‘ మధు పెమ్మరాజు ’ రచనలు

నవ్వే ఏనుగు బొమ్మ

సెప్టెంబర్ 2017


నవ్వే ఏనుగు బొమ్మ

ఈ ఈ రోజు పద్మినీ టీచర్ కి ట్వంటీ రూపీస్ ఇస్తుంటే గట్టిగా మాట్లాడ్డమో లేక దగ్గడమో చేయకపోతే ఫరీద్ గమనించడు. అంతకీ చూడకపోతే, వాడిని బల్లిలా అతుక్కుని కూర్చునే యూసుఫ్ ని ఏదో వంకతో పిలవాలి. నేను డబ్బులివ్వడం చూసాడంటే ఫరీద్ మొహం గాజర్ గడ్డలా మారుతుంది. లేకపోతే మాటిమాటికి ‘ఆమ్ చూర్’, ‘హవల్దార్’ అని పిచ్చి పేర్లతో పిలవడమే కాకుండా పక్కవాళ్లకి నేర్పిపెట్టాడు. వాడు స్కూల్ ఎక్స్కర్షన్లకి వెళ్లనివారిని, జేబులో కనీసం టూ రూపీస్ కూడా లేనివారిని ‘ఆమ్ చూర్’ అంటాడు. అలా నాతో పాటు ఇంకొందరిని అంటాడు, “హవల్దార్” అని మాత్రం నన్నొక్కడినే పిలుస్తాడు. అలా పిలవడానికి పెద్దకారణం కూడా…
పూర్తిగా »

ఫైండింగ్ డోరీ

ఫైండింగ్ డోరీ

వారంలో రెండు రోజులు నా సొంతమని ప్రతీ వారం అనుకుంటాను. భ్రమ కాకపోతే ప్రవాహంలో పడ్డాక మన ప్రమేయం ఏముంది? తెల్లవారకుండానే సెల్ మ్రోగుతుంటే నిద్ర కళ్ళతో తీసి చూసాను, సేథీ నుండి ఫోను, “శికూ! అర్జెంట్ పని మీద హ్యూస్టన్ వచ్చాను, తిరిగి మధ్యాహ్నం వెనక్కి వెళ్లిపోవాలి కాస్త గలేరియా దగ్గర స్టార్బక్స్ కి రాగలవా?” అనడిగాడు. వేరొకరయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని, ఫోన్ చేసింది సేథీ! “రాగలవా…ఏమిటి? అరగంటలో అక్కడుంటాను.” అని లేచాను.

“మాడ్రిడ్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగింది!”, “అమెజాన్ అడవులలో నేను, అనూ…”, “మై స్వీట్ హోమ్ ఇన్ బ్లూమ్ ఫీల్డ్…” అంటూ సేథీ ఫెస్బుక్ పలకరింపులు తప్ప…
పూర్తిగా »

దిగంతపు అంచుల్లో

దిగంతపు అంచుల్లో

రేపే నా ప్రయాణం! ఇంత దాకా ఆశయాలని, అవసరాలని మోస్తూ నడిచాను. రేపు దారం తెంచుకున్న గాలి పటంలా గిరికీలు కొడుతూ కొత్త చిరునామాకి చేరుకుంటాను.

అర్థరాత్రి ఊహలతో రహస్య మంతనాలు జరుపుతున్నాను. ఎదురుచూపులు తప్ప లాప్టాప్ లో అలికిడి లేదు, కనీసం కారణం తెలియజేస్తూ ఈమెయిలు అయినా రాలేదు. తను వస్తుందనే ఆశ సన్నగిల్లి కార్పెట్ పై మెత్తగా ఒరిగిపోయాను.

వస్తావో రావో తెలియక
ఊసులు నిండిన రహస్యపుటరలు
ఒక్కొక్కటీ తెరిచి చూసాను
అన్నిట్లో ఒకటే రహస్యం

ఏమీ లేని సమయంలో
నాకు, నల్ల తెరకి
మధ్య సుదీర్ఘ సంభాషణ
ఏమీ తోచక కాదు..…
పూర్తిగా »

బౌండరీ దాటిన బాలు

బౌండరీ దాటిన బాలు

ఆరో క్లాసు చదువుతున్న జంగారెడ్డి పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. సాయంత్రం ఆట మొదలు పెట్టినపుడు “కొత్త కార్కు బాలు జర మెల్లగ కొట్టున్రి… ” అని అందరికీ మరీ, మరీ చెప్పాడు. ఆ ఫుల్టాస్ పడేదాకా అంతా అతని మాట విన్నట్టే అనిపించింది. బౌలర్ చెయ్య జారడం..బాటింగ్ చేస్తున్న షాజర్ కి బాలు బదులు ఫుట్బాలు కనిపించడం అరక్షణం తేడాలో జరిగింది, మిగిలిన అరక్షణంలో బాలు తాడి చెట్టంత ఎత్తెగిరి మైదానం పక్కనున్న ముళ్ళ పొదల మధ్యన పడింది.

ఆటగాళ్ళు జరిగింది దిగమింగుకునే లోపు షాజర్ కాలనీ వైపు బాణంలా దూసుకుపోయాడు, జంగారెడ్డి కసిగా కాస్త దూరం వెంబడించాడు కానీ బాలు వెతకాలనే ఆలోచన…
పూర్తిగా »