‘ రమా సుందరి ’ రచనలు

పసుపులేటి మల్లిఖార్జున గారి పక్షులు

డిసెంబర్ 2013


పసుపులేటి మల్లిఖార్జున గారి పక్షులు

దోవెమ్మట తలవంచుకొని పోతూ ఉంటే, ఎప్పుడో తప్పి పోయిన చిన్ననాటి చెలిమి అదాటుగా వచ్చి చేయి పట్టుకొంటే?! కళ్ళెత్తి చూసిన చూపులో ఎలాంటి విస్మయం గోచరిస్తుందో, అలాంటిదేదో నాలోనూ కనబడి ఉండాలి…. ఈ పుస్తకం దొరకగానే. పసుపులేటి మల్లిఖార్జునరావు గారు రచించిన “పక్షులు” నవల నేను మొదట ఎప్పుడు చదివానో గుర్తుకు రావటం లేదు. ఎన్ని సార్లు చదివానో కూడా గుర్తుకు రావటం లేదు. మా చిన్నప్పుడు ఆంధ్ర జ్యోతిలో నవలా ప్రియదర్శిని పేరు మీద సీరియళ్ళు వచ్చేవి. అవి చించి బైండింగ్ చేయించుకొనే వాళ్ళం. అలా ఈ పుస్తకాన్ని నా ఆరో తరగతిలో మొదట చదివినట్లు గుర్తు.

నా ఊహ వికసించినప్పటి నుండి ఈ…
పూర్తిగా »

భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు

ఆగస్ట్ 2013


భారత దేశంలో మహిళల వస్త్రధారణపై విమర్శలు

ఈ మధ్య కాలంలో ఎన్నడూ విననంతగా భారతదేశంలో స్త్రీలపై అత్యాచారాలు వెలుగులోకి వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గ, కుల స్త్రీలమీద ఇవి జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారాని పసిపాపలు, భారతదేశ ధార్మికత మీద ఆసక్తి తో వచ్చిన విదేశీ మహిళలు… ఎవరూ వీటి నుండి తప్పించుకోలేక పోతున్నారు.

అత్యాచారాలు జరిగినప్పుడల్లా రెండు వాదనలు ప్రముఖంగా వినిపిస్తాయి. సంప్రదాయవాదులు ఆడవారి వస్త్రధారణ వలనే అత్యాచారాలు జరుగుతున్నవని వాదిస్తారు. అంటే సాంస్కృతిక పరాయీకరణ వలన నష్టం జరుగుతుందన్న అర్ధం ఇందులో ధ్యనిస్తుంది. అయితే స్థానిక సంస్కృతుల పరిరక్షణకు అనుకూలంగా వీరు చేసే వాదనలో సంస్కృతీ పరిరక్షణ బాధ్యత అంతా భారత స్త్రీలదేనన్న ధోరణి వ్యక్తం అవుతుంది. ఆ…
పూర్తిగా »

నేనంటే హార్మోనులే!

కన్నె మేరి కన్నప్పుడు
కానుకలు పట్టుకొని దైవదూతలు వచ్చారట.
పదమూడేళ్ళకే నా ఆటపాటలు బందు
చేయించిన అమ్మ చెప్పలేదు
ఇంతి చేమంతులు
మగువతనాన్ని మోసుకొచ్చి
నాలో ప్రతిష్టించాయని.
నాటి నుండి నేటి వరకు
కాలచక్రంతో కాపలా కాస్తున్నాయి నాకవి.
కొన్నిసార్లు అలలు లేని నదులలాగా
నాతో సరాగాలాడుతాయి
ఇంకొన్నిసార్లు నడి సంద్రంలో
తెగిపడిన నౌక రెక్కలాగా
అతలాకుతులం చేస్తాయి
నెల మధ్యలో విజృంభించి
నెలసరితో శాంతించే ప్రళయ గోదావరులవి
నా దేహదాహాన్ని, కడుపాకలిని
కనుసన్నలలో ఆడించే మంత్ర గత్తెలవి
వంటి…
పూర్తిగా »

వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు

జూన్ 2013


వినిపించే గొంతుల వెనక తలుపులు తెరవని హృదయాలు

‘రయిక ముడి ఎరుగని బతుకు’ మీద పుస్తక పరిచయం

కధ 2012లో ఈ సారి కధలన్నీ ఆణిముత్యాలే. చాలా వరకు చదివిన కధలే. నాకిష్టమైన ‘రయిక ముడి ఎరుగని బతుకు’ కధ చూసి సంబర పడిపోయాను. ఈ కధలో ఒక ఆడబతుకు ఉంది. దానిలో అగాధమైన దుఃఖం ఉంది. ఆ దుఃఖానికి రమేశు భాష్యం ఉంది. ఆ భాష్యం అతని కరిగిన గుండె నుండి స్రవించిన జీవధార. అందులో కొన్ని సంవత్సరాల వెనుక దాదాపు ప్రతి ఇంట్లో బోడి తలలతోనూ, తుంటి దోపుతోనూ కనబడి; ఆ ఇంటి సుఖశాంతులకు, సౌకర్యాలకు పనిముట్లుగా మారిన ‘మొగుడు చచ్చిన’ ఆడోళ్ళ అలిఖత వేదన ఉంది. వాళ్ళ కూడూ, గుడ్డే…
పూర్తిగా »

ఆత్మాభిమానం కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

మార్చి 2013


ఆత్మాభిమానం  కోటేశ్వరమ్మ గారి ఇంటి పేరు!

ఈ జీవితానికి నాకు మధ్య ఎప్పుడూ యుద్దమే!

నా భాధతోనే కాదు – ఈ లోకంలోని భాధ అంతటితోనూ,

చీకటి అంతటితోనూ నా నిరంతర పోరాటం.

అందుకే ఈ చరిత్ర బాధార్ణవం -ఒక శోకార్ణవం

 -చలం

‘నిర్జన వారధి ‘ రచయిత్రి కొండపల్లి కోటేశ్వరమ్మగారి బాధ కూడ పూర్తిగా వ్యక్తిగతం కాదు, సామాజికమైనది, రాజకీయమైనది కూడ. అందుకే ఆమె బాధ ప్రతి పాఠకుని హృదయాన్ని పిండి వేస్తుంది. ఈ పుస్తకం కోటేశ్వరమ్మగారి అంతర్వాహిని గా సాగినా, ఆమె శైలి, కధనంలోని భిన్నత్వం మనల్ని పుస్తకం పూర్తి అయ్యిన దాకా వదలనివ్వదు.

తన తొంభై రెండు…
పూర్తిగా »