కథ

ధనం మూలం..!

ధనం మూలం..!

భర్త ప్రకాష్ ని కరకరా నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది కోమలికి. ఏనాడు తన మాట విన్నాడు గనక. ఏది తోచితే అది చేసెయ్యడమే, పెళ్ళాం చెప్పిన మాట వినాలని ఒఖ్ఖనాడైనా అనుకున్నాడా? 'మొండి మొగుడు చెపితే వినడు గిల్లితే ఏడుస్తాడు' అనే సామెత ప్రకాష్ కి సరిగ్గా సరిపోతుందనేది కోమలి అభిప్రాయం.
పూర్తిగా »

పాపం పరాంకుశం!

పాపం పరాంకుశం!

ఆ రోజెందుకో సెలవు కావడంతో, వేరే పనులేవీ లేకపొవడంతో, కాఫీ తాగి ప్రొద్దున్నే టీవీ ముందర, సోఫాలో కూలబడ్డాడు పరాంకుశం. భార్య మండోదరి పిల్లల్ని బడికి పంపే హడావిడిలో వంటింట్లో వుంది. పేపరు అటు ఇటు తిరగేసి టీవీ లో చానల్స్ మార్చి మార్చి చూస్తూ ‘రాసి-వాసి’ దగ్గర సెటిల్ అయ్యాడు. అన్ని రకాల బొట్లూ పెట్టి, చిత్రంగా నుదిటి మధ్య రూపాయంత నల్ల చుక్క బెట్టి, గడ్డాలు పెంచిన, నల్ల తలపాగా పెట్టిన, ఎర్ర గుడ్డల సిధ్ధాంతి ఒకడు ఆ రోజు రాసి ఫలాలగురించి చెప్తున్నాడు. రాశుల వారీగా చివరెక్కడో ఉన్నా తన రాశి ఫలం వచ్చే వరకు ఓపిగ్గా వినడం మొదలెట్టాడు పరాంకుశం.


పూర్తిగా »

అంతరంగాల అంతరం

అంతరంగాల అంతరం

అమ్మ పోయిన తర్వాత నాన్న ఒక్కరే ఇండియాలో ఉండటం ఎందుకంటూ పావని పోరుపెట్టి నాన్నని అమెరికా తీసుకొచ్చింది. మాతోపాటు ఇక్కడే ఉంటారని ఆయనకి ‘ గ్రీన్ కార్డ్ ‘ వచ్చేవరకు నిద్ర పోలేదు. ఒక డాక్టరుగా ఆయన ఆరోగ్యాన్ని, ఒక కోడలిగా ఆయన మంచి చెడులను చక్కగా చూసుకుంటుంది. మా పాప లాస్య కూడా తాతగారి మాటలకి, ఆటలకి, కథలకి బాగా అలవాటుపడింది. అంతాబాగానే ఉంది అనుకుంటుంటే, ఈ ముసలాయనకేమయిందో గానీ “సంక్రాంతి వస్తోందికదా ఊరు వెళ్లాలి” అని పట్టుబట్టాడు. ఎందుకంటే “సంక్రాంతి రోజే మీ అమ్మ పుట్టినరోజు. అక్కడ నా కోసం వెతుక్కోదూ?!”, అంటాడు. ఆ పిచ్చి మాటలకి నాకు కాలిపోయింది. బతికుండగా…
పూర్తిగా »

గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ

మే 2015


గళ్ళ లుంగీ – గళ్ళ మేక్సీ

అదేమి కాకతాళీయమో గాని నేను గళ్ళ లుంగీ వేసుకుని మా డాబా మీద పచార్లు చేస్తున్నప్పుడల్లా మా ఎదురింటి ఆవిడ గళ్ళ మేక్సీ వేసుకుని తన డాబా మీద తిరుగుతుంటుంది. చూసేవాళ్ళు తను పిచ్చిగా తిరుగుతుందని అనుకోకూడదని కొన్నిసార్లు బట్టలు ఆరేయడం కోసం, కొన్ని సార్లు బట్టలను తీసుకోవడం కోసం, మరికొన్ని సార్లేమో చీపురును ఇవ్వడం కోసం అన్నట్టు పనిమనిషిని వెంట తీసుకుని పైకి రావడం, వచ్చినప్పుడు నన్ను కన్నార్పకుండా చూడడం చేస్తుందని మా ఆవిడ దగ్గర చెప్పుకోవడానికి దమ్ముల్లేక నేను లోలోన సంతోషించిన సందర్భాలెన్నో ఉన్నాయి! అయినా భార్య దగ్గర ఇలాంటి విషయాలు చెప్పడం మర్యాదగా ఉంటుందా అని మనసులోనే అనుకునే వాడిని.…
పూర్తిగా »

పాత ఒక వింత!

పాత ఒక వింత!

మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం లో ఉమెన్స్ హెల్త్ అండ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ పై అధ్యయనం చేసి ఇండియాకొచ్చి దీనిపై పరిశోధనలు జరిపిన జోలీ ఈ మధ్యే ఓ జిం ఏర్పాటుచేసింది. దేశరాజధాని న్యూఢిల్లిలో ఆ జిం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎందరో శ్రీమంతుల స్త్రీలకు, అందునా సీమంతం చేసుకోబోయే ఇంతులకు కూడా ప్రత్యేక వ్యాయామాలున్నాయి. ప్రతి వ్యాయామమూ నిజానికి వ్యాయామం కాదు. ఓ పని! ఆ పనిలో ఉండే వ్యాయామాల వల్ల మన ఆరోగ్యం ఎలా బాగుపడుతుండో ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాదు శారీరిక చైతన్యంతోబాటు మానసిక ఒత్తిడుల్నుంచికూడా ఉపశమనం దొరుకుతుందట.

ఒక పని గుండెపోటుని రానీకుండా చేస్తుందట. మరోపని పొత్తికడుపు పెరగనీయకుండా, ఇంకోటి…
పూర్తిగా »

ఎందుకు వగచేవో…!?

ఎందుకు వగచేవో…!?

“నీతో మాట్లాడాలి సాయంత్రం పెందరాడే వస్తావా?” అన్నాను షూస్ కి లేసులు బిగించుకుంటున్న ఆయనకి దగ్గరగా వెళ్ళి.

“అబ్బబ్బ! సునందా! ఎప్పుడు చూసినా ‘నీతో మాట్లాడాలి’ అంటూ స్టార్ట్ చేస్తావు, ఏదో సీరియస్ విషయమేమో అనుకుని వస్తానా, పిచ్చి వాగుడు మొదలు పెడతావ్ – ‘మనం ఇట్లా కాదు ఉండాల్సింది అనో, అబ్బాయి మనసులో ఏముందో అనో’ – అసలు నీకు ఇలాంటి ఆలోచనలు పుట్టడానికి కారణమేంటో!? నీ లాంటి వాళ్ళ మెదడుని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. సరేలే నాకు ఆఫీసుకి టైమయింది” గొంతులో విసుగు.

అతన్ని ఏమైనా అని బాధించాలన్నంత కోపం వచ్చింది. వద్దు వద్దు – ఎందుకు పండగ పూట గోల?


పూర్తిగా »

ప్రేమకథ

ఏప్రిల్ 2015


ప్రేమకథ

అనగనగా ఊరి చివర ఒక మసీదు. అక్కడే ఒంటరిగా ఒక సాయెబు. ఎక్కడ్నుండి వచ్చాయోగాని, ఒక పావురాల జంటని చూసి అతడికి ముచ్చటేసింది. అవి దిక్కులేక చక్కర్లు కొడుతుంటే బాధేసింది. వాటిని చేరదీసి,తనకి సహాయంగా ఉంటూ, ఏదో ఒక పనిచేస్కొని బతకమని చెప్పెళ్ళాడు. గూడు దొరికినందుకు పసిగువ్వలు చాలా సంబరపడ్డాయ్. మలుపుకున్న కలని మళ్ళీ గీయడం మొదలెట్టాయ్.

ప్రతిరోజూ పావురాళ్ళ కువకువల్తోనే మసీదుకి తెల్లారేది. వాటికి నమాజు చదవడం రాదు!అసలు మతమంటే కూడా తెలీదు!మట్టికి మొక్కి చేతులు జోడించేవి.కలిసి బతికేలా దీవించమని వేడుకునేవి.

పొద్దయ్యాక-గింజలకోసం ఒక్కోటి ఒక్కోదిక్కుకి ఎగిరెళ్ళేవి. పొద్దంతా పనిచేసేవి. అవి రెక్కలు విసిర్తేనే వాటి ప్రపంచమంతా గాలివీచేది. పొద్దుపోయాక-గాలిని కొంచెం దాచుకుని…
పూర్తిగా »

నాన్నొస్తే..!?

నాన్నొస్తే..!?

పడమటి పొద్దు వాలిపోతోంది. సూర్యుడి సిందూరపు రంగు సాయంత్రపు చీకటితో కలిసి విచిత్రమైన వర్ణాన్ని పులుముకుంటోంది. గూళ్ళను చేరుకోవడం ఆలస్యమైన పక్షులు ఎదురుచూస్తున్న బిడ్డల కోసం వడిగా పరుగిడుతున్నై. పగలంతా పొదల్లో అఙాత వాసం చేసిన కీచురాళ్ళు రాత్రి సంగీతపు కచేరీకి గొంతు సవరించుకుంటున్నై. ఊరంతా సాయంత్రపు కట్టె పొయ్యిల పొగ చుట్టబెడుతోంది.

చిన్ని కల్పన తన నేస్తాలతో గుడిసె ముందట ఆడుకుంటోంది. ఆనందంతో మెరిసిపోయే కళ్ళు, ఎగిరిపడే పిలకజళ్ళతో కల్పన పేదరికాన్ని వెక్కిరించే మహలక్ష్మి లాగుంటుంది. ఎనిమిదేళ్ళ కల్పనకు నాన్నంటే ప్రాణం.

పూరింటిని ఆవరించిన చీకటిని తరమడానికై కల్పన తల్లి లాగే చిన్ని దీపం కొట్టుమిట్టాడుతోంది. పగలంతా ఆనందంగా నాన్న…
పూర్తిగా »

పరిపూర్ణం

పరిపూర్ణం

ఆమె కెరటాల వైపు చూపించింది. పైకెగసిన ప్రతి కెరటం తీరాన్ని తాకడంలేదు. కొన్ని కెరటాలు తమలోకి తాము ముడుచుకుంటున్నాయ్. కొన్ని తమని తాము శోధించుకున్నట్టుగా కనపడుతున్నాయ్. ఆ కెరటాల వెనుక చిన్నగా అలలు కదుతున్నాయ్. ఆకాశం మీదున్న ప్రేమ దేహంపై మెరిపిస్తూనే ఏ ఉద్వేగానికీ లోనవనట్టుగా. ఏ వత్తిడికీ తమ అస్తిత్వాన్ని కోల్పోనట్టుగా.
పూర్తిగా »

మొగలిపొద

మొగలిపొద

“జిస్ గలీమే తెరా ఘర్ న హో బాలమా ఉస్ గలి సే హమే తో గుజరానా నహి,” సెల్ లో వస్తున్నముకేష్ పాటతో పాటు తాతయ్య కూనిరాగం తీసుకుంటూ తోటలో కలుపు మొక్కలు తీస్తున్నాడు. క్యాట్ మోడల్ పరీక్ష రాసి, కాస్త చిరాగ్గా వున్నఅర్నవ్ బండి పెట్టేసి నేరుగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు.

“ఎలా రాశావు కన్నా.. ?” తాతయ్య అడిగాడు.

“బాగా రాశా తాతయ్యా ఈ పాట అర్థం ఏమిటి? మీరు ఎక్కువ వింటుంటారు . ”

” ఏ వీధిలో అయితే నీకు ఇల్లు లేదో ఆ వీధిలో నేను ప్రవేశించను,నీ ఇంటికి చేర్చని దారిలో నేను నా పాదం మోపను”


పూర్తిగా »