టేబుల్ మీద తెల్లకాయితం బోసిపోయి నెల రోజుల నుంచి అట్లాగే రెపరెపలాడుతుంది. డెస్క్ టాప్ మీద draft.docx, పదాలు వలసపోయిన ఖాళీ పోయెంలా పడుంది. ఎప్పుడూ రింగురింగులుగా నీ చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పి, ఆలోచనకి ఓ రూపాన్నిచ్చి, పదాల పరదాలవెనక నవ్వుతూ ఫెడ్ అయ్యే సిగరెట్ పొగ, ఇప్పుడు ఏ ఆకారమూ లేని పొగ మంచులా ఏటవాలు కిరణానికి ఉరేసుకుంటుంది. ఒడ్డున పొద్దున్నే బయల్దేరాల్సిన Inspiration బొట్ చిల్లుపడి చల్లటి నీళ్ళను చిమ్ముతుంది. ఆలోచనలు గడ్డకట్టి నరాలు చిట్లిపోతున్నాయి. చిన్న చీమంత ఫాంట్ సైజుతో మొదలైన ఆ రెండు పదాలు ఏనుగంత ఎదిగి పెనుభూతమై కౌగిలించుకుంటున్నాయి.
“writer’s block”
“writer’s block”
“writer’s block”
కవి కళ్ళు పొడిచేసి, వేళ్ళనించి రక్తాన్ని పీల్చుకుని తాగే కనపడని దయ్యం ఇది!
***
ముప్పై ఏళ్ళ మైలురాయి కావచ్చు, నలభై కావొచ్చు. ప్రతీ మనిషి జీవితంలో ఎదో ఓసారి ఆ మైలురాయి మీద కూచుండి వెనక్కి తిరిగి చూసుకుంటాడు. గడిచిన జీవితాన్ని తలుచుకుంటూనో, నడవబోయే ప్రయాణాన్ని అంచనా వేసుకుంటూనో, మరిచిపోయిన గమ్యాన్ని గుర్తుచేసుకుంటూనో ఆలోచనల గడియారానికి కుంజీ ఇస్తూ కాసేపు కూర్చుండిపోతాడక్కడ. కవి కూడా అంతే. ఒకటో రెండో సంకలనాలు వేసింతర్వాత వెనక్కి తిరిగి ఇప్పటివరకు ఏం రాసాం, ఏం రాయాలనుకున్నాం, ఇకముందు ఏం రాయాలి అన్న ఆలోచనలో పడతాడు. రాసిందే రాస్తున్నామనో, రాయాలనుకున్నది రాయలేకపోతున్నామనో ఒక సందిగ్ధంలో పడిపోతాడు. రాసిన ప్రతీది తన లోలోని inner critic చేతిలో చిత్తుగా ఓడిపోతున్నప్పుడు, ఇప్పటి వరకు రాసినవన్నీ ఒకే పద్యాన్ని తిరగ రాసినవేనా అనిపించినపుడు, ఒకప్పుడు దేవకన్యలా కనిపించి ఒక్క మనకే స్వంతం అయిన కొన్ని వాక్యాలు/పదాలు, ఇప్పుడు అరిగిపోయి అందాన్ని కోల్పోయినట్టు కనిపించినపుడు, ప్రతీ రచయిత ఒక స్థబ్దతకు లోనవుతాడు. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఏ గురుతుల్యునికో ఫోన్ చేసి మందు అడగాలా? ఏ డాక్టర్ దగ్గరకో వెళ్లి block అయిన creative గుండెకు నాలుగు స్టెంట్స్ వేయించుకోవాలా?
ఏం చేయాలి?
ఏం చేయకూడదు?
***
జీవితం మనం మనకే ఇష్టంగా రాసుకుంటున్న ప్రేమలేఖ లాంటిది. గబుక్కున లాక్కుని లక్కముద్దెరెప్పుడేద్దామా అని కొంటె కాలం ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటుంది. కాలం మింగేస్తుందని జీవించడం మానం కదా! జీవితం లాగే రాయడం అనే ప్రక్రియ కూడా ఒక నిరంతర యుద్ధం లాంటిది. అయితే ఈ యుద్ధం బతుకుదెరువు కోసం చేసేది కాదు. ఇష్టంగా చేసే యుద్ధం. అందుకే ముందు మనల్ని మనం ప్రేమించుకొగలగాలి. మన రాతల్ని ఇష్టపడాలి. మన కోసం మనం రాసుకోగాలగాలి. Writing కి మనకి మధ్య ఉన్న ఆ love-hate అనుబంధాన్ని కాస్త దువ్వి love-love గా మార్చుకోగలగాలి. ఇదంతా జరగాలంటే ప్రేరణ కావాలి, నిబద్ధత కావాలి, రాయడం అవసరం అనుకోగాలగాలి, అన్నిటికీ మించి ఎదురుచూసే ఓర్పు కావాలి.
“writer’s block” వల్ల చెడు కంటే మంచే ఎక్కువ జరుగుతుంది. రాస్తూ రాస్తూ ఆగిపోవడం వలన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం దొరుకుతుంది. మరింత చదివే వీలుకలుగుతుంది. మనం రాసినవి మళ్ళీ చదువుకుని ఆత్మావలోకనం, ఆత్మవిమర్శ చేసుకోడానికి ఒక మనదైన time block ని ముందు ఉంచుతుంది.
ప్రముఖ కవి Billy Collins ఒక రేడియో ఇంటర్వ్యూలో ఏమన్నారో చూడండి:
Radio Host: Billy, what do you do on those days when it just doesn’t come to you?
COLLINS: Oh, the – poets do the thing – we’d go to the dry cleaner. I mean, the usual stuff. Well, I wait. I mean, I – there’s this term, writer’s block. I – I don’t believe in it. I don’t like to even hear the term. I mean, you can’t be writing constantly because you’d be insane. So there must be periods of non-writing.
And then it’s just a matter of how do you view them? And I just view them as I’m – I’m waiting. Waiting for something to come along. And I think that’s a kind of healthy way, rather than thinking I’m not writing. That means I’ll never write.
“writer’s block” అనేది ఉత్తి భ్రమ అనీ, అది మనం ఊహించుకునే దయ్యం లాంటిదనీ, అసలు ఈ writer’s block అనేది నిజానికి ఉండనే ఉండదు అని కొంతమంది రచయితల అభిప్రాయం. అయితే ఈ స్థితి ప్రతీ రచయిత తన జీవితంలో ఎప్పుడో ఒకసారి అనుభవించే ఉంటాడు అనేది నా అనుమానం. ఈ writer’s block ని అధికమాసంలా అనుకోకుండా వచ్చిన ఒక time block గా మార్చుకోవడానికి రచయితగా నిలదొక్కుకుంటున్న మీరైతే ఏం చేస్తారు?
రవి గారూ,
మీ సంపాదకీయం ఉపోద్ఘాతమే ఒక కవితలా ఉంది. అభినందనలు. మనిషి ప్రకృతిలో భాగం అనుకుంటే, ప్రకృతికున్న లక్షణాలనుండి అతను అతీతుడుగా బతకలేడు. రచయితలుకూడా అంతే. వాళ్ళు Flora , వన సంపద లాంటి వాళ్ళు. అక్కడ చిన్నచిన్న మొక్కలదగ్గరనుండి మహావృక్షాలదాకా, మూణ్ణాళ్ళ ముచ్చటనుండి యుగాలదాకా బ్రతకగలిగిన చెట్లు ఉన్నాయి. అది రచయిత సీడ్ (విత్తన ) దశలో సంపాదించుకోగలిగిన రచనా సామగ్రి విలువా, పుష్టీ, విస్తృతిమీద ఆధారపడతాయని నా నమ్మకం. ఒక పాదు దాని ఋతువు అయిపోగానే కుక్కమూతి పిందెలే పెడుతుంది. కొందరు హుద్ హుద్ లాంటి తుపానులనైనా తట్టుకుని చిగురించగలరు. serious writer రెండు రచనల మధ్య విరామాన్ని విశ్రాంతి గా భావించడు. తిరిగి కురియడానికి ఎదురుచూసే మేఘంలా సముద్రాలమీద ప్రయాణం చేస్తూ నీటిని పోగుచేసుకుంటాడు. Every work of art should leave the artist with a little amount of dissatisfaction at the end of his work. From that springs the inspiration for the next work.
అభివాదములతో
రైటర్స్ బ్లాక్ భ్రమ కాదు నిజం. అదొక స్థితి – స్తబ్ధత. ఆ స్తితిలో ఇన్నర్ క్రిటిక్ విజ్రుంభించేసి పాత రాతలపై రెడ్డింకుతో ఎడా పెడా గిసేసి కూసంత న్యున్యతను కారణమవుతూనే, ఆక్కడ ఇక్కడ జల్లిన కొన్ని భావాలను, అక్షరాలను ఆర్తిగా తడిమి హత్తుకుంటాడు. ఆలోచనలు మనలో భాగామయినట్టే రాయటం కూడా మన అంతర్భాగం. ఏదో సంధర్భంలోనో, మరేదో భావనో రాయకుండా ఉండలేని స్తితిని కల్పిస్తుంది. ఒక సుధీర్గ బ్లాక్ తర్వాత వుప్పోగే అక్షరాలకు ఆనకట్ట వెయ్యటం బహుసా రచయితకు కూడా సాధ్యం కాదనుకుంట.
రైటర్స్ బ్లాక్ …అబ్బా ఇదేదో బియ్యం లో రాయి ఐతే ఎంత బాగుండును ,ఇంతింత కళ్ళేసుకుని ,ఏరి పడేయొచ్హు ,కానీ ఇది అలా కనిపించేది కాదు ,సుడులు సుడులు గా ఊహలు ,ఆలోచనలు మస్తిష్కం అనే ఆకాశం లో పడిపోతున్న ఉల్క ల్లా గా తిరుగుతూ ఏదో ఒక బ్లాక్ హోల్ లో పడిపోతూ ఉంటే ,చాతకాని తనం తో నేను ఆ బ్లాక్ హోల్ అయినా బాగుండునే అని విలపించే వింత పరిస్థితి ..
ఏమవుతాయి ? ఇలా మెరిసి అలా మాయం అయిపోయే ఐడియాలు ? కథలన్నీ కంచి కి వెళి పోతాయిట ,పోనీ అక్కడకి పోదామా ? అనిపించేస్తుంది , మన మాటలు అన్ని ఒక గోడ కి అతుక్కుని ఉంటాయి ట ( సౌండ్ ఎనెర్జీ ) అలా ,ఇవన్ని యే సముద్రం ఒడ్డున విరిగిపోయిన గవ్వల్లా ,బెంగ గా పడి ఉంటాయి ?
అబ్బ బ్బా …ఈ పైన్ ఇంతా అంతా అని కాదు , మన మాటలు మనమే మింగుతూ , కాగితం ,ఇప్పుడు అయితే కంపూటర్ కీ బోర్డ్ మీదకి ఎక్కించలేక ,మాటలు అంటే ఒట్టి మాటలే కాదండోయ్ ,మళ్ళీ అర్ధం ఉండాలి, భాష మరీ బాగుండాలి ..ఇలా నిరంతరం ,రాస్తూ ఉండి పోవాలి అంటే మటుకు ,ఎవరి వల్ల అవుతుంది అండీ ?
జీవితపు పరుగులో ..మరి అలసటో ? ఇన్నేసి దాటుకుంటూ ,మధ్యలో కథ ల గీత టచ్ చేస్తూ ఉండాలి అంటే ,చాలా ఉండాలి అండీ మనిషికి ..చాలా వస్తువు ఉండాలి మనిషి లో ..అదండీ సంగతి ..
అదే మరి బ్లాక్ ..అనుకుంటూ ,ఏదో అల్ప ప్రాణులం ..పేర్లు కేం ఎన్నైనా పెట్టుకోవచ్చు ..
వసంత లక్ష్మి .
రవి గారూ!
భలే తమాషా ‘అంశం’ లేవదీసారు సార్ మీరూ! రైటర్స్ BLOCK లో ..ఐ మీన్ సెక్షన్ లో చేరే అదృష్టవంతులకు కదా మీ రైటర్స్ బ్లాక్ సమస్యా?! కాగితం కనబడక పోయినా రెచ్చి పోయే, కలం కనబడకపోయినా వేలి గోళ్ళతోనైనా చెట్ల బోదెలమీదా, ముందు సీట్ల వీపుల మీదా, గోడల మీదా బుర్రకు తట్టింది గీకకుండా ఉండలేని మా లాంటి నిత్య చైతన్య సృజన మూర్తులనుంచీ మీరు.. మీకులాగా ఈ బ్లాక్ బాకులతో.. చాకులతో విలవిలలాడే అపురూప .
కవులంతా నేర్చుకోవాల్సింది చాలా ఉంది సుమండీ! అతి సీరియస్, అత్యంత కమిటెడ్.కనకనే మీ వంటి కవులు లిమిటెడ్.. మీవంటి వారి నుంచి వచ్చే కవిత్వం లిమిటేడ్! బమ్మెర పోతనామాత్యుడికే తప్పలేదీ రైటర్స్ బ్లాక్.. పద్యం మధ్యలో పదం కుదరక పక్కన పడేసి పోతే ఆ శ్రీరామచంద్ర మూర్తే స్వయంగా దిగివచ్చి పోతన వేషంలో తన మీద పద్యం తానే పురించుకుని పోవాల్సి వచ్చింది. భగవంతుడంతటి వాడిని భూమ్మీదకు మారువేషంలో రప్పించిన ఈ రైటర్స్ బ్లాక్ రావణబ్రహ్మ కన్నా దుర్మార్గమైనదే సుమండీ!
నిజమేనండీ క్రికెటర్స్ ఫామ్ కోల్పోయినట్టు రైటర్స్ కూడా ఈ అచేతనావస్థకు గురవుతారు. నాకు నేను ఇలానే ఫీలవుతున్నా. మొనాటనీకి గురయ్యానన్న ఫీల్ తో రాయడానికే భయపడుతు. రాసిందే రాస్తున్నామన్న ఫీల్. దీనిని అధిగమించాలంటే నిత్యమూ మన చుట్టూ వస్తున్న మార్పులు సామాజికంగా వ్యక్తిగతంగా వస్తున్నవాటిని సరిగా అధ్యయనం అవగాహన చేసుకోవడమే. చెప్పినంత ఈజీగా జరగకపోవడం నాకు మటుకు నా వైఫల్యమే అనిపిస్తోంది. మంచి టాపిక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు రవి సార్..
కవి మెళకువతో ఉంటే ఈ బ్లాక్స్ అడ్డు రావు. కవి కలంతో కాలంతో కలసి నడవాలి.