‘ టి. లలితప్రసాద్ ’ రచనలు

రాగం

సెప్టెంబర్ 2013


రాగం

ఆడిటోరియం చప్పట్లతో మారుమోగుతోంది. అనంత్‌ మాత్రం స్కూలు పిల్లాడిలా వయోలిన్‌ను బాక్స్‌లో సర్దుకుని లేచాడు. అందరివంకా చూసి దణ్ణంపెట్టి స్టేజి దిగాడు. మృదంగవిద్వాన్‌ కూడా అతన్ని అనుసరించాడు. చాలామంది అతని ఆటోగ్రాఫ్‌ కోసం వెంటబడ్డారు. టీవీకెమెరాలు వెంబడిరచినా అతను మాత్రం కేవలం చిర్నవ్వుతోనే సమాధానం చెప్పి వేగంగా బయటికి వెళిపోయాడు. డ్రైవర్‌ కారు డోర్‌ తీశాడు. కానీ కారు ఎక్కకుండా అప్పుడే వచ్చి ఆగిన ఆటో మాట్లాడు కుని వెళ్లాడు. కారు డ్రైవర్‌ సార్‌కి కోపం వచ్చిందన్నది అర్ధంచేసుకున్నాడు. ఆటో వెంటే కారు తీసికెళ్లాడు.

మర్నాడు ఉదయం అతను తొమ్మిదింటికి తీరిగ్గా లేచి ఎదురుగా ఉన్న తెలుగు పేపరు అందుకున్నాడు. రవీంద్రభారతిలో ఎన్నడెరుగని అద్భుత కచేరీ…
పూర్తిగా »

పిలుపువచ్చి…

ఏటి అలలపై
ముడిజార్చింది రేయి
హోయలుబోతోంది చందమామ
ఎన్ని పాటలో రేయంతా!

జ్ఞ్యాపకాల ముసురుపట్టి
మలుపులన్నీ దాటుతూ
ప్రశాంత ప్రయాణానికి
పయనమయింది పడవ!


పూర్తిగా »

అమ్మలు

05-ఏప్రిల్-2013


వేళ్ళు నొప్పులు పెడుతున్నా
బుజ్జి వేళ్ళు పెన్సిల్ వదలవు
పెద్ద కాన్వాస్ మీద
కలని గీస్తుంది !
క్షణం నొసట ముడిచి
మరుక్షణం గల గలా నవ్వి
నా జీవన యాత్రకి
రంగులు అద్దుతుంది
ఏ గీత చూసినా
లోకం అంతర్ముఖమే!

2.
అలా వెళ్తుందా
కాలం పరిచే వలదాటి
అంతరంగాన్ని ప్రశ్నిస్తుంది
నాలోకి చూసినట్టు
చిరునవ్వుతో చూస్తుంది
సేదతీర్చే ఆలాపనతో
ప్రయాణిస్తుంది నాలోకి
చిన్ని అడుగుల వెంట
పెద్ద అడుగులు!!


పూర్తిగా »