సంచిక: జనవరి 2013

నిజమే చెబుతున్నా..!

జనవరి 2013 : కవిత్వం


ఎంత వద్దనుకున్నా
ఏంతో కొంత నిశ్శబ్దం
వెంటాడుతూనే ఉంది..
మౌనం తప్ప
మాట్లాడే భాషలేవి లేనపుడు…
ఆత్మ కాక
ఆత్మీయత స్పృశించనపుడు..
వేకువేలేని
చీకటి మూగినపుడు..
గమ్యం లేని
దారుల్లో సాగినపుడు..
కానరాని
మానవతకోసం తపించినపుడు..
ఒక్క పలకరింపుకోసం
పరితాపం..
ఒక్క పరిష్వంగం కోసం
ఆరాటం..
జనారణ్యపు జడత్వంలో
జాడలేని మనిషి కోసం..
జవాబులేని ప్రశ్నగా
నివురుగప్పి నిలుచున్నా..
నిర్లిప్త.. స్థాణువులా…!


పూర్తిగా »

వొకే వొక్క దీర్ఘ కవితలా నువ్వు పుట్టినప్పుడు

జనవరి 2013 : కవిత్వం


An Empty Episode – ఆరో సన్నివేశం:

ఇంత కవిత్వం ఎలా పుట్టుకొస్తుందన్న ప్రశ్న ఇప్పుడేమీ కొత్తకాదు నాకు. కానీ, నా సమాధానాలే నన్నెప్పుడూ చిత్రహింసపెడ్తాయి. నేనొక గాయపడిన పక్షిలాంటి పదచిత్రమై, ఎక్కడో రాలిపడ్తాను. చాలాసార్లు నీముందే రాలిపడాలని అనుకుంటా. కాని, ఆఖరాఖరికి నా కాళ్ళముందే పడివుంటా, సమాధానం దొరికిందా ఇప్పుడయినా అని ప్రశ్నించుకుంటూ!

1
నన్ను రాసే ప్రతివాక్యమూ నేనే అని అనలేను. కొన్ని వాక్యాలు నీ మాటల, నిశ్శబ్దాల కూడికలు.వాటికింద నా సంతకమే వున్నా నేనూ వెళ్ళాల్సిందే నీ జాడలు వెతుక్కుంటూ.

2
నా లోపల్నించి నిష్క్రమించిన నీ ప్రతి కవిత్వ వాక్యం నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది. ఎప్పటి…
పూర్తిగా »

ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం

జనవరి 2013 : ఆనవాలు


ఇసుక మీద సముద్రం గీసిన స్కెచ్- ఈ కవిత్వం

 

1

Jack Kerouac నన్ను వెంటాడే అమెరికన్ కవి. వచన రచయిత.

ఆ పేరు వినగానే అతనంటే వొక్కో సారి కేవలం కవి కాదనిపిస్తుంది నాకు. కవిత్వం రాసినా, వొట్టి వచనమే రాసినా, అతని వాక్యాల కింద వుండే చలనం వొక తాత్విక సారంగా ప్రవహిస్తుంది.

మొదట్లో కొంతకాలం ఆవేశంగా రాస్తాం కవిత్వం. అప్పుడు ఉద్వేగం ఉప్పెనై ముంచెత్తుతుంది. రాయకపోతే వొక రకమయిన వొంటరితనం బాధిస్తుంది. నిజమే! కానీ, ఆ ఆవేశం యెప్పుడో వొకప్పుడు ఆరిపోతుంది. ఆరిపోయిన తరవాత మనలోపలి నిప్పు కణమేదో రాలిపోయినట్టే వుంటుంది. వొక రాయలేనితనం లోపల గుబులు పుట్టిస్తుంది. Kerouac అలాంటి అనుభవాలెన్నో చూశాడు, అనుభవించాడు. అలాంటి సమయంలో…
పూర్తిగా »

దారి తప్పాం

జనవరి 2013 : కవిత్వం


తన తల్లి లోనే అమృత వర్షిణి ని మమతల కోవెలను అనురాగాల ఆలయాన్ని చూసి పక్కింటి అమ్మలో అవేవి చూడలేని ద్రుతరాష్ట్ర సంతతి మనది కాలేజీల్లో చిలిపి పనులేవైనా చేశావా? అమ్మాయిల వెంట పడలేదా? అయితే నీలో లోపం ఏంటి? అని అడిగే కుసంస్కారుల మీడియా మనది కళ్ళు మూసుకున్నాం శరీరం కాలుతుంది దారితప్పాం, తప్పించాం ఫస్ట్ఎయిడ్ కాదు అత్యవసర చికిత్స అవసరమిపుడు
పూర్తిగా »

మిగిలుండాలి!

జనవరి 2013 : కవిత్వం


అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి
ఒక చోటుండాలి ,ఊరుండాలి
కనీసం ఒక మనిషైనా మిగిలుండాలి

మాటలన్నీ పగిలిపోయి ,కరిగిపోయి
అర్ధాలన్నీ చెదిరిపోయి,బెదిరిపోయి
భావాలన్నీ కనుమరుగైపోయినప్పుడు
మాటల్ని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెలవుండాలి

కోర్కెలు అంతరించి ,దేహం ఒట్టి పుల్లైనప్పుడు
ఊహలు అరిగిపోయి మనసు ఉత్తి డొల్లయినప్పుడు
దారులన్నీ మూసుకుపోయి చిమ్మచీకటి మాత్రమె మిగిలినప్పుడు
మళ్ళీ కొత్తగా మొలిచేందుకు
ఒక్క పలకరింపు చినుకైనా మిగిలుండాలి

గతంలోకి ,భవిష్యత్తులోకి లోలకమై వేలాడుతున్న వర్తమానంలో
లుంగీ బనీనును మోస్తున్న ఒకానొక ఆకారంలా కాక
నెలవారీ జీవితమై విసిగి వేసారిపోయే చెల్లింపుల బిల్లుల్లోంచి
అర్ధరహితంగా…
పూర్తిగా »

ఏక్..దో..తీన్..చార్ బందుకరో అత్యాచార్

జనవరి 2013 : కవిత్వం


అడవులు అంతరిస్తున్న కారణంగా
కౄరమృగాలేవో కొన్ని
మానవాకారంలో
మనమధ్యనే మసలుతూ ఉండి ఉండవచ్చు

శిధిలభవంతులు,ఊడలమర్రిలు
మిగలని కారణంగా
భూతాలో దెయ్యాలో నిజంగానే ఉండి
బట్టలు కట్టుకొని మనలోనే తిరుగాడుతూ ఉండవచ్చు
రాతి యుగానికి తాతయుగం నాటి
నరమాంస భక్షకుల డి.ఎన్.ఎ ను
ఏశిలాజం లోనో కనిపెట్టిన
శత్రుదేశపు శాస్త్రవేత్త ఎవడో తిరిగి వారిని సృస్టించి
రహస్యంగా మనమధ్య వదిలివుండవచ్చు
మనం తెలుసుకోలేకపోతున్నాము గాని
మనమధ్యలోనే అమానవులు ఎందరో ఉండి ఉండవచ్చు
బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ కన్నా ప్రమాదకర వ్యాధి
లవ్ ఫ్లూ

పూర్తిగా »

కొన్ని సార్లు

జనవరి 2013 : కవిత్వం


కొన్ని సార్లు మొదలు ఎక్కడ పెట్టాలో వెతుకుతూఉంటా నాలో ఆలోచన నిలువునా చినిగిన స్థానాన్ని కుట్టుకోడానికి లోపలికెళ్ళే దారికి గుమ్మం ఎదురుగానే ఉన్నా కొన్ని సార్లు ప్రశ్నలను పిడికిలిలోనే బంధిస్తూ తిరుగుతుంటా గాయం మౌనం మిళితమై హృదయపు పునాదులను కదిలిస్తున్నా ఉదయం లాంటి నవ్వు నా పిడికిలో అస్తమించడం ఇష్టం లేక రాలిపోతుంటా నాలో అగమ్యాలు రాలి  గమ్యం చిగురించేలా నిశబ్దాలను చీల్చుకుని వసంతపు శబ్ధం  నాలో జనిస్తుందని ఆశగా కొన్ని సార్లు నాలో నేను మళ్ళీ మళ్ళీ పుడుతుంటా అవమానాల్లోంచి విజయంగా నిరుత్సాహంలోంచి లేలేతగా చనిపోయిన ఓటమిలోంచి నన్ను నేను నిర్వచించుకుంటూ కొత్తగా
పూర్తిగా »

మా అమ్మ

జనవరి 2013 : కవిత్వం


మా ఇంట్లో అందరికంటే ముందే
సూరీడు రాక ముందే
చంద్రుడు పోక ముందే
మా ఇంట్లో ఉదయిస్తుంది మా అమ్మ

చిరునవ్వుల కిరణాలతో
పనుల పగ్గాలు చేపట్టి
మా ఇంటి రథాన్ని నడిపిస్తుంది మా అమ్మ

 


పూర్తిగా »

లిఫ్ట్

జనవరి 2013 : కవిత్వం


నాముందు మోకరిల్లి
పైకి చేరాలనో
కిందికి పోవాలనో
ఎవరో ఒకరి
ఎదురు చూపులే

తయారై వచ్చాక
ఎవరికి వారు నమ్మకంతో
నాకు బందీలవుతారు

ఎలా కావాలంటే అలా
తీరికలేకుండా చేరుస్తూనే ఉన్నా
హఠాత్తుగా ఎక్కడో ఆగిపోతే
సరిహద్దుల్లో ఉండని సహనం

ఎవరు నానుండి విడిపిస్తారో
ఎపుడు బయటపడతారో
ఎవరి ప్రయత్నాలు ఏపాటివో

బయటపడ్డాక వెంటనే
నిర్జీవమైన మొహాలు
నిర్లిప్తమైన గుంపులో కలిసిపోతాయి

అయితేనేం
ఎప్పట్లానే మళ్లీ నాముందు
అదే ఆబగా

*
ఏకాంతమది
అడవిలోని చెట్టులా
కొమ్మమీద పూవులా

పూర్తిగా »

చేరన్ కవితలు కొన్ని: అమ్మా, విలపించకు

జనవరి 2013 : కవిత్వం


అమ్మా విలపించకు

నిను ఓదార్చడానికి

పర్వతాలు సరిపోవు

నీ కన్నీళ్లు నింపుకునే

నదులు లేవు

 

నీ భర్త తన భుజం మీదినుంచి

శిశువును నీకందించిన క్షణాన

తుపాకి పేలింది

 

నేలరాలిన నీ తాళిబొట్టు మీద

నెత్తురు చిందింది

 

విస్ఫోటనమైన బాంబు వేడికి

నీ అందమైన కలలన్నీ వాడిపోయాయి

 

నీ మంజీరాలనుంచి జారిపడినవి

ముత్యాలూ కాదు

కెంపులూ కావు

నెత్తుటి నేరాన్ని గుర్తించే

పాండ్య రాజు ఇంకెంత మాత్రమూ లేడు

 

నిద్రలేని రాత్రులలో

నీ బంగారుకొండ అసహనంగా కదలాడి

’అప్పా’ అని గొంతెత్తి ఏడ్చినప్పుడు

ఏం చెపుతావు?

చిన్నారికి చందమామను చూపుతూ

అడుగడుగూ వేస్తున్నప్పుడు

రొమ్ముకు ఆనించుకుని ఊరుకోబెడుతున్నపుడు

’అప్పా…
పూర్తిగా »