కథ

చెత్త కథ

సెప్టెంబర్ 2017


తెరమీద రాజేంద్ర ప్రసాద్ “ఏమిటీ వెధవ గోల” అనగానే సంగీత దర్శకుడి పేరు పడుతుంది. చివరికి “ఎవరిదీ చెత్త డైరెక్షన్ ‘ అనగానే ‘జంధ్యాల ‘ అన్న టైటిల్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన మీద తనే జోక్ వెసుకోగలిగిన ధైర్యం కొద్దిమందికే ఉంటుంది.

“నా కథ చెత్తగా ఉంటే అదే పేరుమీద ప్రచురించి అదెందుకు బాగోలేదో , ఇంకా ఎలా బాగా రాయవచ్చో పాఠకులని అడగాలని నాకోరిక” అని ఓ రచయిత తన కథను పంపారు. రచయిత పేరు మార్చి వాకిలి పాఠకుల కోసం ఈ కథను ప్రచురిస్తున్నాం.

ఈ కథలో ఏఏ అంశాలు బాగున్నాయో, బాగోలెదో, అలాగే దాన్ని ఎలా మార్చి రాస్తే…
పూర్తిగా »

వాల్‌ పోస్టర్

వాల్‌ పోస్టర్

గడ్డం మీద ఇంకా బొగ్గు మరకలు ఉండిపోయాయి. ఓ కంటి కొసన పుసులు వదల్లేదు. వెనక అరుగుమీద సగం పుచ్చిన చెక్క స్థంబానికి వీపు ఆనించి కూచునాడు మదార్ వలీ. సత్తుగిన్నెలోంచి గాజు గ్లాసులోకి టీ వడబోసింది బీ.

మోకాళ్ళమీద వంగి గ్లాసు తీసుకున్నాడు వలీ. కుర్చీ మీద కూచొని టీ తాగుతూ తమ్ముడి వైపే చూస్తోంది బీ. మదార్ వలీకి పదకొండేళ్ళుంటాయి. వాడికంటే ఏడెనిమిదేళ్ళు పెద్దది. ఎక్కణ్ణుంచో కాకి కోడిగుడ్డు డోల్ల తీసుకొచ్చి దొడ్లో పడేసింది. ఉదయం ఎనిమిది దాటిపోయింది.

టీ చప్పరిస్తూ వలీ అడిగేడు.

“నానెళ్ళాడా?”

తమ్ముణ్ణి చూస్తూ బీ తొట్రు పడి అంది.

“ఏమో నిషా దిగింది ఎళ్ళేడు. జేబులో ఇరవై…
పూర్తిగా »

నివురు గప్పిన పరువు

‘చపాక రపాక చపాక రపాక’

సాయంకాలపు నీరెండలో… నారింజ చెట్ల నీడన వాలుకుర్చీలో కూర్చుని వున్నారు గాదెల్రాజుగారు.

ఆయన ఓ అరచేతిలో… మచ్చుకి తెచ్చిన వడ్లు బంగారపు గింజల్లా మెరుస్తున్నాయి. ఇంకో అరచేయి ఆ గింజలని బిగబట్టి బాగా నలుపుతోంది.గాదెల్రాజుగారు ఇప్పటి వరకూ అలా ఎన్ని బస్తాల వడ్లని నలిపి నాణ్యత చూసారో లెక్కాపత్రం లేదు కానీ… ఖచ్చితంగా చూసే ఉంటారనడానికి కదును గట్టి నలుపెక్కిన ఆయన అరచేతులు సాక్ష్యం చెబుతాయి..

వడ్ల గింజలని నలుపుతున్న ఆయన రెండు అరచేతుల మధ్యా అగ్గిరాజుకుంటున్నట్టు వేడి మొదలయ్యింది.

‘ చపాక రపాక చపాక రపాక ‘ మంటూనలిగిన  వడ్లగింజల పొట్టురాలి ముత్యాల్లాంటి బియ్యం బయటపడుతున్నాయి. ఆయన కుర్చీ…
పూర్తిగా »

బోరచెక్కు

బోరచెక్కు

ఈస్టర్పండగని అప్పుసొప్పుజేసి కొన్నకొత్త గుడ్డలేసుకొని, పొద్దున్నే కొండ దగ్గరున్న దేవుడి సిలువ దగ్గరకు నడిచెల్లి, మద్యాన్నమయ్యాక అన్నాలు కూరలు తిని, తరువాతప్రార్దనకెళ్ళి, రాత్రి పల్లెలో కుర్రోళ్లు వేస్తున్న దేవుడి నాటకాలు చూసి అలసిపోయిన ఆ వూరి ప్రజలు ఒంటి మీద సోయలేకుండా నిద్రపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈస్టర్ పండగరోజు సమాధి నుంచి లేచిన దేవుడు కూడా నిద్రపోతున్న సమయమది. రేపొదున్నే కత్తేసు కోయ్యబోయే దున్న కుర్ర మాంసాన్ని ఊహించుకుంటూ, పనికిరాని దొబ్బల్ని పడేసే దిబ్బ దగ్గర కూసోని దొరకబోయేదొబ్బల్ని ఎలా దొబ్బి తినాలో ఆలోచించుకుంటూ, నిద్రను చెడగొట్టుకొని మరి ఊరంతా కలియ తిరుగుతున్న కుక్కల అరుపులచప్పుళ్ళు తప్ప ఇంకే శబ్దము వినపడడం లేదు మావూళ్ళో…
పూర్తిగా »

తెల్లతాచు

ఎర్రపంచె గుర్తుకొచ్చింది విశ్వనాథానికి. “ఎందుకు కట్టుకోవు నాన్నా” అంటాడుశేఖరం. పన్నెండేళ్ళు లేని పిల్లవాడికి తను ఎందుకు కట్టుకోకూడదో చెప్పినా అర్థం కాదు. “అవును నాన్నా. కట్టుకో. ఆచార్లుగారు కట్టుకుంటే ఎంత బాగుంటుందో” అంటుంది వాడి అక్క ప్రియంవద.
పూర్తిగా »

సాక్షి

జూలై 2017


ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం బ్లూమూన్ బార్‌లో కలుసుకోవడం మా నలుగురి అలవాటు. మత్తు శరీరాన్ని మాయ చేసి, మనసు పైకి తొంగి చూసినప్పుడు ఎవరో ఒకరం “గుర్తుందిరా! చిన్నప్పుడు మన ఊర్లో… ” అంటూ మొదలు పెట్టి హఠాత్తుగా ఆగిపోయేవాళ్ళం. ఎక్కలేని అడ్డేదో ఎదురయితే వెనక్కి గింజుకునే గుర్రంలా బెదిరి పోయేవాళ్ళం.

అలా ఏనాడు తలుచుకున్నా మా నలుగురి మాటలు ఊరి పొలిమేరలని దాటి ముందుకు వెళ్ళడానికి సంశయించేవి. కారణం విశ్వం. అలాంటిది ఈ సాయంత్రం వాడి ఊసే మోసుకుంటూ వచ్చాడు మా ఊరి రత్నం.

గ్లాసులు పైకెత్తి చీర్స్ చెప్పుకుంటుండగా వచ్చి “ఈ రోజు మధ్యాహ్నం విశ్వం పోయాడుట. తెలుసా మీకు”…
పూర్తిగా »

షికారి

గప్పుడు పొద్దుగూకి నాలుగొట్టిండ్రు కావచ్చు. నేను గప్పుడే బడి కాడ్నించి అచ్చిన. బాపు కుక్కి మంచంల కూకోని ఏందొ ఆలోచన జేత్తండు. అమ్మ అంటింట్ల యేదొ సగవెడ్తంది. శాయ్ వెడ్తున్నదో ఏందొ, గిన్నెల సప్పుడు గలగల ఇనవడ్తంది. ఇంట్ల ఎవ్వలు లేరు, మే దప్ప. అన్నలు పట్నంల సదువుకుంటున్నరు. అక్కలు పెండ్లిల్లు చేసుకోని అత్తగారింటి కాడ ఉంటున్నరు. పండ్గకో పబ్బానికో అత్తరు. గప్పుడు ఇల్లంత కలకల లాడ్తది.

నేను అంటింట్లకు అరుగు మీదికీ కోడ్రిగానోలె అటూ ఇటూ తిర్గుతన్న. నా మన్సంత ఇంటి ముందటి బజార్లనె ఉన్నది. ఎప్పుడు నా దోస్తులు రామడు , రవిగాడు, రాయేశడు అత్తరా – ఎప్పుడు ఆల్లతోని శిర్రగోనె, పెండల…
పూర్తిగా »

రెండు రచయితల కథలు

జూన్ 2017


రెండు రచయితల కథలు

అతను చనిపోయాడని పేపర్లో జిల్లా పేజీలో చదివాను. ప్రమాదాలూ, నేరాల వార్తల మధ్య వచ్చిన ఆ వార్తలో అతనో రచయిత అని కూడా ఎక్కడా లేదు. “రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి” అన్న హెడింగ్ కింద ఇచ్చిన వివరాల్లో అతని అరుదైన పేరూ, వయసూ, ఉద్యోగమూ ఉన్నాయంతే. మరుసటి వారం సాహిత్య పేజీల్లో స్నేహితుడైన ఒక రచయితా, ఒక విమర్శకుడూ రాసిన నివాళి వ్యాసాలు తప్పితే ఇంకే చప్పుడూ లేదు. అతను రాసింది కూడా తక్కువే మరి. ఐదేళ్ళ క్రితం పన్నెండు కథలతో మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత పత్రికల్లో తొలి నవలా, ఐదారు కథలూ అచ్చయ్యాయి. పుస్తకాల షాపులో పేరు చిత్రంగా అనిపించి అతని…
పూర్తిగా »

ఫైండింగ్ డోరీ

ఫైండింగ్ డోరీ

వారంలో రెండు రోజులు నా సొంతమని ప్రతీ వారం అనుకుంటాను. భ్రమ కాకపోతే ప్రవాహంలో పడ్డాక మన ప్రమేయం ఏముంది? తెల్లవారకుండానే సెల్ మ్రోగుతుంటే నిద్ర కళ్ళతో తీసి చూసాను, సేథీ నుండి ఫోను, “శికూ! అర్జెంట్ పని మీద హ్యూస్టన్ వచ్చాను, తిరిగి మధ్యాహ్నం వెనక్కి వెళ్లిపోవాలి కాస్త గలేరియా దగ్గర స్టార్బక్స్ కి రాగలవా?” అనడిగాడు. వేరొకరయితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడిని, ఫోన్ చేసింది సేథీ! “రాగలవా…ఏమిటి? అరగంటలో అక్కడుంటాను.” అని లేచాను.

“మాడ్రిడ్ కాన్ఫరెన్స్ అద్భుతంగా జరిగింది!”, “అమెజాన్ అడవులలో నేను, అనూ…”, “మై స్వీట్ హోమ్ ఇన్ బ్లూమ్ ఫీల్డ్…” అంటూ సేథీ ఫెస్బుక్ పలకరింపులు తప్ప…
పూర్తిగా »

డెజిగ్నేటెడ్ పార్ట్⁠నర్

డెజిగ్నేటెడ్ పార్ట్⁠నర్

ఇనార్బిట్ మాల్ పార్కింగ్ లాట్లో బైక్ యెక్కడ పార్క్ చేసానో జ్ఞాపకం లేదు. సినిమా హడావిడిలో లెవల్ 1 లో పార్క్ చేసానో, లెవల్ 2 లో పార్క్ చేసానో, వ్యాలే పార్కింగ్ ఇచ్చానో అసలు పార్క్ చేసానో లేదోనని నా సబ్కాన్షస్ డేటాబేస్ ని క్వేరీ చేస్తుండగా ఫోన్ రింగ్ అయ్యింది.

“హలో!…” అన్నాను.

“క్రిష్ణా, ఆదివారం ఇంటికి రారా. ఓ పెళ్లిసంబంధం వచ్చింది. పిల్ల మేనమామ నిన్ను చూస్తడట.”

ఫోన్లో అమ్మ చెప్పటం పూర్తి కాలేదు. “సండేనా? కుదర్దమ్మా.  క్రికెట్ మ్యాచుంది. అయినా మేనమామతో పెళ్లి చూపులేమిటమ్మా?

నేనా టైప్ కాదు.” అన్నాను.

“ఊకో పోడా.  పని మీద మన ఊరు…
పూర్తిగా »