సరిగ్గా మూడేళ్ల క్రితం ఒక అందమైన కలతో పుట్టిన వాకిలి ఈరోజు సగర్వంగా 36 సాహిత్యపుటడుగులు వేసి మీ ముందు నిలబడింది. పాఠకరచయిత(త్రు)ల ఆదరణవల్లే వాకిలి ఈ మూడేళ్ల మైలురాయి అనాయాసంగా దాటగల్గింది. మీరు పంచిన ప్రేమ, మీనుంచి లభించిన స్పందన, మీ ప్రోత్సాహం కారణంగానే ఈరోజు వాకిలి ఇలా విస్తరించింది.
మాకు తెలీకుండా పత్రిక నిర్వహణలో ఏవైనా చిన్నచిన్న పొరపాట్లు, ప్రచురణల్లో నిర్లక్ష్యాలు దొర్లి ఉండవచ్చు, అప్పుడప్పుడు పాఠకుల మనోభావాలు దెబ్బతీసే రచనలూ ప్రచురించి ఉండవచ్చు. ఈ సందర్భాలన్నింట్లో మమ్ముల్ని అర్ధం చేసుకుంటూ, మాతో పేచీ పడుతూ, రాజీకొస్తూ… మళ్ళీ నెల తిరగ్గానే అన్నీ మరిచిపోయి వాకిలిని ఇష్టంగా తెరిచి చూస్తూ ఎంతో ప్రోత్సాహం ఇస్తున్న పాఠకులకి-
సంపాదకత్వనిర్వహణలో ఒక్కోసారి రచనలను తిప్పి పంపినా, మార్పులు చేసి పంపమని అడిగి రచయితల మనసులు నొప్పించినా, మమ్ముల్ని అర్థం చేసుకుని సహకరిస్తున్న తోటి రచయితలకు-
మీకందరికీ ధన్యవాదాలు!
వాకిలిని తమ స్వంత పత్రికలా భావించి అడిగినప్పుడల్లా మాకు సహాయం చేస్తున్న చంద్ర కన్నెగంటి, ఎలనాగ గార్లకు-
వాకిలికి నెలనెలా కాలమ్స్ రాస్తున్న కుప్పిలి పద్మ, మైథిలి, కర్లపాలెం హనుమంత రావు, కోడూరి విజయ్, మమత గార్లకు-
కథలకి illustrations వేస్తున్న జావేద్, అన్వర్ గార్లకు-
నెలనెలా కవర్ పేజీకోసం ఫోటో అందిస్తున్న కృష్ణమోహన్(KMG) గారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇప్పటివరకు ప్రచురితమైన ప్రతీ సంచికకి మేము అడిగినా, అడక్కపోయినా వాకిలి అంటే ఇష్టంతో రచనలు పంపిన రచయిత(త్రు)లందరికీ మళ్ళీ పేరు పేరునా ధన్యవాదాలు.
వాకిలికి ఇలాగే రచనలు పంపిస్తూ, మనసు విప్పి మీ అభిప్రాయాలు రాస్తూ, చర్చల్లో పాల్గొంటూ, ముందు ముందు కూడా మీరు ఇలాంటి సహకారాన్నే అందిస్తారని ఆశిస్తూ,
ఈ జనవరి ప్రత్యేకసంచికను వాకిలి రచయిత(త్రు)లకు అంకితం చేస్తూ,
నూతన సంవత్సర శుభాకాంక్షలతో,
మీ
వాకిలి సంపాదకబృందం.
రవి వీరెల్లి
స్వాతికుమారి బండ్లమూడి
స్వాతీ శ్రీపాద
**** (*) ****
(banner image credit: Anwar)
వాకిలి పత్రికకు, వాకిలి పత్రిక మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వాకిలి పత్రిక ప్రారంభ సంచికనుంచి చూస్తున్ననాకు ఈ సాహిత్య ప్రపంచంలోని పాఠకులకు కావలసిన వైవిధ్యం.. రచయితలు కోరుకొనే స్వేచ్చ.. రెండూ ఆకర్షణీయంగా అనిపించాయి. ఒడుదుడుకులు.. దుందుడుకులు లేని వాకిలి సాహిత్య ప్రవాహంలో అడపా దడపా మునకలేస్తూ ఆనందిస్తున్నాము. మా ఈ ఆనందం వెనుక మీ పాత్రికేయబృంధం కృషి ఎంత ఉందో అర్థం చేసుకుంటున్నాం. ముందు ముందు వాకిలి మరిన్ని శోభాయమానమైన అలంకారాలతో అలరాలాలని నిండు మనసుతో అభిలషిస్తున్నాం. వాకిలి అందిస్తున్న సౌహార్ద్ర సౌజన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాకిలి సంపాదకులు రవి వీరెల్లి, స్వాతికుమారి బండ్లమూడి, స్వాతీ శ్రీపాద గార్లకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం. తోటి రచయితలకు, వాకిలి అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు మీద్వారా తెలుపుకొంటున్నాం.
.
వాకిలి వారి కి, వాకిలి చదువరులకు
నూతన సంవత్సర శుభాకాంక్షల్ !
జిలేబి
వాకిలికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు వాకిలి సంపాదక వర్గానికీ, రచయితలకీ పాఠకులకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
రవి గారూ,
మంచి సాహిత్యం ఒకే రకానికి చెందినదై వుండాల్సిన అవసరం లేదనే విషయాన్ని బాగా గ్రహింపుకు తెచ్చుకున్న కొద్దిమంది సంపాదకులలో ఒకరైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మంచి సాహిత్యం ఎన్నో రకాలుగా ఉండొచ్చును. ఒక్కో రకం ఒక్కో పాయ. ఒకే పాయను పట్టుకుని వేలాడకుండా అన్నిటినీ ఆదరించటానికి ప్రయత్నిస్తున్నారు మీరు. సంపాదకుడు అన్నవాడికి మంచి టెంపరమెంట్ అవసరం. అది మీలో పుష్కలంగా వుందనేది నాకు అనుభవం ద్వారా తెలిసినన విషయం. అందుకు కూడా మీరు అభినందనీయులే. ముందుముందు చాలా రుచి గల, శుచి గల సాహిత్యాన్ని అందించేందుకు తగినంత జాగ్రత్తను తీసుకుంటారని ఆశిస్తున్నాను. మీ సంపాదక వర్గంలోని సభ్యులందరికి కూడా నా హార్దిక అభినందనలు.
రచయితలకి గౌరవాన్నిస్తూ, వాళ్ళని అగౌరవపరిచేవి, అనవసరమైనవి అయిన కామెంట్లను ఎవరైనా రాస్తే వెంటనే డిలీట్ చేస్తూ ఉండటం గమనించాను. అది చాలు వాకిలి పత్రిక అంటే మాకు అభిమానం కలగడానికి. ధన్యవాదాలు.
సున్నిత మనస్కులైన ఈ ముగ్గురు ఎడిటర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
వాకిలి పత్రిక లో రచయితల రచనలకు ఎడిటింగు దాదాపుగా లేదు. మంచి పద్ధతి. కానీ రచనల్లో అనుకోకుండా దొరలిన స్ఖాలిత్యాలను, పొరబాట్లనైనా సవరించాలని సంపాదకులకు నా మనవి.
“మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వగతం ” ( శ్రీశ్రీ )అలాంటి వారు ఈ నూతన సంవత్సరం లో చాల మంది ఉంటారని భావిస్తాను. శుభాకాంక్షలు !!
వాకిలి కి జన్మదిన శుభాకాంక్షలు
వాకిలి సంపాదక వర్గానికి, రచయితలకు, పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాగే మమ్మల్ని అలరిస్తూ ముందుకు సాగుతూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ వాకిలి కి జన్మదిన శుభాకాంక్షలు.
వాకిలి సంపాదకులకు
నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆదరణకు, ప్రోత్సాహానికి కృతజ్ఞతాంజలులు.
మూడేళ్లు పూర్తిచేసుకున్న వాకిలికి అభినందనలు
రవిగారూ, ముందుగా- రెండు వెబ్ మేగజైన్స్ గురించి తప్ప మిగతావాటి గురించి తెలియని నేను, వాకిలికి రాసిన నా మొట్టమొదటి, అతి సామాన్యమైన కథని వేసుకున్నందుకు కృతజ్ఞతలు.
కిందటి నెలలో నేను వాకిలి పాత ముద్రణలని కొన్ని, వరస పెట్టి చదివాను. చాలా వైవిధ్యమైన టాపిక్స్. కూడోస్ మీ టీముకి.
రవీ, హృదయపూర్వక అబినందనలు.
ఎంత చెబితే తీరుతుంది నా కృతజ్ఞత! గాలి ఆడేలా, ఇలాగే వర్థిల్లండి పది కాలాల పాటు. ..