కవిత్వం

స్వరకర్త… WH ఆడెన్

జనవరి 2013

ఇతర కళాకారులంతా అనువాదకులే;
చిత్రకారుడు కనిపిస్తున్న ప్రకృతిని గీస్తాడు, మెచ్చినా, మరచినా;
తనజీవితాన్ని శోధించి శోధించి కవి బయటకి తీస్తాడు ప్రతీకల్ని,
మనసుని కలచి, అనుభూతి పంచుకుందికి.
“జీవితం నుండి కళ” ఒక బాధామయమైన రూపాంతరీకరణ
మధ్య అగాధాన్ని మనమేదో పూడ్చగలిగినట్టు ఆధారపడుతూ;
ఒక్క నీ స్వరాలే స్వచ్ఛమైన కల్పనలు
ఒక్క నీ గీతమే పరిపూర్ణమైన బహుమతి!
.
ఓ చెవులపండువా! జలపాతంలా సాక్షాత్కరించు!
ఈ స్తబ్ధ వాతావరణాన్నీ, మా సందేహాల్నీ ఛేదిస్తూ,
వంగుతున్న నడుముల్నీ, వాలుతున్న మోకాళ్ళనీ లేవనెత్తు.
ఓ నిరాకార గీతమా! ఒక్కతెవే, ఒక్క నువ్వొకతెవే,
కేవల అస్తిత్వం అపరాధం కాదని చెప్పలేకున్నావు
నీ క్షమాబిక్షని అమృతం లా మాపై ప్రవహించనీ!

English Original: The Composer by WH Auden.