నీరెండ మెరుపు

కవిత్వం కేవలం కొన్ని వాక్యాల కూర్పు మాత్రమే కాదు. అదొక అనుభవం! మనలోపల మనకే తెలియని ఒక చీకటి కోణాన్ని వెలిగించే దీపం. ఆ దీపం మీలో ఎలా వెలిగిందో, ఏమేం వెలిగించిందో ఈ శీర్షికలో ఆ వెలుగుని పంచుకోండి. నీరెండ మెరుపు …ఎంచక్కని కవితల పరిచయం. ఈ శీర్షికకు ఎవరయినా రాయవచ్చు.

ఇంక చదువుకుందాము బాల్యాన్ని….

22-మార్చి-2013


ఇంక చదువుకుందాము బాల్యాన్ని….

కవిత్వానికి ఒక సంభాషణ వుంటుంది దానిలో ఒదిగిపోయి మనం కవిత్వంతో పాటూ ప్రయాణిస్తాము.

ఏలాంటి సంఘటన అయినా అది మనకే జరిగిందా లేక మనం గమనిస్తున్న మనుషుల మధ్య జరుగుతోందా అన్నంత సహజంగా పాఠకులను తీసుకువెళ్ళినప్పుడే ఆ పద్యం మనల్ని వెంటాడుతుంది. ఆ పోలికలు వున్న ఏ సందర్భాన్ని చూసినా వాళ్ల భావాలు మన మనసులోకి ఆ పదాలతోపాటు సీతాకోకచిలకల్లా వచ్చి వాలిపోతాయి. అప్పుడు ఆకవి పేరు గుర్తుకి రాక పోవచ్చు కాని ఆకవిత్వం మనల్ని వెంటాడుతుంది. అలాంటి పద్యమే గంటేడ గౌరునాయుడి పద్యం”బాల్యం”.

బందులదోడ్దీ అంటే పల్లె టూళ్లలో దొంగతనంగా చేల్లొ పడి మేసిన పశువులని బందులదోడ్డిలొ కట్టేస్తారు.
అందమైన బాల్యం హాయిగా…
పూర్తిగా »

మేఘానికి మరోవైపు!

మేఘానికి మరోవైపు!

పడిలేచే ప్రయత్నమే రాలిన ప్రతి చినుకుదీ. కదిలించే కన్నీరే రాలిన ప్రతి పూవుది. సాథారణ కవులెవరూ పసిగట్టలేని కదలికలు కూడా చూడగలిగే కవయిత్రే ప్రసూనా రవీంద్రన్. కాబట్టే, “మేఘానికి మరోవైపు” వ్రాయగలిగింది.

ప్రకృతి పారవశ్యంలో వ్రాసే కవితలు చాలానే ఉంటాయి. వానపాటల పకపకలు, మేఘమాల రెపరెపలు, పున్నమి వెన్నెల నవ్వులు, పూల రేకల గుసగుసలు, పిచ్చుకల కిచకిచలు, కప్పల బెకబెకలు. అందాన్ని అద్దంలా ఆవిష్కరించే కవితలే ఇవి. ఆకాశమంతా అలుముకున్న కవిత్వమే ఇది. చాలామందిని మెప్పించే కవిత్వమే ఇది. చాలామంది వ్రాస్తున్న కవిత్వమే ఇది.

“మేఘానికి మరోవైపు” మాత్రం కేవలం పరవశత్వంతో వ్రాసినది కాదు. తాదాత్మ్యం చెంది వ్రాసిన కవిత.

 

“మేఘానికి మరోవైపు“

ఆకాశం…
పూర్తిగా »

గుర్తుండే ఓ కల లాంటి కవిత…

01-మార్చి-2013


గుర్తుండే ఓ కల లాంటి కవిత…

నిన్నటి నుండి మంచు కురుస్తూనే వుంది. యే దిగులూ, ఆర్భాటం లేని ఇంత స్వచ్చత ఎలా అబ్బిందో దీనికి అనుకుంటూనే వున్నా వెన్నెలే కొత్త రంగులో ప్రతిఫలిస్తుంటే . సరిగ్గా అప్పుడే ముకుంద రామారావు గారి ‘మరో మజిలీకి ముందు ‘ నా పుస్తకాల సొరుగులోనుండి బయటకు తీసాను. ‘సమయానికి తగు మాటలాడెనె ‘ అన్న త్యాగరాజ కృతిలా ఈ కవిత దగ్గరే కళ్ళు, మనసు విడిది చేసాయి. కాస్తో కూస్తో ఈ కవితని తర్కించాక ఏదో రహస్యం మనసుని తట్టి లేపుతుంది.

——————————————————————-

మరో మజిలీకి ముందు

అద్దం ముందు ఆకాశమంత అబద్ధం
అద్దాల మధ్య బింబ ప్రతిబింబాల్లో
నిజానిజాల సందేహం


పూర్తిగా »

చంద్రునికొక పూల తావి

22-ఫిబ్రవరి-2013


చంద్రునికొక పూల తావి

చంద్రునికొక పూల తావి
 ———————-
ఆ పాపకు తన స్నేహితురాలెవరో
ఒక రహస్య సందేశాన్నందించినట్టుగా
మిన్నల్ అంటే చందమామ మరియూ పువ్వు అని రాసి అతి జాగ్రత్తగా మడత పెట్టి నెమలి కన్నును ఉంచే చోట కాగితం పుటలలో దాచి ఇచ్చింది.

బడి భారాన్ని భుజాల నుండి పక్కకు నెట్టి
కాసేపు టీవీ చానెళ్ళను టకటకా తిప్పేసి
ఏదో గుర్తుకు వొచ్చిన దానిలాగా తనకు ఆ రోజుటికి వీడ్కోలుగా అందిన ఆ చీటీని ఆత్రంగా బయటకు తీసి
పసి బిడ్డలకు మాత్రమే చేతనయిన ఇంకా వొక పద్ధతికంటూ అలవాటు పడని అక్షరాల పేర్పును కాసేపు తదేకంగా…
పూర్తిగా »

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!

15-ఫిబ్రవరి-2013


ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!

జీవన ప్రస్థానంలో ఏదో ఒక మజిలీ దగ్గర ఆగి వెనక్కి తిరిగిచూసుకుంటే ఎన్నో సంతోషాలు.. ఆవేశాలు.. అవస్థలు.. ప్రేమలూ.. వేదనలూనూ!

అవి అనుభవించేప్పుడు మనఃస్థితి ఎలా ఉన్నా దాటేశాక మాత్రం ప్రతి జ్ఞాపకమో పరిమళాన్ని సంతరించుకుంటుంది. ఆ పరిమళాలే ప్రేరణగా మనల్ని స్పృశించే కవిత ఇది. “స్వప్నం నా ఊత కర్ర.. నిశ్శబ్దం నా గమ్యం..” అని చెప్పుకునే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి అనుభూతి గీతాల సంపుటిలోదీ కవిత. చదువుతున్నంతసేపూ అనుభూతి నించి ఆలోచనకూ.. ఆలోచన నించి అనుభూతికీ సాగే అంతర్లోక భావనా సంద్రమొకటి అద్భుతమైన పదచిత్రాల ద్వారా సాకారమౌతుంది. అప్పట్లో కవిత్వం పేరిట కొందరు ప్రాధాన్యం ఇచ్చే విషయాలకు (ఛందస్సు, ప్రాస) భిన్నంగా…
పూర్తిగా »

పుష్పవిలాపము: నేను చదివానా? నన్ను చదివిందా?

08-ఫిబ్రవరి-2013


పుష్పవిలాపము: నేను చదివానా? నన్ను చదివిందా?

చిన్ననాటి భావాలు చివరిదాకా ఉంటాయి. అన్నీ కాకపోయిన కొన్నైనా.

ఇప్పటికీ ఒక కాలు చెప్పులో ఉంచి మరో కాలు తీయను. తాడిపత్రిలో ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో ఓ కాలికే చెప్పు వేసుకుని నేను గెంతుతుంటే మా పిల్లలదండుకు నాయకురాలైన వాణి “ఒంటికాలికి చెప్పు వేసుకున్నవారిని తేలు కుడుతుం”దని ప్రకటించి భయపెట్టింది. అప్పట్నుంచి గత ముప్పైయేళ్ళుగా అలా వేసుకోకుండా ఉండడం అలవాటైపోయింది.

బాల్యమన్నది అద్భుతమైన భయాలకే కాకుండా అతార్కికాలు, నిర్హేతుకాలైన ఆనందాలకు కూడా ఆటపట్టు.

కాంతారావు నటించిన జానపదచిత్రం చూసివచ్చాక కనబడ్డ ప్రతి చెట్టు తొర్రలోనూ మాంత్రికుని ప్రాణమైన రామచిలుక ఉంటుందేమోనన్న ఊహ గిలిగింతలు పెట్టేది. వేసవి సెలవులప్పుడు ఆదోనిలో ఉండే పెదనాన్న ఇంటికి వెళ్తే,…
పూర్తిగా »

హేమంతపు ఉదయం… రాధిక

ఫిబ్రవరి 2013


హేమంతపు ఉదయం… రాధిక

హేమంతపు ఉదయం…

వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు

ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు

మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య
చలిమంటల వెచ్చదనాలు

ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు

ఎంత పొద్దెక్కినా
సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో.

***

కవిలాగే, ఆధునిక కవిత్వం కూడా ఏ ఇతరేతర ఛాయలూ, వాసనలూ లేకుండా ఒంటరిగా ఉండగలిగే వస్తువు కాదు (Just as the poet himself, modern Poetry is not…
పూర్తిగా »