వ్యాసాలు

ద్వంద్వపదాలు

ద్వంద్వపదాల వినియోగం తెలుగు భాషలో ఉన్న విశిష్టతల్లో ఒకటి. విద్యార్థి కల్పతరువు అను ఆంధ్రభాషా విషయసర్వస్వం పేరుతో, వేంకట్రామ అండ్ కో వారు 1979 లో ప్రచురించిన గ్రంథంలో, వీటికోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంది.  1980 లో వెలువడ్డ అయిదో ముద్రణలో, 686-687 పేజీల్లో ఈ ద్వంద్వపదాల పట్టికని వాటి అర్థాలతో సహా చూడవచ్చు. ఈ పట్టికలో ఏకంగా 102 ద్వంద్వపదాలున్నాయి. దీనితో పాటు జంట పదాల పట్టిక కూడా వాటి అర్థాలతో 672-682 పేజీలవరకూ చూడవచ్చు.

జంట పదాలంటే ఒకేరకంగా ధ్వనిస్తూ, వేరే అర్థం ఇచ్చే పదాలు. తెలియక మరోరకంగా రాస్తే అపార్థం ధ్వనించే పదాలు. ఉదాహరణకు అంకిలి, అంగిలి. అంకిలి అంటే…
పూర్తిగా »

తెలుగు కథలో భాష

ఏ సాహిత్యప్రక్రియలో వాడిన పదాలయినా, పదబంధాలయినా పాఠకుడు సులభంగా చదవగలగాలి. అది సౌకర్యంగా జరిగితేనే; తెలిసిన అర్థాన్ని, తెలుసుకున్న అర్థాన్ని వాక్యానికి అన్వయించుకుని అంతర్లీన భావాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఈ మధ్య నేను చదివిన ఒక తెలుగు కథలో 769 ఇంగ్లీషు పదాలు ఉన్నాయి. దీనికి తోడు ఒక ఇంగ్లీషు పదానికి మరో తెలుగు పదాన్ని ముడెయ్యటం. టేబిల్మీద అలాంటి ప్రయోగాల్లో ఒకటి.  అదే పెద్ద ఇబ్బంది అనుకుంటున్న దశలో, నాలుగు ఇంగ్లీషు పదాలకి పీటముడి వేసి, సంథింగీజ్రాంగ్ అని కొందరు మాత్రమే పలికేలా రాయటం, మూలిగే నక్కమీద తాటిపండే కాగలదు.
పూర్తిగా »

రూపు

జూన్ 2016


రూపు

అనగనగా - గిరిక అనే ఓ అందమైన తెనుగు ప్రబంధనాయిక. ’అందమైన’ అంటే సాదా సీదా అందం కాదు. వెన్నెల వెలుగుకే తట్టుకోలేక ఎలుగెత్తి శోకాలు పెట్టేంత సుకుమారి. జ్యోతిష్య,వ్యాకరణాది శాస్త్రాలను ఔపోసన పట్టిన మహా పండితుని కలం నుంచి జాలువారిన ముగ్ధ. సంస్కృతంలో అయితే ’తన్వి’. ఆ అమ్మాయి కోనలమధ్యన కేళీమందిరంలో కూర్చుని వీణ వాయిస్తూంది. ఆ వీణానాదాన్ని అధిష్టానపురపు రాజు విన్నాడు. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనుక్కుని రమ్మని తన అనుంగుమిత్రుణ్ణి పంపినాడు. ఆ నర్మసచివుడు వచ్చి, ఆ అమ్మాయిని కాస్తా చూశాడు. చూసి వచ్చి తన మిత్రుడు, యజమాని అయిన మహారాజుకు ఆమె అందం గురించి సుదీర్ఘంగా చెప్పాడు.
పూర్తిగా »

కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయము – మొదటి ప్రతీకాత్మక భారతీయ నాటకం.

మే 2016


ఒక గహనమైన సిద్ధాంతాన్ని కానీ, క్లిష్టమైన సందేశాన్ని కానీ చెప్పాలనుకున్నప్పుడు ప్రతీకను (Allegory) ఉపయోగించటం- భారతదేశంలో వేదకాలమంత పురాతనమైనది. దీనికి దృష్టాంతంగా ప్రాచీన ఉపనిషత్సాహిత్యంలో, ముండకోపనిషత్తులోని ప్రముఖమైన శ్లోకం ఇది.

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే |
తయోరన్యః పిప్పలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి ||

ఒక చెట్టుపైన రెండు పక్షులు ఉన్నాయి. క్రింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది మధురమైన పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దుఃఖాన్ని పొందుతున్నది. రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొని చూస్తూ, సుఖదుఃఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంది.

వృక్షం – జీవునికి,…
పూర్తిగా »

లజ్జాగౌరి

జనవరి 2016


లజ్జాగౌరి

కర్ణాటక రాష్ట్రంలోని బాగల్ కోట జిల్లా, చరిత్రకూ, సుందరమైన మలప్రభా నదీపరీవాహక ప్రాంతానికి, కస్తూరి కన్నడ భాషా సౌరభాలకు ప్రసిద్ధి. ఒకప్పటి చాళుక్యుల రాజధాని అయిన బాదామి (వాతాపి) ఆ జిల్లాలోనే ఉంది. నాడు ఆ రాజులు కట్టించిన గుహాలయాలు, చుట్టుపక్క ప్రాంతాలలోని దేవాలయాలు నాటి ప్రాభవానికి సజీవ సాక్ష్యాలుగా నేడు నిలిచి ఉన్నాయి. ఇక్కడి పట్టదకల్లు దేవాలయప్రాంగణాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.

చాళుక్యుల కాలం నాటి కొన్ని అవశేషాలను బాదామిలో ఒక సంగ్రహాలయంలో భద్రపరిచారు. ఆ మ్యూజియమ్ లోనికి ప్రవేశిస్తూనే ఒక వింత స్త్రీమూర్తి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం పేరు “లజ్జాగౌరి”. ఇదే విగ్రహాన్ని తెలంగాణాలో అలంపురం మ్యూజియమ్ లో…
పూర్తిగా »

రంగనాయకమ్మ రచనల్లో ప్రేమ

జనవరి 2016


రంగనాయకమ్మ రచనల్లో ప్రేమ


సమకాలీన స్త్రీపురుషుల సంబంధాల గురించి రంగనాయకమ్మగారి కథలను ఉదాహరించి నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె కథల పరిచయమో, లేక ఆమె శైలీ, రచనా విధానం వంటి మరే అంశాల గురించి చర్చించడమో ఈ వ్యాసం ఉద్దేశం కాదు. స్త్రీ పురుషుల ప్రణయ సంబంధాలూ, వారి సాహచర్యం (companionship), అన్యోన్యతా (compatibility), విలువలూ, సంస్కారాలూ, పరస్పర గౌరవాలూ… ఇలా వీటి గురించి ఆమె లేవనెత్తిన ప్రశ్నలూ, వాటికి సంబంధించిన చర్చా, పరిష్కారాలకు ఆమె అన్వేషించే మార్గాలూ… వీటిని గురించి మాత్రమే ఇక్కడ ప్రస్తావించ దల్చుకున్నాను.

గత పది పదిహేను సంవత్సరాల్లో ప్రధానంగా నేను గమనించిన మార్పు ఒకటుంది. అదేమిటంటే, ‘వివాహ బంధం, ప్రేమ బంధం’-…
పూర్తిగా »

మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు

అక్టోబర్ 2015


మేధకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిళ్లు

మెదడుకు ఉత్తేజాన్నిచ్చి, మేధ (intelligence)కు పదును పెట్టే ప్రక్రియ క్రాస్ వర్డ్ పజిల్. మతిమరుపు ముఖ్య లక్షణంగా గల Alzheimer’s disease ఈ రోజుల్లో ఎందరినో పట్టి పీడిస్తున్న సంగతి మనకు తెలిసిందే. దాని బారిన పడకుండా వుండాలంటే ప్రతిరోజూ సుడోకు, క్రాస్ వర్డ్ మొదలైన పజిళ్లను పూరించడం, కొత్త భాష(ల)ను నేర్చుకోవడం, శాస్త్రీయ సంగీతాన్ని వినడం, ఎడమ చేతితో దంతాలను బ్రష్ చేసుకోవడం, అరికాలునూ పాదాల వేళ్లనూ అన్ని దిక్కుల్లో వంచుతూ ఓ ఐదు నిమిషాల సేపు చిన్న వ్యాయామం చేయడం – ఇవన్నీ అవసరమని వైద్యశాస్త్రం చెప్తోంది. ప్రామాణికమైన క్రాస్ వర్డ్ లను పూరించడం మెదడుకు మేలును కలిగిస్తుందనటంలో అనుమానం లేదు. భౌతికమైన…
పూర్తిగా »

అ ‘సహాయ’ శూరులు

అక్టోబర్ 2015


అ ‘సహాయ’ శూరులు

పాత తెలుగు సినిమాలు చూస్తూ బాల్యపు జ్ఞాపకాలని తిరిగి జీవించడం- కృతకంగా ఉన్నా సరే, రకరకాల భావాలు అత్యంత స్పష్టంగా వాళ్ళ గొంతుల్లో పలకడం, ఒకే మనిషి అనేక సినిమాల్లో ముఖాలు రకరకాలుగా మార్చుకోవడం చూస్తూ అచ్చెరువొందడం- సినిమా రంగంలోని సహాయ పాత్రల జగత్తు లోని కొందరు ‘నిస్సహాయ, సన్నకారు జీవుల’ గురించి ఈ చిన్న రైటప్…

సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్న ఇన్సైడర్ వ్రాసింది కాదు ఇది. పాత తెలుగు సినిమాల్లోని భాషని వినాలనీ, ఆనాటి నటుల వాచకాలను తనివితీరా ఆస్వాదించేసెయ్యాలన్న ఆసక్తి ‘మితిమీరిన’ కొన్నిసమయాలలో- కేవలం సినిమాలను చూసిన అనుభవంతో వ్రాసింది. factual errors ఉండవచ్చు. క్షమించేసి, సమగ్రం కాని ఈ చిన్న…
పూర్తిగా »

చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass

అక్టోబర్ 2015


చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass

నిజ జీవితంలో నిలువుగా ఆరడుగులు పైన, అడ్డంగా నాలుగడుగులు ఉండే గుంటర్ గ్రాస్(Günter Grass) లాంటి రచయిత తను రాసిన ‘ద టిన్ డ్రం’ నవలలోని ప్రధాన పాత్ర అయిన ఆస్కార్ ని మాత్రం మూడు అడుగులు మించి ఎదగకూడని నిర్ణయించుకుని అలాగే ఉండి పోయే వాడిగా చిత్రించటం లోని ఆంతర్యం ఏమై ఉంటుంది. ఎక్కడయినా ఎవరయినా తనని తాను కావాలని కుంచించుకోవటం ఏ సందర్భంలో జరుగుతుంది.? కళ్ళ ముందు కొనసాగుతున్న దారుణమయిన పరిస్థితులను నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఎదిరించి పోరాడలేని సగటు మనిషి మానసిక దౌర్భల్యానికి బహుశా ఇది ఒక భౌతిక సంకేతం కావచ్చు. ఒక చెంప దెబ్బ కావచ్చు. ఒక మేలు…
పూర్తిగా »

అంతర్వేదం

సెప్టెంబర్ 2015


అంతర్వేదం

‘అంతర్వేది’ అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు – అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.

చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది అయిన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని – కనీసం వరద లేని…
పూర్తిగా »