కథ

ద్వాదశి

ద్వాదశి

ఆకాశరాజు కూతురు  చిట్టడవిలాంటి చిక్కటి నల్లటి  తన జుట్టుని పాయలు పాయలుగా విడదీసి  దువ్వుకొంది. ఆ చక్కటి కురులని బిగించి కట్టడానికి ఇంద్రధనస్సుని మించిన రిబ్బన్ ముక్క మరెక్కడ దొరుకుతుంది? అందుకే దానినే రెండుగా త్రెంచి జడలకి కుచ్చీలుగా కట్టుకొంది. తనవైపే అపురూపంగా చూస్తున్న చందమామని అలవోకగా అందుకుని ఓ చెంపన తురుముకుంది.అడుగుకో కూతురున్న ఆకాశరాజుకి, ఆమె ఎన్నో కూతురో తెలీదుకానీ, పేరు మాత్రం ద్వాదశి. ద్వాదశి అందం మామూలు అందం కాదు.  అదో గిలకబావి. తోడేకొద్దీ ఊరినట్టు, చూసే కొద్దీ ఆ అందం రెట్టింపవుతూ ఉంటుంది.ఆమె నడుముని మెచ్చుకుంటే మెడకి కోపం. మెడని మెచ్చుకుంటే జడకి తాపం. ఆమె దేహంలో…
పూర్తిగా »

రహస్య లిపి

జనవరి 2017


రహస్య లిపి

చెబితే నువ్వు నమ్మవుకానీ, ఎంత వెతికాననుకున్నావు! పుస్తకాల షాపులలో, లైబ్రరీలలో- రాత్రిం బగల్లూ వెతుకుతూనే ఉన్నాను. ఎంత వెతికినా దొరకదే- అస్సలు దొరకదు. అసలు మా ఊల్లో నేను వెతకని చోటంటూ ఉండదు. ఎవరు ఏ పుస్తకం చదువుతున్నా, ఆ పుస్తకమే చదువుతున్నానని మనసులో ఒకటే అలజడి. ఎక్కడైనా ఆ పుస్తకం ధ్యాసనే. సందేహాస్పదంగా ఎవరు కనిపించినా సరే- సందేహం తీరే దాక వాళ్ళను అనుసరిస్తాను. నేను ఎక్కడికెళ్ళినా సరే ఆ పుస్తకం జాడకోసం అన్వేషిస్తూనే ఉంటాను. ఆ పుస్తకంకోసం నేను వెతికే ప్రక్రియలో ఎన్ని పుస్తకాలు తారసపడ్డాయో- కానీ మొట్టమొదటి సారి ఆ పుస్తకాన్ని చూసినప్పుడు నాలో కలిగిన ఉద్వేగం మరెన్నడూ కలగలేదు. కళ్ళు…
పూర్తిగా »

ఒరాంగుటాన్

డిసెంబర్ 2016


ఒరాంగుటాన్

ఆఫీసులో వాడొచ్చి చేరేదాకా అంతా బానే ఉండేది. మేం ఐదుగురం కలివిడిగా సందడిగా ఉండేవాళ్ళం. అసలు అది ఆఫీసు పనేనా అన్నంత సఖ్యంగా చేసుకునేవాళ్ళం. వాడొచ్చి కడివెడు పాలల్లో ఉప్పుకల్లులా కలిసేదాకా.

నలుగురూ నవ్వేచోట గుర్తు రాకూడని మనిషి. పేరెందుకు గానీ, టైపిస్టు కాబట్టి అలాగే పిలుస్తాను. వాడు రాకముందూ టైప్‌ మిషను ఉండేది గానీ, ముసుగేసుకుని ఓ టేబిలు మీద అలా పడుండేది. హెడ్‌ గుమాస్తాగారికి ఎపుడన్నా నడుం లాగినపుడు కుర్చీ లోంచి లేచి అటూయిటూ పచార్లు చేస్తూ ఆ టేబిలు మీద కూర్చుని మాతో కబుర్లు చెప్పేవారు. ఆయన మనవళ్లు ఎపుడన్నా ఆదివారం సరదాగా ఆఫీసుకి వచ్చినపుడు ఆ మిషను మీద…
పూర్తిగా »

తన్మయి

డిసెంబర్ 2016


తన్మయి

జరిగింది నిజమే… కానీ కలంత అందంగా. కల నీకు మిగిల్చే అనుభూతి వాస్తవంలో అనుభవంలోకి వస్తే ఈ దివాస్వప్నాలు నీ ఆత్మని కోటి దీపాలతో వెలిగించి చూపుతాయి.

ఈ అనుభవంతో కలిగే స్పృహ అందులో వుండగానే తెలిసిపోవటం కల మెలకువలు కలగలసిపోయిన ఈ మన:స్థితి ఓ చెంప భయపెడుతుంది. అందాన్ని చూసి కంపించినట్టు, ఆనందం నిన్నుతాకినా అందుకోవడానికి భయం కలుగుతుంది ఒక్కో క్షణం.

నువ్వు సిద్ధంగా వుండాలి. అది నిన్ను వెతుక్కుంటూ వచ్చిన లిప్తల్లో ఏమరుపాటుగా వున్నావా ఎప్పటికీ ఇక అంతే!

నా హృదయం కంపించిపోయే క్షణాల్లో అతనన్నాడు- ఈ ఆనందాన్ని అందరూ handle చేయలేరు.
People are dreaded to hold…
పూర్తిగా »

ప్రయోగం

డిసెంబర్ 2016


పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు చదివిన పుస్తకం లోని వాక్యాలు దృశ్యాల రూపంలో కలలోకి వచ్చి నా నిద్రని కలత నిద్రగా మిగిల్చిన విషయం గుర్తుకొచ్చింది. రాత్రి నేను చదివిన పుస్తకంలో కొన్ని ప్రయోగాల గురించి ఉంది. అయితే అవి సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు కాదు, మనుషుల జీవితాలకి సంబంధించిన ప్రయోగాలు. కొంత మంది తమ జీవితాలతో తాము చేసుకున్న ప్రయోగాలు. నిజానికి మహాత్మా గాంధీ తన జీవితమే సత్యంతో తాను చేసిన ఒక ప్రయోగం అని చెప్పుకున్నారు. సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు భౌతికమయిన విషయాల గురించిన నిజాలను వెలికి తీస్తాయి. జీవితానికి సంబంధించిన ప్రయోగాలు మాత్రం మన దృక్పథాన్ని మార్చగలిగిన జీవిత…
పూర్తిగా »

దామిని

నవంబర్ 2016


దామిని

“సౌమ్యా, అశోక్ అంకుల్ ఇంట్లో పార్టీకి నువ్వు రాగలవుటే?” అంది అమ్మ.

“ఊఁ వస్తానమ్మా, ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకుంటే పార్టీలో కూర్చోగలనులే” అన్నాను. నాకిప్పుడు తొమ్మిదో నెల. ఇంకో వారంలో డెలివరీ డేట్ ఇచ్చారు. నాకు నిజానికి ఓపిక లేదు కాని అక్కడ దామిని గారిని చూడొచ్చుకదా అనుకోవడంతో ఉత్సాహం వచ్చేసింది.

దామిని – నాకు ఇష్టమైన రచయితల్లో ఒకరు. అశోక్ అంకుల్ డాక్టర్. బిజినెస్ మాగ్నెట్ కూడా. భార్య పోయాక దామిని గారితో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాడు.

సాయంత్రం అమ్మ, నాన్న, నేను బయల్దేరి వెళ్ళేప్పటికే అతిథులు చాలా మంది వచ్చేసి…
పూర్తిగా »

ఇష్ట కామ్యం

ఇష్ట కామ్యం

నన్ను కోటీశ్వరుణ్ణి చెయ్యమ్మా! డ్యూప్లెక్స్ ఇల్లు, ఎస్ యూ వీ కావాలి. – విక్రాంత్

పిల్లలు మంచి పొజిషన్ కి రావాలి. IAS, IPS అవ్వాలి. – మహదేవ్

ఎమ్ సెట్ లో వందలోపు రాంక్ రావాలమ్మా – వైదేహి

నాకు డిస్నీ లాండ్ టికెట్స్ కావాలి. ఒక బైనాకులర్స్ కూడా – సుస్వర. ఇంకోటి ప్లీజ్. బార్బీ డాల్ కూడా!

మేం ఇద్దరం భార్యాభర్తలుగా మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చూడు తల్లీ – విహాన్, ఫాతిమా.

“ఇది చూశావా! విహాన్, ఫాతిమా అంట! పెళ్ళైందో లేదో” నవ్వేస్తున్నాడు శివరామ్.

“ఇంకా ఎంతసేపు ఉండాలో లైన్లో” శైలజ నిట్టూర్చింది.

“టైమ్ పడుతుంది. అందుకే…
పూర్తిగా »

యంత్ర

యంత్ర

“Ladies and gentlemen, now we request your full attention as the flight attendants demonstrate the safety features of this aircraft.”

సీట్ బెల్ట్, ఆక్సిజన్ మాస్క్, లైఫ్ వెస్ట్, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, ఇన్ ఫ్లైట్ మాగజైన్. అన్నీ వున్నాయి. ఇప్పుడు నవ్వు ముఖం వేసుకోని మొదలుపెట్టాలి. నవ్వు రాదేంటి? కమాన్ శ్రీలతా! ఓహ్ సారీ. ఫ్లైట్ లోపల మన పేరు సిరి కదూ?

“When the seat belt sign is on, please fasten your seat belt.

అబ్బ! మొదటి వాక్యం వినగానే, ఆటోమాటిగ్గా ముఖం మీదకి స్మైల్ వచ్చేస్తుంది. అలా అలవాటైపోయింది. ట్రైనింగ్…
పూర్తిగా »

జీవించేందుకు సూత్రాలేమిటి?

అక్టోబర్ 2016


తెలతెల వారుతూంటే నిద్ర లేని రాత్రిని విసుక్కుంటూ మంచం దిగి బాల్కనీలోకి వచ్చాను. ఆకాశం దిగులుగా ఉందని తోచింది. నా మనసులో దిగులు ఆకాశానికి పులిమేసి చూస్తున్నానా లేక ఆ మబ్బులు నిజంగా ఆకాశానివేనా? ఇంతలో చటుక్కున వాన చినుకులు ఆరంభమయ్యాయి. నా అశాంతికి మృదువైన లేపనంలా చల్లని జల్లు ముఖాన్ని తాకుతోంది. ఒక్కసారిగా తెలియని ఆనందమేదో నా చుట్టూ పల్టీలు కొట్టింది. నన్ను పలకరించింది. చేతిలో టీ కప్ తో వచ్చి బాల్కనీ అంచున కూర్చున్నాను.

ఇష్టంగా నేను ఏర్పరుచుకున్న వ్యాపకాన్ని వదిలి పారిపోయి వచ్చేసేను. ఈ నచ్చకపోవటాలు నాకు ఎక్కువే. నాలుగైదేళ్లుగా ఏకాగ్రతతో ఒక రూపుకు తీసుకొచ్చిన బొటీక్ ‘శింగార్’ని, రేణు స్నేహాన్ని…
పూర్తిగా »

గాలిపిట్టలు

అక్టోబర్ 2016


నా పేరు శీను. నా వయసు పదిహేనేళ్ళు. కాదు కాదు – ఇప్పుడు నేను ఇంకా ఆమె కడుపులోనే ఉన్నాను. పదిహేనేళ్ళు అంటే – నేను బతికున్నప్పుడు నా వయసు పదిహేనేళ్ళని.

నేనే ఆమెకి బిడ్డగా పుట్టబోతున్నానని ఆమెకి తెలిసిపోయింది. అదిగో చూడండి!… “నువ్వే కదరా శీనా నా పొట్టలో ఉందీ!? నాకు తెలుసు, నువ్వే నాకు బిడ్దగా పుట్టబోతున్నావు”అని ఎన్ని సార్లు అనుకుంటుందో…

మా నాన్న ఆమె మంచం మీద ఓ పక్కన ఒదిగి పడుకోనున్నాడు. ముందు గదిలో అమ్మమ్మ (నాకు కాబోయే అమ్మమ్మ) దగ్గుతోంది. ఆ పల్లెటూళ్ళో పెంకుటిల్లు బావుంది.

ఇంకాసేపట్లో నా తల్లి కాబోతున్న ఆమె జీవితం గురించి మీకు ఇప్పుడే…
పూర్తిగా »