ఎంతో కొంత దూరం నడిచాక నీ నీడతో మాత్రమే తలపడే వొంటరితనాన్ని సాధించుకున్నాక నిన్ను నువ్వు తప్ప ఇంకెవరూ వేధించలేని సాధించలేని బాధించలేని నొప్పించలేని అనేక లేనితనాల పతాకాలు దారిపొడవునా నువ్వు పాతుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు
జీవితం నిన్ను కాసేపు ఆపితే ఆగిపో.
ఆగిపోవడం తప్పేమీ కాదు, ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం!
2
వెనక్కి చూస్తావ్ నువ్వు చూస్తూ వుండు చూస్తూ చూస్తూ వెనక్కి వెళ్ళినా వెళ్ళు. జీవితం నిన్ను వెనక్కి పంపాలనే అనుకుంటే వెనక్కే వెళ్లి రా. కాస్త ప్రేమగానే వెళ్ళు. మనసు తలపులన్నీ ఎంచక్కా తెరుచుకుంటూనే వెళ్ళు. ఎవరన్నారు వెనక్కి వేసే ఆ అడుగులు వెనక్కే అని!
ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో, అంత తపనగా మళ్ళీ ఆ అడుగులన్నీ జీవితం నించి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!
3
ఇవాళ ఈ చిన్ని పాదాల్లోకి వలస వెళ్లి వచ్చాను. తొలినడకల్లో మరచిపోయిన నా పాఠాలన్నీ మళ్ళీ వల్లెవేసుకున్నాను. ఆ తడబడు అడుగుల లేత అందాలన్నీ వొక వూహలో వొంపుకున్నాను.
4
అవున్రా, ఇవాళ నా అడుగులు నాకు దొరికాయి.
నీకు చెప్పాలని పరిగెత్తుకు వచ్చానా, నువ్వెక్కడో అందనంత దూరంలో వున్నావ్!
5
నీ దూరంలోకి నేనూ
నా దగ్గిరలోకి నువ్వూ వచ్చి
వొక అడుగు అవుతామా ఎప్పుడైనా?!
ఆ చిన్ని పాదాల తడబాటులోకి వెళ్లి వస్తామా ఎప్పుడైనా?!
(మొదటి ముద్రణ: 13వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)
” జీవితం నిన్ను కాసేపు ఆపితే ఆగిపో
ఆగిపోవటం తప్పేమీ కాదు , ఎవరో విధించిన శిక్ష కూడా కాదు
కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం ”
అపురూపమైన వాక్యాలు . అవును, అడిగితే వెనక్కి ఇస్తుంది జీవితం. అడగాలనేదే తెలియవలసినది .
“ఎంత నిదానంగా వెనకడుగులు వేసావో, అంత తపనగా మళ్ళీ ఆ అడుగులన్నీ జీవితం నించి అడిగి అడిగి తెచ్చుకుంటావ్ నువ్వే!”
” జీవితం నిన్ను కాసేపు ఆపితే ఆగిపో, ఆగిపోవటం తప్పేమీ కాదు , ఎవరో విధించిన శిక్ష కూడా కాదు, కాసేపు నిన్ను ఆపాలని ఎందుకనుకుందో జీవితం ”
Beautiful lines…..
eppaTlA andamaina kavita Afsar jI.
మైథిలి గారూ, ఇంకా తెలియదు ఎలా అడగాలో?!
@మోహనతులసి, కవిత ఆ Beautiful lines… లోంచే మొదలైందేమో!
@ప్రసూన, ఎప్పట్లా మీ వ్యాఖ్య సంతోషం!
ఇప్పటి బతుకులో ఏదో కోల్పోయిన తనం వల్లనే అనుకుంటాను , బాల్య స్మృతి మాధుర్యాన్ని ఎంత అందంగా చెప్పారో
జీవితాన్ని జలపాతంలా ఆవిష్కరించడం మీకు మాత్రమె తెలిసిన విద్య సార్..