భరించలేని ఇష్టాన్నైనా,
తెగించలేని మోహాన్నైనా
కంపించే ఆత్మను కబళించే శత్రువు
సైతానై తేనె నవ్వులతో గారడీ చేసినా!
బుర్రలో జోరీగలు రేపెడితే
కాగితమ్మీద దింపుకునే రాతలివి
ఎంత పొగిడినా నాకు తెలీదూ?
ఈ అక్షరాల అల్లికెంత తేలికో
వాటి వెనక ఆలోచనలు అంత బరువని
గాల్లో కందిరీగలు గీసిన గీతల్లా
శబ్ధం రాని గజిబిజి అరుపులు.
తెలిసీతెలియని స్తబ్దత నువ్వు
అజ్ఞానపు మొద్దు అంచుల్ని
సూటిగా అరగదీసే ప్రశ్నలతో నేనూ!
మొత్తానికి రాయలంటావు…
ఎలా? మన కళ్ళే కలవవు కదా
కలపాలంటే ఎంత చికాకో!
ఇక ఎదురుగాలేని సమయాల్లో
సాగే గడబిడలే రాయాలి
-
రేయ్ నార్సిస్ట్!
అవతలకు పోయేముందు ఒకసారి చూడు
నువ్వారోజు తన్నింది ఖాళీ కోకుడబ్బాని మాత్రమేనా?
జెన్నీ,
aren’t we supposed to be characters in a half finished novel that was never published?
శ్యాం
“What if we dislike or despise or hate poems because they are – every single one of them – failures? The poet and critic Allen Grossman tells a story that goes like this: you’re moved to write a poem because of some transcendent impulse to get beyond the human, the historical, the finite. But as soon as you move from that impulse to the actual poem, the song of the infinite is compromised by the finitude of its terms. So the poem is always a record of failure. There’s an ‘undecidable conflict’ between the poet’s desire to make an alternative world and, as Grossman puts it, ‘resistance to alternative making inherent in the materials of which any world must be composed”
so, why bother with “telling only truth”? isn’t all poetry truer than true – in other words, a beautiful illusion?
నాగరాజు పప్పు గారూ ,
This is the kind of response any poet expects from the reader.
I agree that every poem is a failure in the sense that what is reflected on paper is a minuscule of what was conceived in the brain at the moment of transcendent impulse in the first place, and further constrained in conveying whatever little that was written on paper by the finitude of the words. Words never convey the the truth. They always present the perception of the writer what he considers to be true. However, the success of the poem lies in its words being able to disturb the reader and churn his thoughts and prompts him to find his own truth ( ‘he’ here is gender neutral).
A written word unfortunately cannot explain its context or its import but just means what the word conveys to the people of its times (written). It conveys the same meaning always. With the expansion, contraction, change of meaning over time, people interpret it in different ways. This is the third dimension of failure of a poem.
Perhaps, Poem is not the place to look for truth. As you said it rightly, it is an illusion; and, people who willfully enter into it subject themselves or look for some vent for their pent up emotions or creative urge.
Thank you for your wonderful comment.
Jenny garu,
“గాల్లో కందిరీగలు గీసిన గీతల్లా … శబ్ధం రాని గజిబిజి అరుపులు. ” is a very good image that fits so well into the theme. Congrats.
Perhaps, the last 3 lines are redundant.
with best regards
నాకు ఇంగ్లీషు సాహిత్యంతో పెద్ద పరిచయం లేదు కాని ఇది చదవగానే మా ధూర్జటి గుర్తుకొచ్చాడు. “చాలున్ జాలు కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో! చీ, లజ్జింపరు గాక మాదృశ కవుల్” అన్న ధూర్జటే కాళహస్తిమాహాత్మ్యం అనే మంచి కావ్యాన్ని చెప్పిపోయాడు.
అంచేత – అవును నిజంగా రాయాల్సిందే (నిజమే రాయాలని లేదు).
శబ్ధం రాని గజిబిజి అరుపులే ఒకోసారి లోపలి స్తబ్ధతని బద్దలుకొడతాయి.
murthy gAru – thank you.
కామేశ్వరరావుగారు – మీ వ్యాఖ్య చూసాక, నాక్కూడా ఏది సత్యమో చెప్పిన వరూధిని మాటలు గుర్తుకొచ్చాయి:
“ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వృతిం జెందుం కుంభగత ప్రదీపకళికాశ్రీ దోప నెందెందు పో కెందే నింద్రియముల్ సుఖంబు గను నా యింపే పరబ్రహ్మ, “మా నందో బ్రహ్మ” యటన్న ప్రాజదువు నంతర్బుద్ధి నూహింపుమా” ..
ఆ ఆనందో బ్రహ్మని అంతర్బుద్ధితో ఊహించడం కంటే కవిత్వానికి పరమావధి ఏముంటుంది?
గాల్లో కందిరీగ గీసిన శబ్దంరాని అరుపులు — ఇది ఒక నేరూడా కవితని గుర్తుకు తెస్తోంది ఎందుకో..
పైన వ్రాసిన అన్ని లైన్ల సారాంశాన్నీ,
ఆఖరి లైన్ మరింత మిన్నగా ఎలివేట్ చేసింది.
సూపర్బ్ …
అభినందనలు …
బాగుంది. మెహెర్ రాసినట్లు అనిపించింది. జెన్నీ అనేది మెహెర్ కలం పేరా?