‘ అరణ్య మిహిర్ ’ రచనలు

అనంతరం

ఫిబ్రవరి 2016


మంచుపువ్వుల్లో నీ నవ్వు -
గడ్డకట్టుకుపోయిన పాట ఒకటి
చీరుకుపోయిన నా గుండెలోంచి విచ్చుకుంటూ…ఆర్తిగా
నీ పెదవులు నా పెదవందుకున్నప్పుడు
నడిరేయి వానలో
వణికిన కాంతిధారలవలె
నేను

నీ ఊపిరిలో నా పిలుపు
నా అణువణువులో మెలిపడి పురివడి
సేదతీరిన నువ్వు

అదంతా ఒక కలే

నీ కనురెప్పలమాటున బిగపట్టుకున్న వెచ్చని దిగులు ఆవిర్లని
తడిముద్దులతో అద్దుతూ
నీకోసం
సీతాకోకచిలుకంత గొప్పదాన్నవాలన్న ఆశ
తప్ప మరింకే కోరికా లేదు ఇక నాలో

అంత అద్భుత మోహంలోనూ
దొర్లుతాయి
మనసుకన్నుల్లో నలుసులై మిగలబోతున్న జ్ఞాపకాలు
ప్రియరహస్యాన్ని…
పూర్తిగా »

ఈ క్షణం…

సెప్టెంబర్ 2015


కీచురాళ్లు ఎన్ని రకాలో తెలుసా? అదిగో విను: ‘చిర్రప్…చీర్రప్’ అని ఒక గుంపుతో ‘చిట్ చీట్ చిటా చీట్’ అంటూ మరో గుంపు జుగల్ బంది, బ్యాక్ గ్రౌండ్ లో సన్నగా, ఉండీలేనట్టుగా, ‘గీఈఈ..’ అంటూ మరో గుంపు. కీచురాళ్లెప్పుడూ నిద్దరోవు. మధ్యాహ్నమైనా, మధ్యరాత్రి మెలుకువలోనైనా ఒక్క క్షణం ఒంటరిగా వుండనివ్వవు. తలలో గీ పెట్టే నరాల హోరుకు దరువేస్తూ రెక్కలు ఆడిస్తూనే వుంటాయి.

నా బావిలో నేను
కీచురాళ్ల సంగీతాన్ని పరవశించి వింటుండగా ఎక్కడినుంచి ఊడిపడ్డావు నువ్వు?
కొంచెం కబుర్లు, కీచురాళ్ల గురించేలే… ఏదో ఒకటి – నాకు తెలిసిందేదో, చెప్పాను కదా?

మ్ .. పాపం చాలా దూరం నుంచి…
పూర్తిగా »

పుష్పవిహాసం

ఆగస్ట్ 2015


పుష్పవిహాసం

 

ఊరు దాటిన కొన్ని మైళ్ళ తరువాత దట్టమైన మామిడి చెట్ల తోపును దాటి గుట్ట ఎక్కి చూస్తే విశాలమైన మైదానం కనిపిస్తుంది. ఆ మైదానంలో చిన్ని నీటికుంట పక్కన గుబురుగా పెరిగిన వేప చెట్టే నా ఇల్లు.

ఊరివాళ్లెవరికీ ఈ మైదానానికి వచ్చిన అనుభవంలేదు కానీ తాతముత్తాతల కాలంనుండి ఇక్కడ మాయలు మంత్రాలు జరుగుతాయని ప్రచారం వుంది. మైదానం గుండా ఎడ్ల బండెక్కి వెడితే రెండు గంటల్లో పక్క వూరు చేరుకోవచ్చు అని అంటారు కానీ ఎవరూ చూసింది లేదు. ఎందుకొచ్చిన బాధ అని రెండు రోజులు పట్టే వేరే దారినే రెండు వూళ్ల వాళ్లు ఉపయోగిస్తారు. చివరి వరుసలో వున్న మామిడి…
పూర్తిగా »