‘ సి.వి.సురేష్ ’ రచనలు

లోపలి కోరిక

01-మార్చి-2013


‘నన్ను క్షమించవా?’
ఆ మొదటి రాత్రి అతడన్న మాటలు
ఎడారిగాలుల్లా ఇప్పటికీ బాదుతూనే ఉన్నాయి
కొర్కెల కొంగున వేసుకొన్న ముడి కాళ్ళకడ్డుపడింది

*

గది నిండా ఊడలతో ఆ వృక్షం
రాత్రంతా కురుస్తూనే ఉన్న‌
తెల్లటి మంచును స్పర్శిస్తూనే ఉ‍ది
ఆ గది చేరుకున్న‌నదులు
చెరొక ప్రక్కన‌ మౌనంగా ఘనీభవించి
నిశ్శబ్ధంగా ప్రవహించుకొంటున్నాయి

*

ఉద్వేగాల ఉత్సుకతల తీరాల్ని తగలకుండానే
ఆ ఉదయం ఆమెను చూసిన ప్రతి చూపు
బాగా జ్ఞాపకమే
ఏది ఒక్కసారి ఆ సిగ్గుల మొఖం చూపించూ

*

లోపల్నుండి దావానలంలా ఉష్ణ ప్రవాహం
ఆమెకు…
పూర్తిగా »

చంద్రునికొక పూల తావి

22-ఫిబ్రవరి-2013


చంద్రునికొక పూల తావి

చంద్రునికొక పూల తావి
 ———————-
ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా…
పూర్తిగా »

నిశ్శబ్ధం

08-ఫిబ్రవరి-2013


కళ్ళల్లో యుద్ధ చిత్రాలు
ఒక్కో అవయవం తెగిపడుతోంది
దృశ్యీకరిస్తున్న‌ కనుపాపలు
మౌనంగా రోదిస్తున్నాయి
కన్నీళ్ళను ఆనవాళ్ళగా పంపుతున్నాయి

ఎర్రటి రక్తాన్ని శ్రవిస్తూ
సడి చేయకుండా పడమటి కొండల్లోకి
గాయపడిన సూర్యుడు
జారుకుంటున్నాడు
రేపటి దారుణాలను భరించే శక్తితో రావలని

మరణించిన అస్తమానం కోసం
శ్రద్ధాంజలి ఘటించేందుకు
నిశ్శబ్ధంగా ఎదురుచూస్తున్న నిద్ర‌
రేపటి ఆశతో

స్వార్థపు మెదళ్ళ
కర్కశపాదాల కింద నిర్విరామంగా నలుగుతూ
చప్పుడు చేయకుండా భీతిల్లుతూ
మౌనంగా రోదిస్తూ సేద తీరుతున్న రాతిరి
కళ్ళూచెవులను బంధించింది

నాలోని నిశ్శబ్ధం లోకి…
పూర్తిగా »

కాల్చేసే మంటొకటి…

25-జనవరి-2013


ఇప్పుడు నాకు విషాదమే అవసరమైంది జడలు విప్పిన విషాదం అది నన్ను  గుచ్చి గుచ్చి బాధపెట్టి నాకో వ్యథను మిగిల్చాలనుంది నాకు బాధే కావాలి ఆమె జ్ఞాపకాలను దాచిన గుండెను కాల్చేసే మంటొకటి నాకిప్పుడు అవసరం ఆ కాలుతున్న బాధే నాకిప్పుడు కావాలి హృదయంలో గూడుకట్టుకొన్నఆమె రుపాన్ని పలుగుల‌తో తొలగించే నొప్పి కావాలి ఆ పలుగు చేసే గాయం కావాలి గుండెలోతుల్లో ఘనీభవించిన‌ ఆమె మధురానుభూతులను ఎగదోసి రగిలించి కరిగించే సెగ కావాలి ఆ సెగ రగిలించే వేదనే నాక్కావాలి ఆమె అంతర్ సౌందర్యాన్ని అతికించుకొన్న‌ మనసుపొరలను విడదీసి ముట్టించే నిప్పురవ్వొకటి కావాలి ఆ రవ్వ కాల్చే మంటే నాకిప్పుడు అవసరం మనసును పదే పదే…
పూర్తిగా »

స్వప్ననిశ్చయం

జనవరి 2013


ప్రవహించే నది ఒక్కసారిగా ఘనీభవించింది
ఇప్పుడు ఆ గలగలలు లేవు
హొయలూ లేవు సొగసూ కానరాదు
కొండచరియ అంచున స్వప్నమొకటి
బిక్కు బిక్కు మంటూ భయంతో
ఆలోచనల్లో పడింది

తడిఆరిన కఠిన శిలాక్షరలపై
కరాళ ఘంటికలు నృత్యిస్తోంటే
రుతువులను బలిపీఠం పైకి
తెస్తున్న‌ విషసర్పమొకటి బుసలు కోడుతోంది
చిగురిస్తున్న ప్రతి ప్రశ్నని
మాంత్రికుడొకడు మాయం చేస్తున్నాడు

మిగలని మానవత్వపు జాడల్లొ
మనిషి తత్వం విధ్వంసించుకొంటుంది
మనిషిని మనిషిగా చుడలేని
వాదమొకటి తెరపైకి వచ్చి
తీవ్రవాదాన్నే ఎక్కిరిస్తోంది

తూరుపు కొండల్లో మసకబారిన‌
పసితనమొకటి
కళ్ళకు…
పూర్తిగా »

ట్రాన్స్ ఫార్మింగ్

జనవరి 2013


జాగృతి నుండి అచేతనానికి అచేతనం నుండి నిద్రావస్థలోనికి వేలి కొసన జిగటను  పూసుకొని అణువును  నిర్వీర్యం చేసే ఒక నిరాశావాది ఆలోచన   ఎగిసిన అలను చీలుస్తూ తీరంలో చీలను హద్దుగా దిగ్గొట్టి అరచేత్తో అలను నిమురుతూ చిన్నగా సుషుప్తి నుండి జాగృతి లోకి జాగృతి నుండి చేతనంలోకి చేతనంనుండి దివ్యచైతన్యం లోకి ఒక‌ ఆశావాదపు ట్రాన్స్ ఫార్మింగ్   రెండు నాలికల  చీకటి నాగు శబ్ధం చేయకుండా మైదానంలో అనకొండలా ప్రాకుతూ సూర్యునికే  కాంతిని ప్రసరింపచేస్తూ పడమటి కొండల చాటుకు నక్కినక్కి నిశ్శబ్ధంగా……కాలచక్రం   రంగురంగుల ప్రకృతిని ఓ ఎలిమెంటేదో రహస్యంగా నైరుతి నుండో ఈశాన్యం వైపునో రుతుచక్రానికి ఇందనాన్ని పూసి ఇరుసు ఒరిసే…
పూర్తిగా »