కవిత్వం

After all, You are a faded memory!

అక్టోబర్ 2016

వును కదా!
వెల్కమ్ డ్రింక్ లు తాగేసి
ఫేడెడ్ జీన్స్ మ్యాచ్ అయ్యాయని మురిసిపొతే సరా ?
ఒంటరి స్నేహగీతికలు ఆలపించి ఎవరిని మభ్యపెట్టినట్లు?

పొగడ్తల ఆవల మసకగా కనిపించేదేదో
ఇద్దరమూ చెప్పుకోము, కానీ కాస్త
రంగుల్లో గాఢతనో , చీర వెనుక మడతలనో
ఏదో ఒకటి, మాటలు గడవడానికి వాడుకున్నామా లేదా
మరి వేరువేరు దాహాలు తీర్చు మార్గం, ఇదేకదా!

ఇదిగో, కారణాలు అడ్డు పెట్టుకుని నేను నీకు ఇచ్చిన కానుక
ఎక్కువ కాలం దాచుకోవని తెలుసు కానీ
నాకు కూడా దానితో పెద్దగా అవసరం లేదనే తెచ్చాను
మొహమాటాలు పోయాక తెలియకుండా పడేస్తే వచ్చే నష్టమేమీ లేదు

ఆ ఇయర్ ఫోన్స్ తీసేయరాదూ, చివరగా ఈ రహస్యాన్ని చెప్పిపోతాను
నువ్వో ఎడారివి, నేనో సముద్రాన్ని. అరే, నవ్వుతావేంటి?

***

చెప్పుకోకపోయినా మనిద్దరికీ తెలుసు!
ఇంతాచేసి, నెమ్మదిగా ఒకరికొకరం
నిద్రపట్టని రాత్రులనుంచి
వెలిసిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతాము