కవిత్వం

ఫాంటు మార్చు

ఫిబ్రవరి 2018

స్మాల్ కాబిన్లో దూరి
కాపురాన్ని వాల్ పేపర్గ అతికించినం.
స్మార్ట్ ఫోన్ నిండా ముచ్చట్ల రేసుల్ని,
స్టైల్ స్టిల్స్లని అన్లిమిటెడ్ మెమొరీలో భద్రపరిచినం.
ఆత్మీయమొలకని కామెంట్ల ఫర్ఫ్యూమ్ తొట్టిలో
పూలు పూయని బోన్సాయి మొక్కలమైనం.
సిస్టం 24 /7 ఆన్ లోనే వుంచి,
డిజైనింగ్ షైనింగ్లో బిజీ అని పెడుతూ,
వీకెండ్ స్వప్నాల్ని ఫార్వార్డ్ చేసికున్నం.
ఫ్రెండ్సో, అన్ఫ్రెండ్సో
బోలెడు జాబితా సిద్ధం చేసి,
షార్ట్ లిస్టులో ప్రకటించినం.
బాయినీళ్లు, బర్రెపాలు
ఇప్పటి తరానికి పరిచయం చేయడం అపి,
కోక్ షోక్తో బతుకు దాహాన్ని మింగేసినం.
బంధాలు బంధుత్వాలు లాక్ చేసి లాకర్లో పెట్టినం.
వావి వరసల పేర్లకు బదులు
నిక్నేమ్లతో ఆధునికత హుక్ లకు
చూయింగ్గమ్లా వేలాడినం.
పిల్లల్ని ముద్దు చేస్తూ
వాళ్ళ కలల్ని మనమే కంటూ
పరుగు పందాలను స్పూన్ ఫీడింగ్ చేసినం,
వాల్యూస్ ఆడెడ్లైఫ్ని బార్డర్ దాటించినం,
వానప్రస్తంలో ప్రవేశించినం.

గేటు ముందు వాచ్డాగ్
గేట్ లోపల బెంజ్ కారు
ఇంద్రప్రస్థలో ఇరువురం

బయట కుక్క అరుస్తున్నది
‘ఎవరు లోనికి రాకూడదు’ అని…