‘ డా. సీతారామయ్య (రామసూరి) ’ రచనలు

కృష్ణశాస్త్రి జీవితం – సాంస్కృతిక నేపథ్యం

కృష్ణశాస్త్రి జీవితం  – సాంస్కృతిక నేపథ్యం

భావకవిత్వాన్ని ఉద్యమంగా తీర్చిదిద్దిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిగారు 1-11-1897 న కార్తీక శుద్ధ అష్టమినాడు పిఠాపురం దగ్గర చంద్రంపాలెంలో జన్మించారు. తండ్రి దేవులపల్లి వేంకటశాస్త్రి అనే తమ్మన్నశాస్త్రిగారు. పెదతండ్రి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. దేవులపల్లి సోదరకవులుగా ప్రసిద్ధులైన వీరి పూర్వీకులు కృష్ణాజిల్లా ఆగిరిపల్లికి చెందినవారు.
పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి సాహిత్య జీవితం సౌందర్యాన్వేషణే. షెల్లీ, కీట్స్, టాగూర్ కృష్ణశాస్త్రికి బాటలు వేసినవారు. అందరూ సౌందర్యాన్ని అన్వేషించినవారే. ఆరాధించినవారే. కవిత్వమూ, కళలూ మనిషికి సౌందర్య పిపాస కలిగిస్తాయి. మనిషిని పరిపూర్ణ మానవుణ్ణి చేస్తాయి.
కృష్ణశాస్త్రి ఆదర్శ సౌందర్యం ఊర్వశి. భారతీయ సాహిత్యంలో ఊర్వశికి ప్రత్యేక స్థానం ఉంది. కాళిదాస మాహాకవి స్వర్గానికీ మానవ లోకానికీ ముడిపెడుతూ ప్రేమ, సౌందర్యాలు మనిషికి అవసరమని చెప్పాడు.
పూర్తిగా »

కృష్ణశాస్త్రి – సినీ సాహిత్యం

కృష్ణశాస్త్రి – సినీ సాహిత్యం

తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం తెచ్చిన రచయితలలో కృష్ణశాస్త్రిగారు ప్రసిద్ధులు. మల్లీశ్వరి సినిమాకి మాటలు-పాటలు రాయటంతో ఆయన తెలుగు సాహిత్యంలో చలనచిత్ర గీతాలకి ప్రత్యేకతని సంతరించారు. ఆయన వెలువరించిన సినీసాహిత్యంలో పరిశీలించవలసిన అంశాలు రెండు. ఒకటి మల్లీశ్వరి రచన. రెండు సినీగీతాలు.
పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

రాయప్రోలు సుబ్బారావుగారి ప్రభావంతో ఆధునిక కావ్యాలలో వియోగ శృంగారానికి ప్రాధాన్యం వచ్చింది. నవరసాలలో ప్రప్రథమంగా చెప్పదగినది శృంగారం. ఇది సంభోగం, విప్రలంభం అని రెండు విధాలు. విప్రలంభ శృంగారం ఐదు విధాలని మమ్మటాదుల అభిప్రాయం. అవి 1. అభిలాష 2. విరహం 3. ఈర్ష్య 4. ప్రవాసం 5. శాపం. ఇందులో ప్రవాసం కృష్ణశాస్త్రి కావ్య పరిశీలనకి అవసరం. ‘అనురక్తులైన నాయికా నాయకులు కార్యాంతర వశమున దేశాంతరగతులగుట ప్రవాసము’.

కాళిదాసు మేఘసందేశం ప్రవాస విప్రలంభానికి చెందిన కావ్యం.

‘త్వా మాలిఖ్య ప్రణయ కుపితాం ధాతురాగైః శిలయా
మాత్మానంతే చరణపతితం యావదిచ్చామి కర్తుమ్
అస్త్రైస్తావమమ్హరు ప చితై ర్దృష్టి రాలుప్యతే మే

పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యం – సౌందర్యతత్వం

కృష్ణశాస్త్రి కవిత్వంలో దుఃఖం కొత్త తరహాలో రూపుదిద్దుకుంది. భావకవులు బాధని వరంగా భావించారు. రొమాంటిక్ కవులూ, ఫ్రెంచి కవులూ తమ తమ కవితాప్రస్థానంలో దుఃఖానికి తగిన స్థానాన్నిచ్చారు. ఆంగ్ల సాహిత్యంలో ఈ రకమైన దుఃఖాన్ని రొమాంటిక్ మెలంకలీ అంటారు. దీని తత్వం ఇలా ఉంటుంది.

‘Longing for the unattainable ideal; and the feeling that the sensitive artistic genius is bound to be destroyed by the material crowd’

ప్రపంచం నిర్జీవంగా కనిపించి, కృష్ణశాస్త్రి సంధ్యా సమీరాన్ని ఉద్దేశించి ఇలా అంటారు.

‘ఓయి సంధ్యా సమీరణా, రేయి తోడ
కారు చీకటి తోడ దుఃఖమ్ము కూడ

పూర్తిగా »

కృష్ణశాస్త్రి సాహిత్యావలోకనం (రెండవ భాగం)

కృష్ణశాస్త్రి సాహిత్యావలోకనం (రెండవ భాగం)

కృష్ణశాస్త్రిగారి కవిత్వంలో ప్రేమకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆనాటి భావకవులు ప్రేమని గురించి కొత్త తరహాలో చెప్పారు. ఉదాహరణకి గురజాడ అప్పారావు గారి ‘కాసులు’ అనే కవితలోని ఈ పాదం…

‘ప్రేమ -
పెన్నిధి గాని, యింటను నేర్ప
రీ కళ, ఒజ్జ లెవ్వరు లేరు -
శాస్త్రములిందు గూర్చి తాల్చె
మౌనము’

గురజాడవారు ప్రేమని కళగా భావించారు. ఇది శాస్త్రాలలో లభించేది కాదు. అనుభవంతో అన్వేషించాలి. ఆయన ఇంకా ఇలా అంటారు. ‘ప్రపంచం యొక్క అచ్చమైన తత్వం స్వార్థ త్యాగంలో, పరోపకారంలో ఉంది. స్వార్థత్యాగానికి దారి తీయగల ప్రేరణ ప్రేమని మించింది ఉందా?…
పూర్తిగా »

కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానం (మొదటి భాగం)

కృష్ణశాస్త్రి సౌందర్య ప్రస్థానం (మొదటి భాగం)

కృష్ణశాస్త్రి స్వేచ్ఛాన్వేషణలో సౌందర్య స్పృహ ఉంది. కృష్ణశాస్త్రి ప్రధానంగా రొమాంటిక్ కవి. బైరన్, షెల్లీ, వర్డ్స్ వర్త్, కీట్స్ వంటి కవులు స్వేచ్ఛనీ, సౌందర్యాన్నీ అన్వేషించినవాళ్లే. రొమాంటిక్ కవుల స్వేచ్ఛని గురించి క్రిష్టఫర్ కాడ్వెల్ 'ఇల్యూజన్ అండ్ రియాలిటే' అనే గ్రంథంలో ఇలా విశ్లేషించాడు. 'సమకాలిక నిరంకుశ విధానాల నుంచి విముక్తిని కోరిన బైరన్, సహజంగా మంచి లక్షణాలు గల వ్యక్తిని నాశనం చేసిన వ్యవస్థల నుంచి స్వేచ్ఛని కోరిన షెల్లీ, తిరిగి ప్రకృతిలోకి వెళ్లిపోదామన్న వర్డ్స్ వర్త్, 'Revolution as a flight from reality' అన్న కీట్స్, అందరూ రొమాంటిక్ కవితా పతాకాన్ని స్వేచ్ఛగా, ఎగరేసినవాళ్లే' . వీళ్లందరూ కృష్ణశాస్త్రిని ప్రభావితం చేసినవారే.
పూర్తిగా »