‘ ప్రసూన రవీంద్రన్ ’ రచనలు

రంగుల్లో తడిసిపోదామిలా…

రంగుల్లో తడిసిపోదామిలా…


జీవితమంటేనే రంగుల మయం. ఆ రంగుల్ని గుర్తించి ఒడిసిపట్టుకుని ఆనందాన్నో, విచారాన్నో, తీవ్రమైన వేదననో వ్యక్తపరచగలగడమే కాకుండా, చదువరులకి కూడా తమ జీవితంలో మారుతున్న రంగుల్ని చూసుకోగలిగేలా చెయ్యడం కళాకారుడికే సాధ్యం. ఒక చిత్రకారుడు తన అనుభవాల్నీ, అనుభూతులనీ తనకు నచ్చిన రంగుల్లో ప్రపంచానికి వ్యక్తపరిచినట్టు, కవి అందమైన పదచిత్రాలతో చెబుతాడు. అలా చెప్పాలంటే ఎక్కడో ఓ చోట కాసేపు ఆగాలి. అలా ఆగిన కాస్త సమయంలోనే తనలో విప్పుకుంటున్న పొరల్నీ, కలిగే మార్పుల్నీ చదువరులకి అర్థమయ్యే రీతిలో అందించగలగాలి.

ఈ సంకలనంలో తను గమనిస్తున్న రంగుల్ని మన మీదకి వెదజల్లి మనల్ని మేల్కొల్పుతాడు కవి. సమాజం గురించో, మానవ సంబంధాల గురించో…
పూర్తిగా »

సంగమం

వేసవి సాయంత్రం వర్ష ఋతువైపోయే అరుదైన క్షణాల్లో
ఖాళీ అయిన హృదయంలో మన సంభాషణలన్నీ దాచుకుని
మేఘం ఎక్కడికో వలసపోతుంది.

పూర్తిగా »

ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss

ఆధ్యాత్మికంగా మేల్కొల్పే “Only love is real “ by Dr. Brian Weiss

“అంతా ప్రేమే… అంతా ప్రేమే. ఆ ప్రేమ ద్వారానే అవగాహనా శక్తి, తద్వారానే ఏర్పడే సహనం. అక్కడే… సరిగ్గా అప్పుడే సమయం ఆగిపోతుంది. అంటే అంతా వర్తమానమే అయిపోతుంది. యదార్థమే వర్తమానం. మానసికంగా భూతకాలంలోకో, భవిష్యత్తులోకో ప్రయాణించేసి అక్కడే తిరగాడుతూ ఉండటం ఎప్పటికైనా బాధనీ, అనారోగ్యాన్నీ మాత్రమే కలిగిస్తుంది. అలా మన కాలం మన చేతుల్లోంచి ఒలికిపోకుండా ఒక్క సహనం మాత్రమే ఆపగలదు.

అన్ని ప్రశ్నలకీ ప్రేమే అంతిమ సమాధానం. ప్రేమ నైరూప్యమైనది కాదు. అది నిన్ను నిర్మించి నీ ఉనికిని కాపాడే ఓ దివ్య శక్తి. అందుకే ప్రేమమయమైపో. ప్రేమని అనుభూతించు. ప్రేమని దాచుకోకుండా వ్యక్తపరుచు. ప్రేమ భయాన్ని పోగొడుతుంది. ప్రేమని అనుభూతించేటప్పుడు…
పూర్తిగా »

రాధా మనోహరాలు – 3

రాధా మనోహరాలు – 3

ఏం వ్రాయాలి నీకు? చలి కాలం కాస్తా కరిగిపోయింది. వచ్చే వసంతం మాటేమో కానీ, ఉక్కపోత మొదలయింది.

నువ్వు వదిలి వెళ్ళిన పొదరింట్లోనే ఇప్పుడు కూర్చుని ఉన్నాను.

ఏమైనా వ్రాయాలి కానీ, గుండె కాస్త తేలికగా ఉందీవాళ. వ్రాసే కొద్దీ పెరిగే బరువుని మోయడానికి కూడా మనసు సిధ్ధపడాలిగా.

అక్షరాలు రాలే కొద్దీ గుండె తనువంతా కొట్టుకోవడం మొదలవుతుంది. వాన జోరందుకునే కొద్దీ, ఈ పరిసరాలనుంచి విడిపోవడం ప్రారంభమవుతుంది. అలవాటే కానీ, ఇవాళ రావాలని లేదు పడవలోకి. అలల ఊపుని కూడా తట్టుకోలేననిపిస్తోంది.

నిశితంగా గమనించాలనుంది. నీవల్ల ప్రభావితమవుతున్న క్షణాలు రుతువులకి లొంగని పూల తోటలుగా ఎలా మారుతున్నాయో.

ఇప్పటికైనా తెలుసుకోవాలనుంది. నీ తలపుల్లోంచి…
పూర్తిగా »

రాధా మనోహరాలు – 2

ఫిబ్రవరి 2017


రాధా మనోహరాలు – 2

నీకు వ్రాయడం మొదలుపెట్టానో లేదో .. ఎవరి మొబైల్ లోంచో తెలీదు లీలగా ఆ పాట

“తుమ్ మానో యనా మానో .. పర్ ప్యార్ ఇన్సాన్ కి జరూరత్ హై … “

ఇప్పుడిక ఈ విషయం తప్ప ఇంకేమీ మాట్లాడాలనిపించడం లేదు. ఆ పాట పల్లవి అలాంటిది మరి.

పదాలు మాత్రమే మిగిలే ప్రయాణాలని తెలిసి కూడా పల్లవిని నిర్లక్ష్యం చేస్తూ పాటని అల్లేసుకుంటాం. అలరించలేకపోయిన పాట తోడు అవసరమే లేదని వాడిన దండలో దారంలా పారేసుకుంటాం.

ఇంత దూరం విసురుగా సాగి వచ్చాక , నడక తనంతట తాను నెమ్మదించాక , జీవితం సుధ్ధ వచనమైపోయిందని పొగిలి ఏడ్చే పిచ్చి…
పూర్తిగా »

రాధా మనోహరాలు – 1

రాధా మనోహరాలు – 1

నిండు పున్నమి రాత్రుల్లో, నా బాల్కనీ అదృష్టంలో సగం తీసుకుని
నడి నెత్తికి వచ్చేసిన చంద్రుడిని అంతసేపు చూస్తూ, అవునూ, నీకు టెలీపతీ అంటే అర్థం కాలేదన్నావు కదూ ఒకసారెప్పుడో.

అంత వెన్నెల్ని తాగేసిన ఆ మత్తులో కూడా ఎక్కడో హాల్లో సైలెంట్ మోడ్ లో ఉన్న నా మొబైల్ వైపు అసంకల్పితంగా ఎందుకు అడుగేశానంటావు? మొబైల్ చేతిలోకి తీసుకోగానే నిశ్శబ్దంగా అందులో నీ పేరు ఎలా వెలిగిందంటావు?

నీకు గుర్తుందో లేదో, ఆ రోజు ఫోన్ ఎత్తగానే ‘హలో’ కూడా చెప్పకుండా “ఇవాళ నీ ప్రొఫైల్ పిక్ లో ఉన్నట్టే నువ్వు ఎప్పుడూ.. ఎప్పుడూ అలా నవ్వుతూనే ఉండాలి.…
పూర్తిగా »

అనంతం

చిగురింతలనిచ్చి చిరునవ్వుని కోసుకోవాలనుకుంటాడతను.
ఆమె పులకింతలన్నీ పూలైపోవడం చూస్తూ నిలబడిపోతాడు.
కోయిల పిలుపుల మధ్య మామిడి పులుపుల్ని ఆస్వాదిస్తూ
పాటగా పరుగుదీస్తుందామె.

తాపాన్ని కొంత పంచుకుంటుందని వాడిగా వస్తాడతను
ఆవిరై అణువణువూ తననల్లుకుపోతున్న ముందుచూపుని గ్రహించలేడు.
తనకోసం ఒక్క పద్యమైనా రాస్తాడేమోనని ఎదురుచూస్తూనే
సగం వేడిని తీసేసుకుంటుందామె.

మేఘాన్ని చాటు చేసి ముద్దాడాలనుకుంటాడతను
ఆమె పెదవుల్లో పుట్టే మెరుపుల్ని దాచలేకపోతాడు.
వడగళ్ళనేరుకుంటూ కవితల్ని పారబోసుకుంటూ
గుండెని ఖాళీ చేసుకుని కూర్చుంటుందామె.

ప్రతి రేయినీ వెలిగిస్తూ చల చల్లగా ప్రేమిస్తాడతను
ఆమెలా ప్రేమని పద్మాలతో చెప్పడం నేర్చుకోలేడు
మొక్కల్లోని అల్లరినంతా…
పూర్తిగా »

ఛందోబధ్ధం

ఫిబ్రవరి 2016


ఎంత మోహనం
కనుచూపు తాకిడితో కాంతి జనకాలమైపోవడం.
చినుకులో బందీలై ఈ పాత్రలోకి చిందిపోవడం.
కొన్ని జన్మల క్రితమే
ఒకరి చిత్రాన్ని మరొకరం గీసుకుంటూ
నల్లటి చందమామల మధ్య కట్టుకున్న
నక్షత్రాల వంతెన మీంచి
ఇప్పుడు ఒకరిలోకొకరం నడిచి రావడం.

ఎంత సుందరం
గుండె భాష మాత్రమే అనుమతింపబడే లోయలోకి
ఇలా జంటగా జారిపోవడం.
ఎవరూ దోచుకోలేరని
సెలయేటి రాళ్ళ మధ్య
మనం దాచుకున్న తీపి గుర్తులన్నీ
వెలికి తీసి ఇచ్చిపుచ్చుకునే వేళ
నమూనాలైనా మిగల్లేదనుకున్న
మన శిల్పాలన్నీ
సెలయేటి నీటిలో నీడలై…
పూర్తిగా »

పరదామాటున వెన్నెల

అక్టోబర్ 2015


పరదామాటున వెన్నెల

వాన ... ఈదురుగాలితో పాటు ముఖానికి గుచ్చుకుంటున్నట్టుగా సూటిగా తాకుతున్న చినుకులు. వాన నీటిలో కొట్టుకొస్తున్న పసుపు పచ్చని తురాయి పూలు చెప్పుల్లో దూరి చికాకుపెట్టి విసుగ్గా కాలు విదిలిస్తున్నాడు సిధ్ధు. అలాగే తన చెప్పుల్లో దూరుతున్న పూలని మురిపెంగా చేతుల్లోకి తీసుకుంటోంది సౌరభ. పుస్తకాల బేగ్ భుజానికి తగిలించేసి ఆ పూలతో దోసిలి నింపుకుంటోంది. మళ్ళీ చెప్పుల్లో ఇరుక్కున్న మరి కొన్ని పూలని విదిలించబోయినవాడల్లా ఆగిపోయాడు. ఒంగి చేత్తోనే ఆ పూలని తీసి నెమ్మదిగా గట్టు మీద పెట్టాడు. కను చివరల్లోంచే గమనించింది సౌరభ.
పూర్తిగా »

కొమ్మల మధ్యన

సెప్టెంబర్ 2015


ఇలా వచ్చి వెళ్ళిపోతావ్. లిప్త కాలమే అయినా, నీ నీడ పడిన ప్రతి చోటా నీ నవ్వు రంగులో ఓ పదం పూయడం విస్మయంగా చూస్తూ నిలబడిపోతాను.

గంభీరమైన మేఘం, హృదయాన్ని ముద్దాడి, ప్రవాహమై, మమేకమై, నేల చేరిపోయినా, ఆర్తిగా పిలిచే ఆకాశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నట్టు, పూసిన ప్రతిసారీ వెతికి మరీ జీవితాల్ని కలుపుతూ విస్తరిస్తున్న ఈ వలపు దారపు కొలత మనకి అవ్యక్తమో అపరిచితమో కాదని నీకూ తెలుసు.

కాలాన్ని గడ గడా తాగుతూ ఉంటారెవరో…

సముద్ర వేదన తీర్చాలని వెర్రిగా ప్రయత్నించిన రోజుల్లో ఎప్పుడో ఒకసారి నాకు దొరికిన శంఖాన్ని చెవికానించుకుని నా ఏకాంతాన్ని సవరించుకుంటానో లేదో, నేను…
పూర్తిగా »