కవిత్వం

స్వగతం

01-ఫిబ్రవరి-2013

అర్దరాత్రి
గోడగడియారం
ముల్లు చప్పుడు
నిశ్శబ్దం
గజల్ల సవ్విడిలా
ఇల్లంతా తిరుగుతొంది

నిద్రపట్టని
నా ఆలొచనల స్వరానికి
భాణి జతయింది

సూన్యపు కళ్ళలొ
సూర్యోదయం
మొలకెత్తింది

ముల్లుచప్పుడిప్పుడు
వినిపించదు
బాణి తొపాటు
స్వరాని కలిపిన
పాటకి
గాయకుడ్ని
శ్రొతని నెనే

వూగిసలాడె ముల్లుని
కొరితెచ్చుకున్న వాడ్ని
ముళ్ళకీరిటంగా
గుండె శిరొధారణి అయ్యింది!