కవిత్వం

ఫ్రేం

జనవరి 2013

ఎండప్పుడు
వర్షమప్పుడు
చెట్టు నీడన
తల దాచుకున్నటు
ఆలోచిస్తున్నప్పుడల్లా
మెదడ్లో
మర్రి ఊడలు
మట్టిలోకి చొచ్చుకుపోతాయి
ఆబ్విచ్యురి కాలంకి
నా పోట్రైట్
నేనే వేసుకుంటునట్టు.
శ్వాసాగిన వేళ
నా కళ్ళని
మూసే అరచేతుల్లోకి
నీల పచ్చని సాంబ్రాణి
ధూపమై ప్రవహిస్తా
నా నేలలోని
తపన సుగంధం
ఆమె తనువులో తచ్చాడే
వైతరణిలా
ఇక ఎడబాటు లేని కలయిక
వాటర్ కలర్స్
లాండ్ స్కేప్ పెయింటింగ్ అవుతుంది.