‘ రామా చంద్రమౌళి ’ రచనలు

గడ్డి తాడు

ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక గూండా రాజకీయ నాయకునిది. వాడికి ఓ ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఓ పదిపదిహేను బార్లు, ఐదారు  బ్రాండీ షాప్స్, ఐదారు రియల్టర్ కంపనీలు, నేషనల్ లెవెల్ ప్రభుత్వ రోడ్ కాంట్రాక్ట్ లు ఉన్నాయి. వాడి ముగ్గురు కొడుకులు ఓపెన్ టాప్ ఆడి కార్లలో ఇరుప్రక్కలా అందమైన అమ్మాయిలను వేసుకుని తను చదివిన ఇంజనీరింగ్ కాలేజ్ కు అలా వాహ్యాళికొచ్చినట్టు వస్తారు. అంతా బహిరంగ శృంగార రసాత్మక చర్యలే. కాలేజంటే వాళ్ళ ఎస్టేట్. అడిగేవాడెవ్వడూ ఉండడు. ప్రిన్స్ పాల్ లక్షలిచ్చి పోషించబడే దిక్కుమాలిన అప్రాచ్యపు స్టాఫ్ ఒట్టి   వెధవలు. ఒక్కనికీ పాఠాలు చెప్పరావు.
పూర్తిగా »

పిడికిట్లో గాలి ఉందా?

గాలిలాగే అన్నీ కనబడవు
కాని తెలుస్తాయి
స్పర్శతో.. అనుభూతితో.. ప్రకంపనలతో

బంధాలైనా బాంధవ్యాలైనా ఏర్పడ్డానికి హేతువులుండవు
చినుకులకు మట్టితో ఏమిటి సంబంధం
కొంత పరిమళాన్ని దానం చేస్తూ
వర్షం వెళ్ళిపోతూనే ఉంటుంది తీరాలను దాటుకుంటూ –

నగ్నంగా గుడిసెల్లో పిల్లలు
పిల్ల కాల్వల్లో కాగితపు పడవల్ని వదుల్తూ.. పరుగెత్తుతూ.. అరుస్తూ
భాషే ఉండదు.. ఒట్టి బోసి పాదాలు.. జలజలా నవ్వులు

పడవెళ్ళిపోతున్నప్పుడు
కొంత కోల్పోతున్నప్పటి వీడ్కోలు దుఃఖం
అంతా నల్లగా అంటుకుపోతున్న తారు బంక.. బంధం

ఎవరెవరికి ఎవరు ఎక్కడి పరిచయాలో.. ఎక్కడ తటస్థపడడాలో
అల్లుకుపోతారు.. ఆకాశంలో మేఘాల్లా
ఒకరికోసం…
పూర్తిగా »

తాళం చెవి దొరకడం లేదు!

తాళం చెవి దొరకడం లేదు!

ప్రవేశిస్తున్న ప్రతిసారీ “లాకిన్ పీరియెడ్”గురించి స్పృహ
మూడేళ్ళా.. ఐదేళ్ళా.. అని
తలుపులు తెరుచుకుని.. మళ్ళీ మనమే మూసుకుని.. తాళంకూడా వేసుకుని
లోపల బందీ కావడం ఎంతకాలమో తెలియని అనిశ్చితి
మెడలో తాళి కట్టబడ్డ తర్వాత
“లాకిన్ పీరియెడ్” ఒక జీవితకాలం..ఇద్దరికీ
అప్పుడప్పుడు అనివార్యతలు లాకిన్ పీరియడ్ ను ధ్వంసం చేయమంటాయి
ప్రి-మ్యాచుర్డ్ పెనాల్టీలు భయపెడ్తాయి
ఉల్లంఘనకూ.. విముక్తతకూ సిద్ధపడుతున్నపుడు
తాళం చెవి దొరకదు.. ఎక్కడో పడిపోతుంది..వెదకాలి
ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని తెలుసుకోవడమే తెలియనప్పుడు
రెండు మనసుల మధ్య దూరం అస్సలే అర్థంకాదు
ప్రయాణం…
పూర్తిగా »

మనిషికి అటువైపు

డిసెంబర్ 2014


మనిషికి  అటువైపు

Otherness of others
Otherness of self
మనుషుల ముఖాలనూ పార్శ్వాలనూ తెలుసుకోవడం నిజంగా కష్టమే
చాలాసార్లు మనింట్లోనే మనం అపరిచితులం కావడం
మనకు మనమే పరిచయం లేకపోవడం
తెలుస్తుంది మనకు.

లోపల “సారంగి” తీగలపై ఒక విషాద స్వరం వినబడి
దిగంతాల అవతలికి తరుముతుంది.
చుట్టూ దట్టంగా పొగమంచు
ఏ దారీ కనబడదు.
అడుగులను ధరించి బయటికి వెళ్ళినవాణ్ణి ప్రతిరోజూ ధ్వంసమై వస్తున్నాను ఇంటికి
అంతా శిథిల బీభత్సమే
మళ్ళీ మళ్ళీ ప్రతిరోజూ దారులను వెదుక్కోవడమే
పునర్నిర్మాణం..
నన్ను నేను ప్రతిదినం ఎన్నిసార్లని పునః పునః…
పూర్తిగా »

అలలు..

అలలు..

సముద్రంవలె..మనిషి నిండుగా..ప్రశాంతంగానే
కాని లోపల ఎన్ని యుద్ధాలో
ఉండీ ఉండీ ఎక్కడినుండో ఒక నిప్పురవ్వ అంటుకుంటుంది
అరణ్యం దహించబడ్తున్నట్టు జ్వలన..మంటలు..నింగికెగుస్తూ,
సరిగ్గా అప్పుడనిపిస్తుంది..ఎక్కడికైనా పారిపోవాలని
పారిపోతున్నప్పుడు..టకటకా రైలు పట్టాల చప్పుడు..లోహధ్వని
విడివడిపోవాలి..తెంచుకోవాలి..వియుక్తమై
పయనిస్తున్నప్పుడు వెనక్కి పరుగెత్తుతూ..చెట్లు..రోడ్లు..జీవితం
వర్షిస్తూ..గర్జిస్తూ..ఆక్రమిస్తూ కోట్ల జ్ఞాపకాలు
శరీరం ఒట్టి నిమిత్తమాత్రమే..తెలిసీ ఏదో అర్థంకాని పరితపన..ఆర్ద్రత
ఏకు..దారం..ఒకరినుండి మరొకరి కొనసాగింపు
ఏవో పురాస్మృతులు వెంటాడుతున్నపుడు
మూలాలకోసం అన్వేషణ
ఏవో లీలగా స్ఫురించే జాడలకోసం వెదుకులాట
నిన్నటి వెనుక ఏమిటి..రేపటి ముందు ఏమిటి..అన్న స్పృహ-

ఉండీ ఉండీ ఏ దేవాలయంలోనో ఒక పురాశిల్పాన్ని…
పూర్తిగా »