కథ

పలకరింపు

పలకరింపు

సూర్యారావు అడిగింది విని ఆశ్చర్యపోయాడు భాస్కర్‌. అదంత పెద్ద కోరికా? కాలానికి జవాబుదారీతనం లేదా? భాస్కర్‌ ఆలోచిస్తున్నాడు. గతం తాలూకు నీడలు కదిలాయి.

***

ఇదేమిటీ ? ఇక్కడ..ఇలా ఉంది? డీలాపడిపోయాడు భాస్కర్‌. చుట్టూ చూసి వెనుదిరిగిపోదామనుకున్నాడు.

తను టీ తాగేటప్పుడు అందరిలా కప్పు కుడిచేత్తో పట్టుకోడు. ఎన్నో పెదాల ఎంగిలి కిట్టదు. టీ చప్పరించలేడు. ఎడమచేత్తో కప్పు పట్టుకుని తాగుతాడు ఎప్పుడూ.చిన్నప్పట్నుంచీ అదే అలవాటు. ఇంట్లో కూడా తన కంచాన్ని ఎవర్నీ ముట్టుకోనీయడు. అలాంటిది అక్కడ అరిగిపోయి సొట్టలు పడి వంకర్లు తిరిగిన కంచాలు చూడగానే మతిపోయింది. అయినా ఎలా? గత్యంతరం లేదా? అక్కడొక పెద్దాయన ఉన్నాడు. ఎవర్నో బూతులు…
పూర్తిగా »

చిన్నమాట

మార్చి 2015


చిన్నమాట

“క్రిష్ణలో ఎందుకు.. వెన్నెల్లో చేస్తాను.” టక్కుమని చెప్పేసింది.

తనంతే. సూటి మనిషి. ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్పేస్తుంది సమాధానాలు. ఇంక మళ్ళీ నేను తనని స్నానం చేయమని అడగలేదు. కళ్ళు మూసుకున్నా నేను చూడలేంది, ఆమె దాచగలిగేది ఏదన్నా ఉంటదా అని ఒక ప్రశ్న-
ఆమె కార్ డోర్ని ఒక్కతోపు తోయగానే ప్రశ్న చెదిరిపోయింది. ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఇది వరసగా మూడో రోజు.. మేమిలా రోడ్ల వెంట, ఊర్ల వెంట తిరుగుతూ ఉండటం.

1

ఎలా మొదలైందనుకున్నావు? అబ్బా.. అది చిత్రంలె. మొదటి రోజు మేం కలిసినపుడు రైలుబండొకటి మా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళిపోయింది. ఇదిగో-…
పూర్తిగా »

గుండు

గుండు

“మీరెన్ని చెప్పినా నేనొప్పుకొనేదేలేదు” అని ఖచ్చితంగా చెప్పింది వెంకటమ్మ గుడ్డలమూటమీద బాసిపట్లేసుకొని కూర్చుంటూ.

“నీకే అంతుంటే నీ మొగుడ్ని అందునా మొగోడ్ని నాకెంతుండాలి, నేను మాత్రం ఎందుకొప్పుకుంటాను” ఎదురు ప్రశ్నించాడు యాకోబు కండవని తలకు చుట్టుకుంటూ.

కథ మళ్ళీ మొదటికొచ్చేసరికి కందులూరు గ్రామస్థులందరికి విసుగొచ్చి లేచి ఇంటికి వెళ్ళాలనిపించింది. చూస్తే కరెంట్ లేదు టీవీలు కూడా రావు, ఇంటి దగ్గర పనులేమి లేవనే విషయం గుర్తుకొచ్చి ఊరికే వచ్చే ఆనందాన్ని ఎందుక్కాదనాలని అక్కడే కూర్చుండి పోయారు.

“ఒరేయ్ వెంకటేసు నువ్వే చెప్పరా మీయమ్మ మాట వింటావా ? మీ నాన్న మాట వింటావా?” అన్నాడు అంత అందమైన తగాదా లో నిశ్శబ్దాన్ని భరించలేక తంబారంబావ…
పూర్తిగా »

గాలికీ కులముంది…!!

మార్చి 2015


గాలికీ కులముంది…!!


అదో గాడ్పు మధ్యాహ్నం. వాళ్ళని దింపిన బస్సు అంపకాలు పెట్టి చేతులు దులిపేసుకున్న తండ్రిలా హడావిడిగా అపస్వరపు హారన్ రోదన చేసుకుంటూ వెళ్ళిపోయింది. దూరం నుంచి ‘ఇదే ఇల్లు ‘ చూపించాడు నారాయణ. దగ్గర పడుతున్నకొద్దీ ఏదో దిగులుగా, గుండెలు చిక్కపట్టినట్టు అనిపించింది అమృతకి . ఆమె హ్యాండ్ బాగ్ లో ఉన్న అమృత మత్సకంటి వెడ్స్ నారాయణ స్వామి గౌడ్ అని ఉన్న శుభలేఖ ఒక్కసారిగా బరువెక్కినట్టు, ఒకానొక వేసవి జూన్ నెల ఉబ్బరం అంతా మొహం లోకి వేడిగాలిలా కొట్టినట్టయి నారాయణ చేతిని పట్టుకుంది, అప్రయత్నంగా. సెకనులో టెన్షన్ తో ఉన్న నారాయణ మొహంలోకి ధైర్యపు నవ్వు పాకి వచ్చింది.…
పూర్తిగా »

కొయిటా అబ్బులు

ఫిబ్రవరి 2015


కొయిటా అబ్బులు

గణపతి నవరాత్రుల్లో మూడో రోజు రాత్రి. గోదావరి నది వశిష్ట పాయ కు దిగువున ఉన్న లంక. పిల్లా పాప – ముసలీ ముతకా అంతా సిల్లో పోల్లోమంటూ గోను సంచులూ, చెక్క పీటలు పట్టుకొని కాకినాడ ‘గంగాధర్ మ్యూజికల్ నైట్’ చూడడానికి ఒడ్డున, సెంటర్లో కి వచ్చేసారు. ఇసుక బట్టీ పనికి వెళ్ళిన కొందరు మొగాళ్ళు, సుబ్బరావు సారా కొట్టు దగ్గర ఒక మూడు ఔన్సులు పుచ్చుకొని, వలీ కొట్టు దగ్గర మాంసం పకోడీలు తింటూ సైకిల్ స్టాండు వేసి దాని మీద కూర్చున్నారు.

వోణీలేసుకున్న అమ్మాయిలను , లుంగీలు కట్టుకొన్న అబ్బాయిలు ఫాలో అయిపోతున్నారు. మునసబు గారింట్లో భోజనాలు ముగించుకొని ఆర్కేస్టా…
పూర్తిగా »

నడక

నడక

నడుస్తున్నాను.

సముద్రపు అలలు నా ఆవేదనలాగే ఘోషిస్తున్నాయి.

రోజూ ఆరింటికి మొదలౌతుంది, నా నడక. నా ఆవేదన. నా జీవితం. గత ఏడేళ్ళుగా ఇంతే.

ఎంతో మంది నాతో నడుస్తారు. నన్ను చూస్తారు. ఎంతోమందిని నేను చూస్తాను. కొంతమంది ముఖలు నాకు గుర్తుంటాయి. కానీ ఎవ్వరూ నన్నుపట్టించుకోరు. ఒక్కరయినా పలకరింపుగా నవ్వరు. బహుశా వయసు ఆంతర్యం అయ్యుండచ్చు. నా వయస్సు అరవై తొమ్మిది.

ఎక్కువగా తారస పడే వారిలో, ఒక యాభై యేళ్ళ మీసాలాయన. ఈయన చాలా పొడుగ్గా, బలిష్టంగా వుంటాడు. చాలా హుందాగా నడుస్తాడు. చూట్టానికిబాగుంటాడు. ఓ పాతికేళ్ళ పొడుగు జుట్టమ్మాయి. అందంగా వుండదు. కానీ కురూపికయినా కురులు అందం అంటారు. ఆ…
పూర్తిగా »

డీటూర్స్

డీటూర్స్

“పనేరా బ్రెడ్‌కెళ్లి ఓ కప్పు కాఫీ తాగుదామా?” కారు వాషింగ్టన్ డల్లస్ ఎయిర్‌పోర్ట్‌నించీ బయటకు వెడుతున్నప్పుడు అడిగాడు మెహతా. సాయంత్రం అయిదుగంటల ప్రాంతం. అదే ఏడుగంటల తరువాత అయితే ఏదయినా బార్‌కెళ్లి బీర్ తాగుదామనేవాడేమో! సరేనన్నాను.

కారు హైవే ఎక్కిన తరువాత, “వేరార్యూ కమింగ్ ఫ్రం?” అడిగాడు. ” శాన్‌ఫ్రాన్సిస్కో నించీ,” చెప్పాను.

“నైస్ ప్లేస్. డూ యూ గో దేర్ ఆఫెన్?”

“నెలకోసారి – దాదాపుగా!”

“అయితే, హమీర్‌ని తరచుగా కలుస్తూంటారన్నమాట!”

“ట్రై చేస్తుంటాను.”

“ఈసారి కలిశారా?”

“ఏదీ, లాస్ట్ వీకెండేగా వచ్చెళ్లాడు? అందుకని వాడూ పెద్దగా పట్టించుకోలేదు, మొన్నెళ్లి ఇవాళ వస్తున్నాను గనుక వున్న ఒక్క రోజులో నాక్కూడా కుదర్లేదు.”

కాసేపు…
పూర్తిగా »

మలిసంధ్య బృందావనాలు

మలిసంధ్య  బృందావనాలు

“కన్నమ్మా, రోజులుదగ్గర పడిపోతున్నాయిరా తల్లీ. ఈ లాదిని తొందరగా మర్చిపోతావు కదూ, ఎప్పుడూ నన్ను గుర్తు తెచ్చుకోకే! నా ఆయుష్షుకూడా పోసుకుని నూరేళ్ళు చల్లగా జీవించు.”

మంచి నిద్రలో ఒత్తిగిలిపడుకున్న పాప లేత చెక్కిళ్ళను ముద్దాడాను.చిన్న కన్నీటి చుక్క నా కంటికొస నుంచి పాప నుదుటిపైకి జారింది వీడుకోలుకు సమాయత్తమవుతూ.

రెండేళ్ళు ఎలా గిర్రున తిరిగిపోయాయో తెలీనే లేదు. నిన్నగాక మొన్న వచ్చినట్టుంది, అంతలోనే పంపించే సమయం వచ్చేసింది. వచ్చిన మొదట్లో ఊపిరికూడా పీల్చుకోవటానికి ఓపికలేనట్టు ఉండేది పాప, ఇప్పుడు కాస్త కోలుకుని ఒళ్ళు చేసింది.

ఇంకొక్క వారం, అంతే!

వీడ్కోలు వేదనకు, స్వాగతించే సంతోషానికి నడుమన ఒక సన్నటి గీతను చెరపలేనంతగా గీసేసాను.…
పూర్తిగా »

కారు చెప్పిన కథ

కారు చెప్పిన కథ

ప్రతీవారంలానే ఈ వారమూ ఊరికని బయలుదేరా. ప్రపంచంలో నన్ను అత్యంత సంతోషపెట్టేదేదైనా ఉందంటే.. అది కచ్చితంగా మా ఇల్లే. అదేంటో మనం వెళ్తున్నామనగానే వెళ్ళాల్సిన ప్రదేశానికి సంబంధించిన గాలి మహత్తేదో ఇక్కణ్ణుంచే పని చేయడం మొదలుపెడుతుందనుకుంటా.. ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందే కదలాడుతూ ఉంటాయి. రాత్రంతా నిద్ర లేకున్నా కళ్ళు ఎర్రబడవ్, పొద్దుణ్ణుంచి ఏం తినకున్నా ఆకలవదు, చేరాలనుకుంటున్నదీ , చేరేదీ అక్కడికే అన్న విషయం తెలిసి కూడా ప్రతీసారీ, క్రమం తప్పకుండా ఇలాగే జరుగుతుంటుందెందుకో?

రెండు సిటీ బస్సులు మారాక.. ఊరికి పోయే బస్సందుకున్నా. ఎల్బి నగర్ దాటిన బస్సు వేగంగా దూసుకెళుతోంది. గంట క్రితం దూరంగా ఉన్న జనాలకీ, గంట ప్రయాణం…
పూర్తిగా »

మేమూ, అమ్మలమయ్యాము

జనవరి 2015


మేమూ, అమ్మలమయ్యాము

ఆ రోజు దీపావళి అమావాస్య! వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో సంబరంగా జరుపుకొనే పండగ. రంగు రంగుల మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వల కాంతులతో అంతటా వెలుగే వెలుగు. ఈ వెలుగును చూడలేక చీకటికే భయంవేసి పారిపోయింది. గోదారి ఒడ్డున ఆనుకొని ఉన్న సన్నపాటి సందులో, ఓ పాతకాలపు మేడ మీద చిన్న వాటాలో ఉ౦టున్న సావిత్రి ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, బద్ధకంగా ఒళ్ళు విరుచుకొంటూ కిటికీ లోంచి చూస్తూ…
“ఒసే! రాణీ! రోజూ లోకమంతా నిద్రపోవడానికి రాత్రికోసం ఎదురుచూస్తుంటే మనం బతకడంకోసం ఎదురుచూస్తాం, కాని ఈ ఒక్క రోజు మాత్రం అందరూ మేలుకొంటారు. తెల్లవార్లూ టపాకాయల మోత వినిపిస్తూనే వుంటుంది. ఈ…
పూర్తిగా »