‘ అమ్జద్ ’ రచనలు

ఆ ఒక్క నిమిషం

జనవరి 2017


ఆ ఒక్క నిమిషం

హాల్ లో ఉన్న గోడగడియారం పదిగంటలైన సూచన ఇచ్చింది. అప్పుడే టెలిఫోన్ కూడా గొంతు చించుకోవడం మొదలెట్టింది. ఏవేవో ఆలోచనలలో ఉన్న నేను ఉలిక్కి పడ్డాను.  చేయి చాపి రిసీవర్ తీసుకున్నాను.

“హెలో….”

” మిసెస్ ఫ్లెచర్ ? ” రెండవ వైపు నుంచి ఓ అపరిచితుడి స్వరం.

” యస్ మాట్లాడుతున్నాను.”

” నేను వైటన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను .ప్లీజ్ ఓ నిమిషం హాల్డ్ చేయండి. నేనిప్పుడే ….”  రెండవ వైపు లైన్ లో నిర్జీవమైన నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

నా మనసులో అవ్యక్తమైన భయం పుట్టింది . గుండె లో గుబులు మొదలైంది. ఈ సమయంలో…
పూర్తిగా »

సెకండ్ హ్యండ్

నవంబర్ 2016


“వద్దురా, అల్లా! నాకు సిగ్గుగా ఉంది?”

“అయ్యో గిందులో సిగ్గేంటే, నేను ఇప్పుకో లేదా నా బట్టల్ని?”

“ఉయ్!” సిగ్గు పడింది చమ్కి.

“ఇప్పుతావా లేదా? అనాబికి చెప్పనా?” శహజాది పాషా గట్టిగా అరిచి౦ది. . ఆమెకు నరనరానా ఆజ్ఞాపించే అలవాటుంది.

చమ్కి కొద్దిగా తడబడుతూ, మరికొద్దిగా సిగ్గు పడుతూ, తన చిన్నారి చేతులతో మొదట కుర్తా విప్పింది. తర్వత పైజామా . ఆ తర్వాత శహజాది ఆజ్ఞ ప్రకారం సబ్బు నురుగలతో నిండిన నీటి టబ్బులో ఆమెతో పాటు దిగి౦ది.

ఇద్దరు స్నానించాక , చిన్నగా నవ్వుతూ “ఇంగ చెప్పు. నువ్వు ఏం బట్టలు తొడుక్కు౦టావు ? “శహజాది పాషా గొంతులో పొగరు, అధికారం.పూర్తిగా »

జాహెద

జూలై 2016


జాహెద

జావెద్ నా ప్రాణ స్నేహితుడు. మా మధ్య ఏలాంటి దాపరికాలు లేవు. ఇద్దరం గంటల తరబడి పిచ్చాపాటి మాట్లడుకునేవాళ్లం. అతడికి దగ్గరి బంధువులతో పడేది కాదు. కొన్నాళ్ళనుంచి గంటల తరబడి ఏకాంతంగా ఉండేవాడు. పలకరిస్తేనే మాట్లాడేవాడు కాదు. వాడిలో ఉన్న చలాకితనం మాయమవుతున్నట్లు గ్రహించి, ఓ రోజు ” ఏంట్రా…ఏమిటి సంగతి? ఆకాశం లో ఏముందని అలా గంటల తరబడి చూస్తుంటావు?  ఇలాగే ఉంటే ఓ రోజు పిచ్చివాడివైపోగలవు” అని అన్నాను.

గట్టిగా ఓ నిట్టూర్పు విడిచి, “ అలాగే అనుకో…!?” అని జవాబు ఇచ్చాడు.

“ఫర్ ద గాడ్ సేక్ జావెద్ అసలు సంగతేమిటో చెప్పు. నా దగ్గర నీకు సీక్రేట్స్ ఏమి లేవుగా…” ప్రాధేయపడ్డాను వాడి అవస్థ…
పూర్తిగా »

కుటుంబ గౌరవం!?

మే 2016


కుటుంబ గౌరవం!?

"ఒరై అబ్దుల్! ఈ సమయానికి నువ్విక్కడా! నీక్కూడా నిద్ర రావట్లేదా?"
"మీరు టెర్రెస్ పై పచార్లు చేస్తూంటే నా గదిలోంచి చూసి వచ్చాను. మీకేమైనా...?"
"సరే. రా ఇలా కూర్చో..."
"నేనా...హి...హి..."
"పర్లేదు. నాకు బోర్ కొట్టుతూంది. నీతో బాతాఖానీలు కొట్టైన నా బోర్ను దూరం చేద్దామనుకొంటున్నాను"
“అలాగేనండీ!”
"అరే...రే ...నేల పై కూర్చుటున్నావెందుకు?"
"మరే...మేడం గారు?" "ఇక్కడ ఈ కుర్చీ మీద కూర్చో." "సారు చూస్తే...?" "భయపడకు. మీ సారు లేచేది తెల్లారకనే" "సరే. మీరు కూర్చోమంటే కుర్చుంటాను." "ఊరుకున్నావేమిటి? ఏదైన మాట్లడవయ్యా." "ఏం మాట్లాడనండి?"
పూర్తిగా »

గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ

మే 2015


గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ

అదేమి కాకతాళీయమో గాని నేను గళ్ళ లుంగీ వేసుకుని మా డాబా మీద పచార్లు చేస్తున్నప్పుడల్లా మా ఎదురింటి ఆవిడ గళ్ళ మేక్సీ వేసుకుని తన డాబా మీద తిరుగుతుంటుంది. చూసేవాళ్ళు తను పిచ్చిగా తిరుగుతుందని అనుకోకూడదని కొన్నిసార్లు బట్టలు ఆరేయడం కోసం, కొన్ని సార్లు బట్టలను తీసుకోవడం కోసం, మరికొన్ని సార్లేమో చీపురును ఇవ్వడం కోసం అన్నట్టు పనిమనిషిని వెంట తీసుకుని పైకి రావడం, వచ్చినప్పుడు నన్ను కన్నార్పకుండా చూడడం చేస్తుందని మా ఆవిడ దగ్గర చెప్పుకోవడానికి దమ్ముల్లేక నేను లోలోన సంతోషించిన సందర్భాలెన్నో ఉన్నాయి! అయినా భార్య దగ్గర ఇలాంటి విషయాలు చెప్పడం మర్యాదగా ఉంటుందా అని మనసులోనే అనుకునే వాడిని.…
పూర్తిగా »

సలహా!

ఏప్రిల్ 2015


సలహా!

అదురుతున్న తన పైపెదవిని పండ్ల మధ్య అదిమి పట్టుకుంది చంప. హృదయపు లోతుల్లోంచి అవ్యక్తమైన దుఃఖం పొంగుకొస్తుంటే ఆమె దాన్ని అణచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఓ బాధ ఆమె నరనరాల్లో ప్రాకసాగింది. ఆ వేదనకు కారణం సొంత జీవితం గురించి తను చేస్తున్న నిశితమైన దీర్ఘాలోచన కావచ్చుననుకుంది ఆమె. సమాజంలో తన స్థానమేమిటి? ఒంటరితనమే తనకు తోడయిందెందుకు? ఇలాంటి ఆలోచనలతో ఆమె మెదడు వేడెక్కింది.

తను మొదట్నుంచి బ్రాహ్మణులూ నిమ్నకులాల వాళ్ళూ జీవించే వాడకు దగ్గర్లోనే, తక్కువ జాతికి చెందిన బీదవాళ్ళుండే బస్తీలోనే ఉంటోంది. ఈ బస్తీలోని ఆడవాళ్ళు ఒకప్పుడు వేశ్యలుగా ఎంచబడేవాళ్ళు. కాని వాళ్ళు ఆ వృత్తిని విడిచి ఎన్నో ఏళ్ళైంది.…
పూర్తిగా »