్ విల్ పట్టణం నడిబొడ్డున ఉత్తర అమెరిక ఆదివాసి తెగల్లో (నార్త్ అమెరికన్ నేటివ్స్) ఒకటైన చెరోకి తెగకు సంబంధించిన గుర్తుల కోసం చూస్తున్నాను. ఎన్ని వీధులు తిరిగినా ఆ గుర్తుల జాడ కనిపించకపోగా, దారిలో నాకు ఎంతో ఇష్టమైన గాయకుడు జానీ క్యాష్ మ్యూజియం కనిపించింది కానీ ఎక్కడా కారు పార్క్ చెయ్యడానికి స్థలం దొరకలేదు.

పార్కింగ్ కోసం అరగంట ప్రయత్నం తరువాత, ఒడిలో పెట్టుకున్న మ్యాప్ ఇక తరువాత అనుకున్న ప్రదేశానికి వెళ్లాలని తొందరపెట్టింది. మామూలుగా అయితే పొద్దున్నే అనుకున్న పని…
పూర్తిగా »

కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత

డిసెంబర్ 2014


కవిత్వం నాకు ‘నక్స్ వామికా’ లాంటిది! -మమత

అప్పుడెప్పుడో చదువుకుంటున్న రోజుల్లో ‘వార్త’ లో సతీష్ చందర్ అందమైన ‘ఇంట్రొ’తో ఒకే సారి రెండు మూడు పద్యాలు అచ్చేసి, అరె ఎవరీ అమ్మాయి బాగా రాస్తుందే అనిపించుకుని, ‘దిశ పబ్లికేషన్స్’ వాళ్ల కోసం సత్యజిత్ రే కథలు ఓ పదింటిని అనువదించి, ఈ అమ్మాయి ఈ పని కూడా బాగా చేస్తుందే అనిపించుకుని.... .... ఆ తరువాత చాన్నాళ్లు ఎక్కువగా కనిపించకపోయినా, కలం సన్యాసం చెయ్యలేదని... ఈలోగా, తన వాక్కు పదును దేరిందని, తన బాధ కవిత్వమయిందని ఇటీవలి పలు పద్యాలతో మనలో చాల మందిని ఒప్పించి, ఇప్పుడు ఎంచక్కా ఇస్మాయిల్ అవార్డు గ్రహీతల వరుసలో చేరిపోయిన కె. మమత ఇదిగో ఈ అమ్మాయే....…
పూర్తిగా »