‘ మోహన్ రుషి ’ రచనలు

దయగల్ల లోకంలో…

అక్టోబర్ 2015


నమ్మకాలు చెదిరిపోతాయి. నటనలు
వ్యవస్థీకృతమవుతాయి. వాగ్దానాలు
వట్టిపోతాయి. అబద్ధాలు ఆశువుగా
జాలువారతాయి. సందర్భాలు
త్రిశంకుస్వర్గంలో వేలాడదీస్తాయి.
నిశ్శబ్దం గడ్డకట్టుకుపోతుంది. మెదడుకు
దిక్కుతోచదు. దుఃఖించడానికి స్థలం
దొరకదు.

అలమటించి. అలసటించి. అటూఇటూ
పరుగులు. వొంటిపైన కనబడని దేవరోని
కొరడాదెబ్బలు. ఓడి, అల్లాడి, తండ్లాడి. నీ
కన్నీటి సముద్రంలోనే మునిగి, ఒకానొక
అర్ధరాత్రి సమయాన ఒక ఒంటరి చేపవై
ఒడ్డుకు చేరుకుంటావు.


పూర్తిగా »

అదే రోడ్డు

జూన్ 2015


రోడ్డంతా ఖాళీగా వుంటుంది. కొన్ని సంవత్సరాలుగా మనుషుల
జాడ లేనట్లు. రాలిపడ్డ ఆకులు జాలిగా చూస్తుంటాయి. గాలి
మాట లేదు. సిలుం పట్టిన పాత బండి గోడకు ఆనించి
వుంది. రంగు వెలిసిన ఆకాశం. నెర్రెలు బాసిన నేల.

వెనక్కి వెళ్ళనే కూడదు. కేవలం నమ్మకం మీద నడక
సాగించాలి. ఈ దారి గుండానే ప్రయాణించి అటు చివర
ఒకరు ఎదురు చూస్తున్నారు. చెవులు రిక్కించి,
కళ్ళు రస్తాకు అప్పగించి. శ్వాస చివరంచున నిలబడి.

నేననుకోవడం, ఈసారి తప్పకుండా కలుసుకుంటాం.
పరిచయం లేనివాళ్ళను కలపడానికే కదూ, ప్రపంచం
వున్నది?!


పూర్తిగా »

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా!

ఫిబ్రవరి 2015


చుట్టూపక్కల చూడరా చిన్నవాడా!

అదే సమస్య. అపరిచితుల మొహాలు అప్రధానమైపోయాయి. ఎక్కడో అందమైన మొహాలు ఎదురైతే తప్ప, మొహాలు చూడ్డం మానేసాం. ముఖ్యం టైము లేదు. ఆగే వీలు లేదు. స్పీడ్. రన్ రాజా రన్. రోడ్లు ఉన్నది సాధ్యమైనంత వేగంగా సాగడానికే. వెళ్తున్నది బండిపైనైనా, కార్లోనైనా. బస్సులోనైనా. మేరే నైనా. ఇదే పరిస్థితి కదా నైనా సెహ్వాల్.

మహా అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిముషాలు. అక్కడా పక్కవాళ్ళ మొహాలు చూసే అదృష్టం లేదు. అందమో, ఆరోగ్యమో, తల కాపాడుకోవడమో, మొహం చాటేయడమో… రీజనేదైనా అందుబాటులో ఉన్న బహుళార్ధసాధక రక్షణ కవచాలు అడ్డు. వాటికి తోడు ఆ కాస్త వ్యవధిలోనే అటెండ్ చెయ్యాల్సిన మొబైల్ కాల్సుంటాయి. కొల్లేరు…
పూర్తిగా »

ఆఖరి చూపు!

డిసెంబర్ 2014


ఆఖరి చూపు!

బస్ స్టాపులో నా ఎదురుచూపులకు తెర దించుతూ దూరంలో బస్సు. కళ్ళతో చకచకా ఫ్రేములు మార్చాలి. మొదట నెంబర్ ప్లేట్ పైన. “మెహదీపట్నం టు హయత్ నగర్”. తర్వాతి ఫ్రేమ్, ఫుట్ బోర్డ్ పైన. ఫర్లేదు, నెట్టుకుపోగలం. చివరి ఫ్రేమ్, బస్సులోని మధ్యభాగం. లోపలిదాకా వెళ్ళగలిగితే, నిలబడ్డవాళ్ళకి గాలి ఆడే అవకాశమూ వుంది.

తేరగా దొరకడానికి సిటీబస్సు సీటేమీ ఐఐటి సీటు కాదు. అది ఒక పూర్వజన్మ సుకృతం. అయితే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లుగా అకుంఠిత దీక్షాదక్షతలకు అర చటాకు అదృష్టం తోడైతే సిటీబస్సు సీటూ సంపాదించగలం. దానికి కొన్ని టెక్నిక్కులు ఉన్నాయి.

బస్సు ఎక్కడంతోనే సీట్లలో కూర్చున్నవారి మొహాల్ని నఖశిఖపర్యంతం…
పూర్తిగా »

నేను చూశాను!

15-ఫిబ్రవరి-2013


ఎదురవుతుంటారు కొందరు. చిటికెనవేలితో శిలువను ఎత్తేవాళ్ళు, చిరునవ్వుల్తో
చీకట్లను తరిమి తరిమి తన్నేవాళ్ళు, సమయాలకు సౌరభాన్ని అద్దేవాళ్ళు,
సంభాషణను సమ్మోహితం చేసేవాళ్ళు, పరిచయాన్ని ప్రపంచం చేసేవాళ్ళు,
సామీప్యాన్ని సందర్భంగా మలిచేవాళ్ళు, జీవితాన్ని ఉత్సవం చేసేవాళ్ళు.

ఇదే భూమ్మీద. కళ్ళలోకి సూటిగా చూసేవాళ్ళు, చెత్తమనుషుల చెవుల్లో సీసాలు పోసేవాళ్ళు,
మాటతో మట్టిముద్దకు ప్రాణం పోసేవాళ్ళు, ఆగమనంతోనే ఆత్మీయులయ్యేవాళ్ళు, వీడ్కోలుతో జీవితంపైని ఆశను పెంచేవాళ్ళు.

నిజమై, నిప్పై, ఉరుమై, చెలిమై, పిలుపై, వలపై, గెలుపై, మలుపై. ఎదురవుతుంటారు కొందరు. జీవనకాంక్షని తెలిపే అరుపై.

వెళ్ళరు వాళ్ళు తిరుగుటపాలో. ఉండనీరు మనల్ని ఉన్న బాక్సుల్లో.


పూర్తిగా »

కొన్ని రాత్రుల్లో..!

జనవరి 2013


మాట నాలుక కింద మడత పడ్తుంది
బాధ గుండె చుట్టే బేలగా తిరుగుతుంటుంది
చూపుకు ఆనుతున్నదేదో మెదడుకు అందదు
పదమొక్కటీ దొరక్క ప్రాణయాతన-

పెద్దగా ఆప్షన్స్ లేవు; ఏ పక్క గోడకు తల మోదుకుంటావన్నది తప్ప,
ఏ శూన్యంలో తలకిందులుగా వేలాడ్తావన్నది మినహా-

ఏం చేస్తావు నువ్వు?!

చాప మధ్యలో సకిలం ముకిలం వేసుకుని నలుదిక్కులకూ పరుగెడ్తావు
త్రికాలాల్లోకీ అదుపు తప్పిన బస్సులా ప్రయాణాలు చేస్తావు
ఎడమ అరచేత్తో గొంతు బిగ్గరగా అదుముకుంటూ
ఏడుపు కూడా అనాథను చేసిన జీవితాన్ని అదేపనిగా తలపోస్తావు-

ఉన్నవాడివి ఉన్నట్టుగా భూమి లోపల్లోపలికి కనబడకుండా మాయమవ్వాలని అత్యాశిస్తావు, సినికల్ గాపూర్తిగా »