For last year’s words belong to last year’s language
And next year’s words await another voice. (T.S. Eliot).
1
వెళ్లిపోతున్నప్పుడు
తనేమీ చెప్పలేదు
‘సరే, ఇక వుంటాన్లే’ అని కూడా!
2
ఎన్ని సార్లు అలా వచ్చి
ఇలా వెళ్లిపోలేదని!
వచ్చిన ప్రతిసారీ అనుకున్నానా
అలాగే ఇక్కడే వుంటావని!
వెళ్ళిన ప్రతిసారీ అనుకున్నానా
ఇలాగే ఎక్కడికో వెళ్లిపోతావని!
3
ఆశ్చర్యం కాని క్షణం
వొక్కటంటే వొక్కటి
వుందా చెప్పు!
ప్రతీ క్షణం సతమతమే
ఇంకో కొత్త క్షణాన్ని
అర్థం చేసుకోడానికి!
లేదంటే సొంతం చేసుకోడానికి!
4
ఈ వొక్క క్షణం దాటేశానా,
ప్రతి దిగులూ
కొండ దిగి వెళ్లిపోతుందిలే, ఎటో!
“ఆశ్చర్యం కాని క్షణం
వొక్కటంటే వొక్కటి
వుందా చెప్పు!
ప్రతీ క్షణం సతమతమే
ఇంకో కొత్త క్షణాన్ని”…. nijame kadhaa .. baagundi sir ..kaani ee samvathsaram alaanti paristhithulu eduravaddani korukuntoo .. I wish you happy new year
సర్, ఉండపొతె పాతబడిపొతుంది కదా.. అందుకె కొత్త్తగా తిరిగి వస్తుంది, ప్రతిక్షణం మనముందుకు.(వసంతమై)
bagundi afsarji
అవును, ఈ ఒక్కరోజు దాటేసామా,.ఆనందం కూడా వెళ్లిపోతుంది కదా,.అలాగే,..కొత్త సంవత్సర శుభాకాంక్షలు సార్,…
“ఎన్ని సార్లు అలా వచ్చి
ఇలా వెళ్లిపోలేదని!
వచ్చిన ప్రతిసారీ అనుకున్నానా
అలాగే ఇక్కడే వుంటావని!”
పగిలిన ప్రతి క్షణం కొత్త కూజితాలను లాక్కొస్తుంది
రాబోయే ప్రతి క్షణం మధురభావాల అలరిస్తుంది
దిగులు కొండలు దాటిన క్షణాలు
లెక్కెట్టుకోలేదు..ఎక్కిళ్ళొస్తాయని
చిత్రమేంటంటే మిగిలున్న క్షణాలూ
గుప్పిటపట్టలేదు …జారిపోతాయేమోనని…
అఫ్సర్ సర్…మీరెప్పుడూ నాకు కొత్తగానే పరిచయమౌతూంటారు అక్షరాల్లో….నైస్ సర్…