హాల్ లో ఉన్న గోడగడియారం పదిగంటలైన సూచన ఇచ్చింది. అప్పుడే టెలిఫోన్ కూడా గొంతు చించుకోవడం మొదలెట్టింది. ఏవేవో ఆలోచనలలో ఉన్న నేను ఉలిక్కి పడ్డాను. చేయి చాపి రిసీవర్ తీసుకున్నాను.
“హెలో….”
” మిసెస్ ఫ్లెచర్ ? ” రెండవ వైపు నుంచి ఓ అపరిచితుడి స్వరం.
” యస్ మాట్లాడుతున్నాను.”
” నేను వైటన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను .ప్లీజ్ ఓ నిమిషం హాల్డ్ చేయండి. నేనిప్పుడే ….” రెండవ వైపు లైన్ లో నిర్జీవమైన నిశ్శబ్ధం చోటు చేసుకుంది.
నా మనసులో అవ్యక్తమైన భయం పుట్టింది . గుండె లో గుబులు మొదలైంది. ఈ సమయంలో ఓ పోలీస్ స్టేషనుంచి ఫోనొచ్చిందంటే కారణమేమై ఉంటుంది. ఒకే కారణం స్ఫురిస్తూంది . యాక్సిడెంట్! ఓమైగాడ్!! మేలర్ కు యాక్సిడెంట్ అయిందా? ఆ దుర్ఘటనలో మరణించాడా? ఓ ….. నో….నో… ఇది నిజం కాదు. తప్పుడు సమాచారం. ఇలా కాకూడదు. నా బుర్ర పని చెయ్యట్లేడు. శరీరం చెమటలతోతడిసిపోయింది. వెన్నెముక లో భయం విద్యుత్తులా ప్రవహించింది. నిర్జీవమైన చేతుల్లో రిసీవర్ పట్టుకోని రాబోయే విపత్తు గురించి ఆలోచిస్తూ వణకసాగాను.
ఈ రోజుదయం మేలర్ మహ కోపంతో ఇంట్లోంచి వెళ్ళాడు. కళ్లలో నుంచి నిప్పురవ్వలు రాలుస్తూ, పెద్దగా చప్పుడు చేస్తూ గట్టిగా తలుపు మూసి వెళ్ళాడు. తర్వాత పోర్టికోలో నుంచి అతడు ఏ విధంగాకోపంతో కారును రివర్స్ గేర్ లో తీశాడో… ఆ శబ్దాన్ని వింటే అతని మనుసు ఎంత కకవికాలమైందో అర్ధమవుతుంది. టైర్ల కీచు శబ్ధం తారురోడ్డును చీల్చుతూ, ఓ మలుపు తీసుకోని వేగంగా పారుతున్న ట్రాఫిక్ లోజొరబడి, ప్రవాహంలోపడి అగమ్యం వైపు కు కొట్టుకుపొతున్నాడా అనిపించింది నాకు. ఇదంతా నా కళ్ళారా కి టికీ లోనుంచి చూడసాగాను. ఆ సమయంలో మా ఇద్దరి కళ్ళు ఒకసారి కూడా కలుసుకోలేదు.
అతడి ఓవర్ స్పీడే అతని ప్రాణాలు తీసి ఉంటుంది. అందుకే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్… నా మతిమండి పోను… అతడి స్నేహితుల కోసం భోజనం తయారు చెయ్యమన్నప్పుడు నేను బిజీగా ఉన్నాననేవంకతో నిరాకరించకపోతే అతడికి కోపం వచ్చేది కాదు, ఈ దుర్ఘటన జరిగేది కాదు.
ఇది మా మొదటి జగడం కాదు. చిన్న చిన్న విషయాల పై వాదులాటలు జరుగుతూనే ఉంటాయి. ఇలా మా పాప పుట్టినప్పట్నుంచి మొదలైంది. జెని పుట్టక ముందు మన ప్రేమలో ఏలాంటి లోపమురాదని నమ్మించే దాన్ని. కాని జెని పుట్టాక నా వాగ్దానాలు బూడిదలో పూసిన పన్నీరులా అయ్యాయి. నా సమయమంతా ఆమెకే కేటాయించాను. నా శ్రద్దంతా జెని వైపుకే వెళ్ళేది. ఆమె బాగోగులు చూడటం లోనేరేయింబగళ్ళు గడిచిపోయేవి. చూడటానికి చాలా ముద్దుగా బోసి నవ్వులతో చూడముచ్చటగా, ఉన్న మాస్వీట్ బేబిగర్ల్ నాగుండెలయలా ఉంది. ఓ క్షణం కూడా ఆమెను వదలి ఉండలేను. అంచేత మేలర్, నేనూరాత్రిభోజనం మాత్రమే కలసి చేసేవాళ్ళం. మేలర్ తో సరిగా మాట్లాడే తీరిక కూడా ఉండేది కాదు. జెని పై నా ఆసక్తి అతన్ని నాకు దూరం చేయసాగింది. అతడికి తగిన సమయం ఇవ్వలేకపోయాను. పాప మీద ప్రేమనన్ను పిచ్చి దాన్ని చేసింది. ఆమె ఏడుపుకు నేను అదిరిపోయేదానిని. నా గుండెలకు హత్తుకొని సముదాయించే దానిని. ఇలాంటి గారాబం చేయడం వల్లనే మేలరుకు దూరమవుతు ఉన్నాను. రిసీవర్ పై పట్టువల్లనా చేతి వ్రేళ్ళు తెల్ల బడ్డాయి. ఈ వ్యక్తి నన్ను లైన్ లో పెట్టి ఎటు మాయమై పోయాడో దేవుడెరుగు ! ఈ కొన్ని క్షణాలు కొన్ని యుగాల్లా ఉన్నాయి నాకు !
నా ధ్యాస మేలర్ అమ్మ వైపు, మా అత్తగారి వైపు కెళ్ళింది. తన కొడుకు మరణ వార్త వినగలిగే ధైర్యం ఆమెకుందా! ఆది కూడా ఏకైక పుత్రరత్నం మరణ వార్త! ఆమె ఈ వార్తను భరించలేకపోతుంది. నేనంటేనే ఆమెకసలు ఇష్టం లేదు. పైగా తన కొడుకు మరణానికి కారణం నేనే అనుకుంటుంది. జెని పుట్టాక ఆమె దగ్గర నా అర్హత, ప్రేమ, వాత్సల్యం, గౌరవం కోల్పోయాను. నేనెప్పుడూ ఆమె ఇంటికి జెనిని నాతోతీసుకవెళ్ళలేదు. పాపని ఇంటిలోనే వదిలేసి మేలర్ తో వెళ్ళేదానిని. వృద్దురాలి రోగం జెనికి తగుల్తుందేమోననే భయం. నా అత్తగారు రోగాల పుట్ట. ఆమెకు లేని రోగం అంటూ లేదు.
“మనం ఈ సారి జెనిని వెంట తీసుకెళదాం అమ్మ దగ్గరికి. మనమరాలిని చూడలేదని ఆమె చాలా బాధపడుతుంది. అమ్మ ద్వారా జెనికి ఏలాంటి రోగం తగలదు. ఇదంతా నీ భ్రమ. రోగాలు వృద్దాప్యానికీసూచన మాత్రమే, అవి అంటు రోగాలు కావు !” అని క్రితం వారం మేలర్ నాకు నచ్చజెప్పాడు.
కానీ నేను ఒప్పుకోలేదు. దీని వల్ల కూడా మేలర్ నాపై కోపంగా ఉన్నాడు. కాని నాకు గత్యంతరంలేదు. జెనిని అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు మనసొప్పలేదు.
పెంళ్ళయిన మా మొదటి సంవత్సరం హాయిగా, ఆనందంగా గడిచింది. మాపాప మా ఇద్దర్ని మరీ దగ్గరిగా చేస్తుందనుకున్నాను. కాని జెని మా ఇద్దరి మధ్య ఓ పెద్ద అగాధంలా మారింది. మా భార్య భర్తలమ ధ్య అడ్డు గోడగా తయారైంది. నాకు పిల్లలంటే చాలా ఇష్టంగా ఉండేది. కాని ఇప్పుడది మూర్ఖత్వంలా అనిపిస్తుంది. మొదట్లో నేనే మేలర్ ను వాళ్ళ అమ్మ నుంచి విడదీసి వేరుగా కాపురం పెట్టాను. నా ప్రేమలోపడి ఒప్పుకొన్నాడు.
కాని జెని రాకతో నా ప్రమాణాలు నీటి మూటలే అయ్యాయి. నా ఆసక్తి అంతా ఆమె వైపే. మేలర్ మీద నేను చూపిన ఆశ్రద్ద ఏలాంటిదో నాకిప్పుడు అర్ధం అవుతుంది. కాని ఇప్పుడు లాభం ఏమిటి? చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్లయింది.
లోపలి గదిలో నుంచి వినిపిస్తున్న జెని ఏడుపు నన్ను కుదిపింది. ప్రస్తుతం నా ఆలోచనలు, హాస్పిటల్ శవదహన క్రియల వైపు సుడిగుండం లా తిరిగసాగాయి. జెని ఏడుపు స్థాయి పెరిగింది. కాని దాన్నినేను పట్టించుకోకుండా మరోసారి ఆలోచనల సముద్రంలో మునిగి తేలుతున్నాను. ఇప్పుడు నేను అతని తల్లి ముందు అపరాధిగా నిలబడి ఉన్నాను. అతడు లేకుంటే నేనెవరిపై ఆధారపడి బ్రతకాలి ! ఇంటినిఅమ్మేసి లేదా ఉద్యోగం చేసి మిగతా జీవి తాన్ని గడపాల్సుంటుంది. ఇలాంటి స్థితిలో జెని గురించి ఎవరు పట్టించు కొంటారు ? జెని… నా ప్రాణం. నేను అపాదమస్తకం కంపించి పోయాను.
ఓ గాడ్ ! నేనెక్కడ చిక్కుకున్నాను ! ఈ వ్యక్తి ఎక్కడ చచ్చి పోయాడు… లైన్ లో ఉండమన్నాడు… నేను కోపంతో ఊగుతూ రిసీవర్ నా రెండవ చేతికి కొట్టుకొంటు… నే..ను ఎప్పుడు కూడా మేలర్ తో గొడవపడను అతని పట్ల అశ్రద్ద చేయను. దేవుడు అతడిని సురక్షితంగా ఉంచుగాక. భగవంతుడా నాకు సహాయపడు అని మనసులో బడబడలాడసాగాను.
రెండవ వైపు రిసీవర్ లో కటకట శబ్ధం వినబడగానే నాగుండె వేగం పెరిగిపోయింది. భయంకరమైన విషాద వార్తను అందుకోడానికి నన్ను నేను సంబాళించుకోన్నాను. రెండవ వైపు రిపీవర్ లో నుంచి ఆ వ్యక్తిగొంతు వినిపించింది.
“వెరీ సారి మిసెస్ ఫ్లేచర్… మీకు కష్టం కలిగించినందుకు కాని…. “మరో సారి గాఢమైన నిశ్సబ్దం అలుముకుంది!? ఆ వ్యక్తి మొహన్ని నా చేతి గోళ్లతో పిచ్చిపిచ్చిగా గీకాలనిపించింది. నాకెందుకిలాఎదురుచూసేలా చేస్తున్నాడు ? ఎదురు చూస్తున్న క్షణాలు నా ఆదీనం లో నుం చి తప్పి పోతున్నాయి.
హమ్మయ్య ! చిట్ట చివరికి అవతలి వైపు నుంచి సమాచారం అందింది, ” చూడండి మిసెస్ ఫ్లేచర్ ! బహుశ మీకు గుర్తే ఉంటుంది… మూడు నెలల క్రితం మీకో బంగారపు ఉంగరం దొరికింది, దానిని మాకందజేశారు. దీని గురించి హక్కు దారులెవరు కూడా ఏలాంటి రిపోర్టు ఇవ్వలేదు. ఇది తమదేనని ఎవరు చెప్పలేదు కాబట్టి న్యాయపరంగా మీరే ఈ ఉంగరానికి హక్కుదారులు. మీరు దీన్ని మా పోలీసు స్టేషన్ కొచ్చి తీసుకోగలరు.ఓ. కె గుడ్ బై !“ అంటు రిసీవర్ పెట్టేశాడు.
గట్టిగా ఓ శ్వాస పీల్చాను. రిసీవర్ చేతిలో నుంచి క్రింద పడి పెండ్యులమ్ లా ప్రేలాడసాగింది. కాళ్ళు చేతుల్లో సత్తువ లేక ప్రక్కనే ఉన్న సోఫాసెట్ లో కూలబడ్డాను. కొన్ని వందల మైళ్ళ దూరం నుంచిపరుగెత్తుకొంటూ వచ్చినట్టనిపించింది. చూపు నా చేతిగడియారం వైపు పడింది. నా నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది. గడియారం పది గంటల ఒక్క నిమిషం చూపుతుంది. అంటే ఈ ఫోన్ కాల్ ఒక్క నిమిషందా ? ఈఆటంతా ఓ నిమిషంలో ముగిసింది. కాని ఈ నిమిషం నాకు ఓ యుగం కంటె పెద్దగా అనిపించింది.
మరోసారి తృప్తిగా ఊపిరి తీసుకొన్నాను. జెని అరుపులు, ఏడుపులు నా చెవుల్లో మోగసాగాయి. సోఫాలో నుంచి తటాలున లేచి జెని ఏడుస్తున్న గది వైపు బయల్దేరాను. కాని కొన్ని అడుగులు ముందుకువేశానో లేదో ఏదో అవ్యక్తమైన శక్తి నన్ను ముందుకు కదలనీయలేదు.
గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “…. నో డియర్… నేనింకా చాలా అత్యవసరమైన పనులు చేయాల్సున్నాయి….నువ్వింకాస్తా ఏడ్వడమే మంచిది !” అని నాలో నేనే చెప్పుకున్నాను.
నేను మారిపోయాను !
నా హృదయం ఆనందం తో నాట్యం చేస్తుంది. ఇల్లంతా తిరిగి, పరుగెత్తుతు చిన్న పిల్లలా సంతోషంతో గట్టిగా కేరింతలు పెట్టాలని మనసు తహతహలాడసాగింది.
నేను సంతృప్తిగా తలాడించి, గొంతెత్తి అన్నాను, ” మీ నాన్నగారికి ఫోన్ చేయబోతున్నాను. అతడు వాళ్లమ్మ దగ్గరే ఉండి ఉంటాడు. అతనితో చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి. ఇంకో నిముషం కూడా ఆగలేను.”
సంతోషంగా టెలిఫోన్ సెట్ వైపు వెళ్ళసాగాను మేలర్ కు ఈ విషయం చెప్పి తేలిక పడటానికి.
**** (*) ****
మూలం: English: ONE MINUTE OF ETERNITY (Anonymous)
అనువాదం: అమ్జద్
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్