చిమ్మ చీకటిలో
పిల్లిని చూపిస్తూ
పిల్ల ఎలుకతో
తల్లి ఎలుక ఇలా అంటోంది:
“జాగ్రత్తగా వినుకో!
వాడికి తిరుగులేని నిశిత దృష్టి ఉంది.
వాడు నిన్నేక్షణాన్నైనా కనిపెట్టగలడు.
వాడికి ఏస్థాయిలోని శబ్దమైనా వినగల చెవులున్నాయి.
ఒక వెంట్రుక కిందపడితే
దాని శబ్దాన్ని బట్టి
ఎవరిదో పోల్చగలడు.
వాడు సాధుత్వానికి పరాకాష్ఠ
వాడు నిన్ను చాలా తెలివిగా మన్నిస్తూనే
వెల్లకిలా చెయ్యగలడు.
సహనానికి మారుపేరు వాడు
కనీసం ఒక నాలుగైదు గంటలు
పరిశీలించగలడు, నిన్నంచనావేసి
నీ తోక చివర పట్టుకుని
నిన్ను గుంజడానికి
వాడి దయాగుణానికి సాటి లేదు.
నిన్నెప్పుడూ చచ్చేలా కొట్టడు.
నిన్నెప్పుడూ నిరాశపరచడు కూడా
చచ్చినంతకలగాసినా,
ఎన్నో సార్లు విడిచిపెట్టెస్తాడుకూడా
అతడొక అనుపమానమైన రసవేది
నీ తోక చివరి ప్రకంపనవరకు
గమనించి ఆశ్వాదించగలడు.
అతడికి ఏమాత్రం తొందరలేదు.
ఎందుకంటే
కాలం అతని అధీనం.
***
మూలం: కాల్పెట్ట నారాయణన్ (మలయాళం)
ఆంగ్లానువాదం: రాహుల్ కొచ్చుపరంబిల్ (English title: Lord of the Time)
తెలుగు అనువాదం: నౌడూరి మూర్తి
***
ఇందులో పిల్లి ఒక ప్రతీక మాత్రమే. అది మృత్యువుకి ప్రతీక. మనం అందరం పిల్లఎలుకలం. కవి తల్లి ఎలుక. ఇలా ఆలోచించి చూచినపుడు ఈ కవితలోని సౌందర్యం మనకి అవగాహన అవుతుంది.
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్