ఈ ‘వాకిలి’ ఒక కల.
ప్రతి పత్రికా- అది అచ్చులో అయినా, అంతర్జాలంలోనయినా- అందమయిన కలతోనే పుడుతుంది.
‘వాకిలి’ కల మీతో అరమరికలు లేని సాహిత్య సంభాషణ! ఎలాంటి మొహమాటాలూ లేని, అచ్చంగా సాహిత్య విలువల మీది ప్రేమతో మాట్లాడుకోవడం! విమర్శనీ, ప్రశంసనీ సమహృదయంతో ఆహ్వానించే సహనాన్ని పెంచడం! జీవితంలోని కొత్త కోణాల మీద నిజాయితీతో నిండిన వెలుగుని ప్రసరించడం! స్వచ్చమయిన స్వేచ్చని గౌరవించే సాహిత్య సమూహాన్ని సమీకరించడం!
గత ఇరవయ్యేళ్లుగా తెలుగు సాహిత్యం సంశయ యుగంలోంచి నడుస్తోంది. ఏది సాహిత్యం అనేది పెద్ద సంశయం! అనేక రకాల సాహిత్య ధోరణులు కొన్ని సార్లు ఊపిరాడనీయని సందిగ్ధంలోకి కూడా తోస్తున్నాయి. ముఖ్యంగా అస్తిత్వ వాద ధోరణులు మన ముందు చాలా కొత్త ప్రశ్నల్ని నిలబెట్టాయి. కానీ, వాటికి సమాధానాలు వెతుక్కునే లోగా అవే సందిగ్ధంలో పడ్డాయి. ప్రశ్నలు మిగిలిపోయాయి, సమాధానాలు దొరకలేదు. ఈ స్థితిలో సాహిత్యం ఏం చేస్తుంది? ఇదే ఇప్పటి సంశయం. రచయిత కేవలం వాస్తవికతని ఫోటో తీసే ఛాయాచిత్రకారుడే అయితే, ఈ సంశయం లేకపోయేది. ఆ మాటకొస్తే, ఫోటోకి ఒక తాత్విక కోణం లేదని అనగలమా? ఫోటోని ఏ కోణం నించి తీస్తారన్న దాన్ని బట్టి ఆ వాస్తవికత మీద ఆ ఫొటోగ్రాఫర్ దృక్పథమూ తెలిసిపోతుంది కదా!
రచయిత వాస్తవికతని తనదయిన కంటితో చూస్తాడు. తనదయిన ఉద్వేగంతో, ఆలోచనతో ఆ వాస్తవికతకి ఒక ప్రత్యేకతని ఇస్తాడు. ఈ ‘తనదయిన’ చూపు అన్నది ఇప్పుడు మసకబారిపోతోంది. పొగమంచు లోకం మన ముందు అన్ని దృశ్యాల్నీ, అన్ని అనుబంధాల్నీ, అన్ని విలువల్నీ పరాయీగా మార్చేస్తోంది. అన్నిటికీ మించి, అసలు అవన్నీ జీవితానికి అవసరమా అన్న మరీ వ్యాపార/ భౌతిక పక్షపాత ధోరణి మనల్ని ముంచెత్తుతోంది. వీటికి అతీతంగా ఆకు మీది నీటిబొట్టులా వుండడం రచయితకి సాధ్యం కాదు. తన కాలాన్ని తన పరిసరాల్ని మరచిపోయే పరవశత్వం మంచి సాహిత్య లక్షణం కాదు. మంచి మనిషితత్వమూ కాదు.
ఒక సంశయాన్ని జయించి తన స్వరాన్ని నిక్కచ్చిగా వినిపించే సాహసం ఈ కాలం రచయితకి కావాలి. ఆ సాహసమే ఆ రచయిత తన పాఠకులకు ఇవ్వాల్సింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టగల, వ్యక్తిత్వంలోని అంతస్సూత్రాన్ని తెగిపోకుండా పదిలపరిచే భరోసా ఇవ్వాలి మంచి సాహిత్యం. ఇదంతా ఒక ఎజెండా ప్రకారం, ఒక పార్టీ తీర్మానం ప్రకారం జరక్కపోవచ్చు. రచయితలోని ఉద్వేగం, సున్నితత్వం తనకి తెలియకుండానే ఈ పనిచేస్తూ పోతుంది. ప్రకృతిలోంచి, బంధాల్లోంచీ, సమూహాల్లోంచీ, తన దినచర్యలోంచీ, వృత్తి వ్యాపకాల్లోంచీ రచయిత ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాడు. రచయితకి వున్న గొప్ప శక్తి ఏమిటంటే: అతని అక్షరం! అవి వాక్యాలవుతున్నప్పుడు కొన్ని భావాలని మోసుకెళ్తాయి. అవి కథలవుతున్నప్పుడు కొన్ని జీవితాల్ని తాకుతూ వెళ్తాయి. అవి కవితలయినప్పుడు కొన్ని అనుభూతుల్ని నరాల్లోకి ప్రవహిస్తూ వెళ్తాయి. ఇంకా వేర్వేరు రూపాల్లో వేర్వేరు అనుభవాలవుతాయి. ఏ రూపం తీసుకున్నా, అది ఒక జీవితం ఇంకో జీవితంతో పలకరించే సన్నివేశం. ఒక అనుభవం ఇంకో అనుభవంతో ముడిపడే సంభాషణ. అనేక మానవ సమూహాల మధ్య స్నేహ బంధాన్ని నిర్మించే కరచాలనం.
అలాంటి కరచాలనాల వెలుగులతో చీకట్లని జయించడం ‘వాకిలి’ కల. ఇది కేవలం ‘వాకిలి’ కల కాదు. రచయితలందరి కల. అలాంటి అనేక కలల్ని వాకిట్లో కూర్చోబెట్టి, సంభాషణ మొదలెట్టడమే ‘వాకిలి’ చేయగలిగింది. ఈ సంభాషణలో మీరూ వాక్యం అవ్వండి. మీ వాక్యాల లాంతరులో ‘వాకిలి’ని వెలిగించండి.
బహు పసందైన సాహితీ విందు…మా వాకిట్లో!
కొంత దాహార్తికి స్వాంతనం దొరికినట్లుంది!….కొంసాగింపుకు మా మద్దతు!
సంపాదకులు రవిగారికి నమస్కారం. మీ వాకిలి అంతర్జాల సాహితీ పత్రిక ఆవిష్కరణకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ పత్రికావిష్కరణ సంపాదకీయం లో మీరిచ్చిన లక్ష్య సందేశం ముదావహం. మీరు ఆ సందేశం లో యిచ్చిన వివరణ ఆకర్షించింది. నాకు అంతగా సాహితీ ప్రవేశం లేకపోయినా భాషాభిమానంతో తప్పకుండా చూసి చదువుతాను. మీ యీ ప్రయత్నం పత్రిక దినదినాభివృధ్ధి చెందాలని కోరుకుంటూ ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను.
నడ్చోచ్చిన వాకిలికి రన్గవల్లులతో మా ఆహ్వానం
శుభాభినందనలు. జయోస్తు.
శుభాభివందనాలు. విజయొస్తు. దిగ్విజయొస్తు.
మన కాలపు సవాళ్ళను మీరు మాటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. లోతైన విషయాల పట్ల ఆసక్తి, పరిచయం సంపాదకీయంలో కనపడుతున్నాయి. దీనికి ప్రణాళికా బద్ధమైన కృషి తోడు కావాలి. ఈ పత్రిక తన సాహిత్య కృషిలో సఫలమవ్వాలని కోరుతూ
ఈ వాకిలికి హార్దిక శుభాకాంక్షలు కవిత్వము కథలు మాత్రమే కాకుండా సాహిత్య విమర్శ తెలుగేతర సాహిత్యం గూర్చి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు బాగుంది. అన్నీ సమ పాళ్లలో ఉన్న మీ సారీ మన వాకిలి ఇక బంగారు లోగిలి కాగలదని ఆశిస్తూ….ప్రేమతో …జగతి
Subhabivandanaalu.meraj.
పత్రిక డిజైను కంటికింపుగా ఉన్నది. శీర్షికలన్నీ ఇంకా తీరిగ్గా చదవాలి. ముందస్తుగా ఈ ఆవిష్కరణ శుభవేళ అభినందనలు.
రవి గారూ మీ కవితా దాహార్తికి ఇలా ఓ సాహిత్య జలధిని సృష్టించి మాకూ యింత అవకాశాన్నివ్వడం బహుదా అభినందనీయం… మీ ఈ ప్రయత్నం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ…
హార్దిక శుభాభినందనలు
Good to see this magazine online! Is this a weekly or monthly? Best wishes for a successful and productive journey.
Regards
Uma
వాకిలి ఈ-పత్రిక సర్వాంగ సుందరంగా, సంక్రాంతి నాటి ‘ముగ్గులతో కొలువు తీరిన తెలుగింటి వాకిలి’ని తలపించింది.
మీ అభిరుచికి జోహార్లు.
వాకిలి పురోభివృద్దిని కోరుకుంటూ,
నారాయణ గరిమెళ్ళ.
I just came to know about VAAKILI. It is very atractive and interesting. My congratulations to all of you, and wish you a grand success.
ఈ వాకిట్లొకి ఇప్పుడే వచ్చాను, చాల రకాల గాయాల గేయాలతో వచ్చాను.
శ్రీశ్రీ వలె ప్రపంచ బాధను తన బాధగా పలవరిస్తున్న కవులను కలుద్దామన్న ఆశతో వచ్చాను నెను విశ్వమాన్వత్వాన్ని మాత్రమే కవిత్వంలో ఆనందించ లేక పొతున్నా..అణచివేతలు పాతవే అయినా, అత్యాచారాలు పాతవే అయినా కొత్త హింసను అనిభవిస్తున్నా దానికి సానుభూతి మాత్రమె సరిపొదని భావిస్తున్నా. ఆ దిశగా ఉద్యమ కవిత్వాన్ని ఆ దిశా నిర్దేశం చెసి చట్ట సభల్లో మార్గనిర్దేశం చెయ గల కవిత్వం ఈ వాకిలి లో లభిస్తుందని ఆశిస్తున్నాను
mee VAAKILI ..REPATI TARAANIKI SAAHITYA ABILAASHANU …SAAHITYA ABHIVYAKTINI PENCHAALANI AASISTUNNAANU
Congratulations! May thousand flowers bloom in the Vaakili in the New Year.
ఒక్క మాటలో చెప్పాలంటే వాకిట్లోకి రాగానే చల్ల గాలి తగిలినట్లు హాయిగా అనిపించింది. క్లాసిక్!!
వాకిలి ఇదే క్వాలిటీని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాను
పత్రిక కంటెంట్ చాలా బాగుంది. సీరియస్ నెస్ ఉన్నవారందరినీ ఒకచోట చేర్చారు. ఆర్టికల్స్ అన్నీ చదివి రాద్దామని ఆలస్యం చేసాను. కాని, పనుల వత్తిడి వలన ఇప్పటిలో మనసు పెట్టి చదవగలిగేలా లేను. రాసిన వ్యక్తులని బట్టీ, అక్కడక్కడా చూసిన వాక్యాల బట్టీ ఇవన్నీ తప్పక చదవవలసినవే అనిపిస్తున్నాయి. త్వరలోనే అన్నీ చదువుతాను.
కంటెంట్ వల్లనే కాకుండా, వాకిలి మొదటి సంచిక నా వరకూ మరొక ప్రత్యెక అనుభవంలా వుంది. అఫ్సర్, యాకూబ్, గురుస్వామి వంటి పూర్వ సాహిత్య మిత్రులకి తోడుగా, గడచిన ఏడాది పేస్ బుక్ ద్వారా, దానిలోని కవిసంగమం ద్వారా ఎందఱో ప్రతిభావంతులు మిత్రులయ్యారు. వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ, ఒక గంభీరమైన సందర్భంలో చూడడం, అందరితో కూర్చుని ఒక మంచి సంభాషణ చేసినట్టుగా అనిపిస్తోంది.
మంచి తెలుగు సాహిత్యానికి నెలవుగా ఈ పత్రిక మరింత మంచిపేరు తెచ్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. రవి మరియు వాకిలి టీం మిత్రులకి అభినందనలు తెలియచేస్తున్నాను. మిత్రులందరికీ కొత్త సంవత్సరం మరింత తేజోమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ..
ప్రేమతో
బివివి ప్రసాద్
Ravigaaru , Mee nibadhatha baagundi. Vimarsalanu sweekarinchalenivaru rachanalanu pampavaddani cheppadam oka challenge chesinatleevundi. please keep it up . don`t turnback. Wish you best of luck
D.Ramachandra Raju
ఈ వాకిలి లోంచి లోపలి కి వెళ్ళగానే తెలుగుసాహిత్యపు తాలూకు సౌరభం ఒక్కసారి గా పరిమళాలు వెదజల్లింది, ఆ గుబాళింపుతో మనసంతా అద్వితీయమైన ఆనందం వేసింది. ఎప్పటకీ ఈ పరిమళం ఇలాగె వుండాలని ఈ నందనం నుంచి వెలువడే ఈ వాకిలి ని తమ సాహితీ గదులతో కళకళలాడే టట్లు చేసిన అందరకి అభినందనలు
పూర్వఫల్గుణి
(మణి వడ్లమాని)
Dear Editor, dont publish any writing with anonymous or by anon. i am reacting to a comment for SIDDARTHA poem by anon.Let him/her give full name and address. so that you will get other thousands of letters on anon name as reaction to other reaction. let it be democratic discussion. (P.S. My poem on Managalampalli Balakrishna’NIRVANA RASA KREEDA’published in Andhra Jyothi got lot of applause. No one should dictate either content or form to a poet)