నీ జ్ఞాపకం
తలెత్తి
ఆకాశాన్ని చూస్తే
మధ్యాహ్నం చందమామ
సగం నవ్వు నవ్వింది!
***
బద్ధకపు నడకలో
మన అడుగుల చప్పుడు
లయ కుదరగానే
తటిల్లున
నిశిరాత్రిలో
ఒక ఉద్యానవనం మెరిసింది!
***
బాల్కనీలో కుండీల తోట
ఎగిరొచ్చి వాలిన బుజ్జిపిట్టవి నువ్వు!
నా దోసిట్లో కబుర్ల గింజలు
భుజంమీదెక్కి నిక్కి చూసే
గారాల కూనా…
ఇలా ముంజేతిపై వాలు
నీ ఈకలు సవరించి
నా కన్నీటి చారల్ని చెరిపేసుకుంటాను
నిండైన కవిత్వం ఈ కవిత చదువుతూ నా అంతరంగాన్ని తడుముకుంటాను