‘ శ్రీకాంత్ ’ రచనలు

Noem అను ఒక కథ

జూన్ 2017


Noem అను ఒక కథ

వాళ్లకు నేనేమీ తేను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఆకుల మాటున దాగిన పూవుల్లా తటాలున బయటపడి పకాలున నవ్వుతారు. ఆపై చుట్టూ చేరి అల్లుకుంటారు. ఈలోగా ఇంటి ముందు చీకటి తెరలు వాలుతాయి. వాళ్ళ కళ్ళల్లో వెన్నెల్లు వెలుగుతాయి. వెన్నెల్లో వాన జల్లులలో సీతాకోకచిలుకలు ఎగురుతాయి. రెక్కలపై నక్షత్రాలతో పూల పుప్పొడితో ఒక చల్లటి గాలి వీయగా నిదుర అంటిన వాళ్ళ కళ్ళల్లో కథలు మొలుస్తాయి. నేను వాళ్లకు పెద్దగా కథలు ఏమీ చెప్పను. బహుశా వాళ్ళేమీ ఆశించరు కూడా. మహా అయితే ఇదిగో ఇటువంటి ఒక గాథను వింటారు అల్లుకుపోయి.
పూర్తిగా »

మార్పు

మార్చి 2016


ఎంతో గరుకుగా, ఎంతో గట్టిగా
కాండాన్ని అదిమి పట్టుకున్న బెరడు: రాత్రంతా కురిసిన మంచు కూడా
ఇసుమంతైనా

మెత్తగా మార్చలేదు
దానిని -

***

పొడుగాటి మధ్యాహ్నాలు. పల్చటి
పసుపు వస్త్రంలాంటి ఎండ. తాకీ తాకని గాలిలో, కాంతిలో చెట్లు
అట్లా స్తంభించి -

లోతుగా దిగే కాలం. వేసవికి రాలే
పసుపుపచ్చ ఆకుల్లో శరీరం: చెట్టు బెరడును రికామీగా గీకుతూ
ఒక నల్లని పిల్లి -

పైన వేపకొమ్మల్లో ఎక్కడో తపిస్తో
దాహంతో అరిచే ఒక కాకి: బహుశా అది నీ హృదయం కావొచ్చు. కావొచ్చు
బహుశా అది నీ…
పూర్తిగా »

ఇటువైపు చూడవు నువ్వు

ఏప్రిల్ 2015


ఇటువైపు చూడవు నువ్వు. ఎందుకంటే
నూతనమైనది ఏదీ నీకు కనిపించకపోవచ్చు. ఆఖరకు ఒక పదం కూడా ఒక్క ప్రతీక కూడా -
అవే మూసిన తలుపులు. అవే వెలసిన గోడలు. వాటిపై పిచ్చిగీతలు -

నువ్వు చూడవు వాటివైపు. ఎందుకంటే మరి అవి
ఏ పసివేళ్ళూ లేక వడలిపోయిన రంగులో, లేక ఎవరూ లేని రాత్రుళ్లో, రాత్రుళ్ళలో
ఆగిపోయిన శ్వాసలో, నువ్వు లేవని తెలసి ఇక నిన్ను పిలవలేక
స్థాణువై చిట్లిన పెదాలో, తెలియదు ఎవరికీ -

ఎందుకంటే
ఎవరితోనూ మాట్లాడవు అవి – ఎందుకంటే
ఎవరి ముందూ తమ చరిత్రలు విప్పుకోవు అవి. ఎందుకంటేపూర్తిగా »

వానపాము

26-జూలై-2013


ఈ నిదానపు మధ్యాహ్నం, ఒక మబ్బు పట్టిన గాలి. కూర్చుంటే నువ్వు
నీ గదిలో, మరి ఎక్కడి నుంచో ఒక కోయిల గానం-

నిన్న రాత్రి కురిసిన వానకి, ఆ నీటి కాంతికీ, ఇంకా మెరుస్తాయి
అశోకా ఆకులు. వాటి కింద నువ్వు నడుస్తూ ఉంటే
పచ్చటి పొదల వాసన. తల ఎత్తి చూస్తే, పొదల్లోంచి
తటాలున దూకి పారిపోయిన కుందేలు ఒకటి ఆకాశంలో.

ఈ సమయంలో ఇక్కడ ఒక తెల్లటి మేఘం కనిపించడం ఆశ్చర్యమే కానీ
ఏం చేస్తావు నువ్వు, కొద్దిపాటి చల్లదనంలో
మరి కొంత మెత్తటి వెలుతురులో, మసక
మసకగా నీ లోపల…
పూర్తిగా »

ఒక

12-ఏప్రిల్-2013


ఎక్కడో చీకట్లో ముడుచుకుని ఉంటావు నువ్వు దుప్పట్ల కింద
నుదిటిలో దిగే గాజు ముక్కలతో: బాహువులంత భయం, ఎడారులంత దాహం
అప్పుడు నీకు-

చిన్న సవ్వడులే మృత్యు శబ్ధాలు అయ్యే వేళ అది.
గజిబిజిగా రూపాలు కళ్ళ ముందు మెరిసి, నిను తాకి వెళ్ళిపోయే కాలమది.
ఇక అప్పుడు

అ గదిలోకి, నీ చీకట్లోకి ఎవరో వచ్చి దీపం వెలిగిస్తే, ప్రాణంజలి వంటి ఆ కాంతిలో

నీ నుదిటిపై తను చల్లగా అరచేయి ఉంచితే, తన శ్వాసలోంచి నీ ముఖంపైకి వీస్తుంది
వర్షపు ఆగమన గాలి ఒకటి చెట్లు ఊగే ఆకుల కలకలంతో- ఇక నువ్వు, తన చేతినిపూర్తిగా »

‘శ్రీకాంత్’ అంటూ ఎవరూ లేరు !

01-మార్చి-2013


‘శ్రీకాంత్’ అంటూ ఎవరూ లేరు !

శ్రీకాంత్ ముఖాముఖీ – రెండో భాగం

6. స్త్రీలు…మీ కవిత్వంలో బహు పాత్రల్లో కనిపిస్తారు? ఎందుకని?

(I am assuming that you have used this word ‘స్త్రీలు’ to indicate the English equivalent Woman and not Female. And hence my reply proceeds from such presumption)

ఇలా ప్రశ్నించుకుందాం ముందుగా మనల్ని మనం ఒకసారి, మన పాత్రలతో మన పాత్రలలోంచి బహు విధాలుగా. ఎందుకంటే ఈ ప్రశ్న, స్త్రీల గురించిన ప్రశ్న, స్త్రీల ప్రశ్న (the question of women. Often more than once, Woman is a recurring question to us. For…
పూర్తిగా »

‘రాత’ నాకు ఒక గూడు: శ్రీకాంత్

22-ఫిబ్రవరి-2013


‘రాత’ నాకు ఒక గూడు: శ్రీకాంత్

కవిత్వ వాక్యానికీ వొక శరీరం వుంటుంది. సరయిన పదం దొరకనప్పుడు ఆ శరీరానికి నొప్పెడుతుంది. దాని మనసు చిన్నబోతుంది. ఆ శరీరానికంతకీ వొక వ్యక్తిత్వమేదో వుంటుంది. దాని బాధలోపలికి తొంగిచూసే కన్ను శ్రీకాంత్ కి సొంతం. ఆ శరీర భాష శ్రీకాంత్ కి అర్థమయినంతగా ఇంకెవరికయినా అర్థమయిందో లేదో అనుమానమే. అందుకే వొక్కో సారి శ్రీకాంత్ వొక enigma. అతని కవిత్వ వాక్యం వొక సుదీర్ఘమయిన pain. తను బాధపడుతూ రాసే ప్రతి పదం మనల్ని ఖాయంగా బాధపెడ్తుంది. తనలోని బాధలోకి మనం వలసపోయి, మన బాధని కాసేపు మరచిపోతాం. కవిత్వం చేయాల్సిన పనులు నిజంగా ఏమయినా వున్నాయో లేదో కానీ, వొక బాధని ముల్లు…
పూర్తిగా »

సామాన్యుడి ప్రేమగీతం

జనవరి 2013


నిన్ను ప్రేమిద్దామని అనుకుంటాను కానీ, ఈ పాడు ఈగలే…

సరే. నువ్వు చెప్పు -ఎవరైనా
ఎలా ప్రేమించగలరు, చుట్టూ రయ్మని ఎగిరే ఈ ఈగలతో?

మరే, ఒకదానిని ఒకటి అతుక్కుని ఎం చక్కగా
ప్రేమించుకుంటున్నాయి ఈ ఈగలూ, దోమలూ:
ఎందుకంటే మరి వాటికి మన అవసరాలు లేవు

మరి మనం ప్రేమించుకోవాలంటే చాలా కావాలి-

సమయానికి నీళ్ళు రావాలి, గ్యాస్ రావాలి
కరెంట్ కావాలి రాళ్ళు లేని బియ్యం కావాలి
సమయానికి జీతం రావాలి పిల్లల ఫీజు కట్టి
ఉండాలి, కేబుల్వాడి బిల్లూ పాలవాడి బిల్లూ

పనిమనిషి జీతం అన్నీ తీరి ఉండాలి. కూరగాయలూ
కందిపప్పూ…
పూర్తిగా »

లాస్ మెస్ ద్రియోస్

01-ఫిబ్రవరి-2013


” ‘లాస్ మెస్ ద్రియోస్’ అంటే కోరిక అని అర్థం”అని తను చెప్పింది కానీ, అంటే
ఏమిటో అర్ధం కాదు ఇప్పటికీ నాకు -

ఆకుపచ్చని నక్షత్రాలు మెరిసే తెల్లటి ఆకాశాల్లా ఉండేవి తన కళ్ళు. మరి
చూసావా వాటిలోకి, సరస్సుల్లోకి రాలి
దారీ తెన్నూ లేకుండా కొట్టుకుపోతావ్

వానా వెలిసాక, ఆకుల చివర్ల నుంచి రాలే నీటి చుక్కలు ఆకస్మికంగా నీ
ఒంటిపై పడి, ఒళ్ళు జలదరిస్తుంది చూసావా
ఆలా ఉంటుంది తను నిన్ను తాకినప్పుడు

దారి పక్కగా వాన వెలిసిన నీటిలో మొలిచే
బుడగలలోకి బుడంగున మునిగి ఆరంగుల
లోకాలలో తిరిగి తిరిగి…
పూర్తిగా »