ఒక పచ్చటి మర్రి మాను
సేద తీర్చుకుంటున్న
నల్లని,గోధూళి రంగు ఆవులు
నును వెచ్చని కంబళిలా
మర్రి నీడలోకి
చొచ్చుకుపోతున్న ఎండ.
ఇంకొద్ది దూరంలో
శిధిలమైన ఇంటి పక్కన
కొట్టేసిన మర్రి మాను గోడకి
లేలేత ఆకుపచ్చని నీరెండ
తోరణం.
పుడమింటి నీడలా
పునరావృతమయ్యే
గుణానికి ప్రణమిల్లి
సదా పయనించే
కోరికని తీర్చమని
మర్రి మాను
చుట్టూ దారం కట్టి
పచ్చ బూడిద రంగుని
నుదుటనద్దుకుని
గాలి ఊడల వేర్ల పడవలో
నా దారి పట్టాను
(కొత్తిల్లు,రామసముద్రం మండలం,చిత్తూరు జిల్లా,22-12-12),
26-12-12
శిధిలమైన ఇంటి పక్కన
కొట్టేసిన మర్రి మాను గోడకి
లేలేత ఆకుపచ్చని నీరెండ
తోరణం.