‘ సంపాదకులు ’ రచనలు

సెలవు

మార్చి 2018


వాకిలికి ఈ నెల నుండి విరామం ప్రకటిస్తున్నాం. మీ అందరి సహకారం వల్లనే ఈ ఐదేళ్ళలో వాకిలి ఒక నమ్మకమైన రచయితల బృందాన్ని, వైవిధ్యాన్ని ఆదరించే ఒక మంచి పాఠక బృందాన్ని ఏర్పరచుకోగలిగింది. వాకిలిని కొనసాగించలేకపోతున్నామే అన్న దిగులైతే చాలా ఉంది కానీ మళ్ళీ ఎప్పటికైనా ఈ వాకిట్లోకి తిరిగిరాకపోతామా అన్న నమ్మకం కూడా లేకపోలేదు. పత్రికలో ఇప్పటివరకు ప్రచురించబడిన రచనలు ఇక్కడే పదిలంగా అందరికి అందుబాటులో ఉంటాయి.

వాకిలిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలతో…

సెలవు.

వాకిలి సంపాదక బృందం


పూర్తిగా »

వాకిలి ఇకనుండి వారానికోసారి

జనవరి 2018


మొన్నటి డిసెంబర్ సంచికతో వాకిలికి ఐదేళ్ళు నిండాయి. ఒక మిత్రుడు చెప్పినట్టు ఇక వాకిలికి బాలారిష్టాలన్నీ తీరిపోయినట్టే లెక్క.

ప్రధాన స్రవంతికి చెందిన అచ్చుపత్రికల్లో సమకాలీన సాహిత్యం కనుమరుగవుతుడటం వలన వెబ్ పత్రికలమీద మరింత భారం పెరిగిపోతున్న సందర్భం ఇది. అచ్చు పత్రికలకున్న పరిమితులవల్ల కావొచ్చు, వ్యాపార ధోరణి వల్ల కావొచ్చు, ఇప్పుడు సాహిత్యం సింగిల్ పేజీకి మాత్రమే పరిమితమయింది, అదీ వారానికి ఒక్కపేజీకి మాత్రమే! దీనివల్ల, సీరియస్ సాహిత్యాన్ని ఆశించే పాఠకులకు నిరాశే ఎదురవుతుంది. ఇప్పుడేర్పడుతున్న సీరియస్ సాహిత్యపు ఖాళీని పూరించడానికి, స్థలపరిమితుల్ని, భావపరిమితుల్ని దాటుకుని వాకిలి తనవంతు బాధ్యత తను నిర్వహిస్తుంది. ఇక ముందు కూడా నిర్వహించబోతోంది.

ఒక పత్రికను…
పూర్తిగా »

మార్చి నెల వాకిలికి స్వాగతం

మార్చి 2017


మార్చి సంచికలో:
శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి గారి గురించిన వ్యాసాలు, ఆడియోలు కూర్చిన ఎడిటర్స్ పిక్.
సోషల్ మీడియాలోని సౌలభ్యం గురించి హెచ్చార్కే గారి వ్యాసం.
తమిళం నుండి, చైనీస్ నుండి అనువాద కథలు.
విస్వాలా, కైరిల్ వాంగ్ ల కవితలకు తెలుగు అనువాదం.
ఆక్షరం టీవీ కార్యక్రమం గురించి కిరణ్ చర్లతో ముఖాముఖీ
శివకుమార్ గారి హాస్య కథ
మిగతా శీర్షికలు యధాతధంగా…


పూర్తిగా »

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

మార్చి 2017


శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

మదన కామరాజు పుస్తకాలపై మోజుతో, తనకు చదువురాకపోయినా ఎవరి చేతైనా చదివించుకుందామని వాటిని గుట్టుగా దాచుకున్న ఒక ముసలావిడ ఉజ్జాయింపుగా ఓ వందేళ్ల క్రితం తెలుగు సాహిత్యానికి అనుకోకుండా ఓ మేలు చేసింది. చదువొచ్చిన ఒక కుర్రాడి చేత ఆ పుస్తకాలను చదివించుకుంది. కులవిద్య అయిన పంచాగంతో పాటు, సంస్కృతమూ చదువుకుంటూ పండితుల దోవలో పోవాల్సిన ఆ కుర్రాడికి తెలుగు మీద మోజు పెరగటానికి ఆమె కూడా అలా కారణమయ్యింది. ఆ కుర్రాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. పాండిత్యం వద్దనుకున్నాడు, అవధానాలు వద్దనుకున్నాడు. కథలు చెప్పాలనుకున్నాడు. అలా ఇలా కాదు: “భాష పరసీమలు చూడాలి. గజం యెత్తు పుస్తకాలు రచించాలి”. ఇదీ లక్ష్యం.…
పూర్తిగా »

కొత్త శీర్షికలు

ఫిబ్రవరి 2017


వేలపూల సుగంధాల్ని మరిపించే సువాసన వానది. వానెప్పుడూ జ్ఞాపకాలుగా ముసురుకుని, కథలు కథలుగా కురిసి మరిచిపోలేని అనుభూతుల్ని మిగిల్చి వెళ్తుంది. ఉడుకుతున్న అన్నం వాసనేమో అచ్చం అమ్మ పిలుపులా ఒంట్లో ఉన్న ప్రతీ కణాన్ని పులకరింపజేస్తుంది. మంచి పాట కూడా అంతే, మన లోలోకి ఇంకి, రక్తంతో దోస్తీ చేస్తూ మనతో పాటే ఉండి పోతుంది.

మరి పుస్తకం?! దీంది కూడా వాన, అన్నం, పాటల పోకడే. వీటి పోకడ ఏమిటంటే… రాకడే! అవి వచ్చాక వెళ్ళే ప్రసక్తి ఉండదు. మరిచిపోవడమంటూ జరగదు. మనం ఏదైనా పుస్తకం నడుమ్మీద చెయ్యేసి ఒళ్లోకి తీసుకున్నప్పుడు అదొక్కటే రాకుండా దాంతో పాటు కొన్ని జ్ఞాపకాల్ని కూడా మనవొళ్లోకి లాగుతుంది.…
పూర్తిగా »

సీరియల్ కిల్లర్లు – చదువరి

ఫిబ్రవరి 2017


సీరియల్ కిల్లర్లు – చదువరి

రాజకీయ వ్యంగ్యానికీ సరదా సంభాషణలకీ మారుపేరుగా నిలిచిన చదువరి బ్లాగ్ ని చదవని తెలుగు బ్లాగర్లు చాలా అరుదుగా ఉంటారేమో. ఈ బ్లాగు సొంతదారు శిరీష్ కుమార్ తుమ్మల. ఈయన రాతల్లో తెలుగు భాషాభిమానం, ఆహ్లాదమైన వచనం, సామాజిక వాతావరణం పట్ల సునిశితమైన గమనింపు కనిపిస్తాయి. శిరీష్ గారు పొద్దు పత్రికలో రాసిన “సీరియల్ కిల్లర్లు” హాస్యకథ ఈ నెల ఎడిటర్స్ పిక్.

***

సీరియల్ కిల్లర్లు

సాయంకాలమైంది.

ఈసురోమంటూ, బండీడ్చుకుంటూ అంకులు షాపుకు చేరాను. నా కోసమే ఎదురుచూస్తున్నట్టు కూచ్చున్నాడు వాడు. అంకులంటే నిజంగా అంకులు కాదు.. అంకినీడు వాడి పేరు. ఎవరినీ పేరు పెట్టి పిలిచే అలవాటు లేని చదువుకునే…
పూర్తిగా »

ఐదో అడుగు

జనవరి 2017


ఐదో అడుగు

నాలుగడుగులు వేసామంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాలుగడుగులే మైలురాయి కాకపోవచ్చు కానీ, వెనక్కి చూసుకుంటే వెయ్యికిపైనే (1250) ప్రచురించిన రచనలు తలలూపుతూ కనిపిస్తున్నాయి. ఆ రచనల వెనకున్న మూడువందలకు పైగా రచయితలూ చేతులూపుతూ కనిపిస్తున్నారు. పత్రికమెడలో సగర్వంగా ఊగుతున్న సంపాదకహారం ఒక్కటేకాదు, పత్రిక వెనక నిలబడి పనిచేస్తున్న సాహితీమిత్రులు, రచయితల సహకారం వల్లనే వాకిలి ఈ నాలుగేళ్ళు ఇలా నిలదొక్కుకోగల్గింది.
ప్రతీ నెల వాకిలిని ఇష్టంగా తెరిచి, చదివి, రచనలపై స్పందన తెలియజేస్తూ, మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్న పాఠకులకి ధన్యవాదాలు. మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తున్నాం.
పూర్తిగా »

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2016


వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సరిగ్గా మూడేళ్ల క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి ఈరోజు సగర్వంగా 36 సాహిత్యపుటడుగులు వేసి మీ ముందు నిలబడింది. పాఠకరచయిత(త్రు)ల ఆదరణవల్లే వాకిలి ఈ మూడేళ్ల మైలురాయి అనాయాసంగా దాటగల్గింది. మీరు పంచిన ప్రేమ, మీనుంచి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈరోజు వాకిలి ఇలా విస్తరించింది.

మాకు తెలీకుండా పత్రిక నిర్వహణలో ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు, ప్రచురణల్లో నిర్లక్ష్యాలు దొర్లి ఉండవచ్చు, అప్పుడప్పుడు పాఠకుల మనోభావాలు దెబ్బతీసే రచనలూ ప్రచురించి ఉండవచ్చు. ఈ సందర్భాలన్నింట్లో మమ్ముల్ని అర్ధం చేసుకుంటూ, మాతో పేచీ పడుతూ, రాజీకొస్తూ… మళ్ళీ నెల తిరగ్గానే అన్నీ మరిచిపోయి వాకిలిని ఇష్టంగా తెరిచి చూస్తూ ఎంతో…
పూర్తిగా »

వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

జనవరి 2014


వాకిలి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కల నిజమయి ఎదురుగా నడుచుకుంటూ వస్తే?! అంతకన్నా ఇంకేం కావాలి! కొన్ని కలలు నిజమవుతాయి! సరిగ్గా ఏడాది క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి సగర్వంగా పన్నెండు సాహిత్యపుటడుగులు ముందుకేసి ఈ రోజు వార్షిక సంచికగా మరింత కొత్తగా అలంకరించుకుని మీ ముందుకు వచ్చింది.

వాకిలి లేని ఇల్లును ఊహించుకోలేం! అలాగే సందడి లేని ఇల్లు ఆత్మ లేని దేహం లాంటిది. ఏ ఇంటి వారి అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటి వాకిలి ఉంటుంది. కానీ ఈ ‘వాకిలి’ ఒక్కింటి వాకిలి కాదు. అనేక తెలుగు ముంగిళ్ళను కలిపి కుట్టిన అచ్చమైన స్వచ్ఛమైన సాహిత్య వేదిక. ఎలాంటి అరమరికలు లేని సాహిత్య సంభాషణలను ఆహ్వానిస్తూ,…
పూర్తిగా »

మధురాంతకం రాజారాం అవార్డుల విజేతలు

26-ఏప్రిల్-2013


మధురాంతకం రాజారాం అవార్డుల విజేతలు

ప్రసిద్ధ  రచయిత మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా  ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు. ఈ సారి హోసూరులో ఈ సదస్సు పెద్ద యెత్తున నిర్వహించే సన్నాహాలు చేస్తున్నామని నరేంద్ర చెప్పారు.

ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి…
పూర్తిగా »