కవిత్వం

The crazy “we”

అక్టోబర్ 2017

గాజు పగిలిన శబ్దానికి నిద్ర లేస్తుంది ఆమె
కిలకిలారావాల కలలు కావాలంటుంది

అప్పట్లో రెక్కలు తెగిపడ్డాయేమో చూడమనేది
అసలైతే ఆమె ఒక దూదిపింజె,
రాళ్ళ మధ్య చిక్కుకున్నదంతే

వలను వదిలిన వెర్రి పిచుక
నిజం చెప్పాక ఆమె ఫక్కున నవ్వింది
అడవంతా గాలి వీచింది

కలిసి ఎగిరామనే అనుకున్నాయి
చినుకులు పడేదాకా
మళ్ళీ కలిసే చోటు చెప్పుకున్నాక
ఒకటి తేలిపోయింది
మరొకటి దాగిపోయింది

వర్షం తగ్గాక
అదే చెట్టు కింద
రాత్రి ఇంకా తిరిగిరాలేదని
బెంగతో గడ్డి పూవు నలిగి
ఎండిన ఆకుపై వాలింది