అడవిలో తప్పిపోయిన నేను
ఓ చీకటి కొమ్మను విరుచుకొచ్చాను
దాని గుసగుసలను నా దప్పి పెదాల మీద అద్దుకున్నాను
అది విలపిస్తున వానగొంతుకో
పగులు వారిన ఘంటికో
చిరిగిన హృదయమో కావచ్చును
ఘోర శిశిరాలు నోరునోక్కిన
మంచు కమ్మిన మసక చీకటి ఆకుల కేక కావచ్చును
దూరం నుండి నాకది
పుడమి దాచిన అగాధ రహస్యంగా తోచింది
కలలు కంటున్న ఆ అడవి లోంచి మేల్కొని
హేజెల్ పూరెమ్మ నా నాల్క కింద పాట పాడింది
నేను వెనుక వదలి వచ్చిన నా మూలాలు
ఒక్క పెట్టున నాతో మొరపెట్టుకున్నట్టు
కదలి పోతున్న దాని పరిమళం
నా చేతనామస్తిస్కం లోంచి పైకి ప్రాకింది
నా బాల్యం తో పాటు నేను కోల్పోయిన నా భూమి…
అంతే,ఆగిపొయాను
ఆ తిరుగుబోతు సౌరభం నన్ను క్షత గాత్రున్ని చేసింది
మూలం: ప్లాబో నెరూడా (లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ )
తెలుగు సేత: నాగరాజు రామస్వామి.
బాగుంది. పాబ్లో నెరుడా ..ఆ పేరే నా లాంటి చాలా మందికి ఒక సమ్మోహనం.ఇంకా కవిత్వం గురించి చెప్పేదేముంది? కాని నాల్క కింద పాట పాడడం కొంచెం తేడాగా అనిపిస్తోంది .can u elaborate it?
Dr.Lingareddy garu.thanks for the comment.meeru sariggane pattukunnaru.ante meeru Lothugaa chadivaaranna Maata..the line you are doubting about is correct.but unfortunately one line missed before the said line while printing in Telugu.adi idi.”kalalu kantunna aa adavi lonchi melkoni”.now I hope the flow is uninterrupted.thanks once again.i wish the editor rectifies if possible..nagaraju ramaswamy
నాగరాజు రామస్వామి గారు,
మీరు చెప్పిన లైన్ సరిచేసాం.
Thanks a lot pl.
చాల బాగుంది
ఘోరశిశిరాలు నోరు నొక్కిన
మంచు కమ్మిన మసకచీకటి ఆకుల కేక కావచ్చు – ఈ పంక్తుల్లో పదాల అమరిక బాగా కుదిరింది.
మొత్తం మీద మంచి పొయెమ్
నేను వెనుక వదలి వచ్చిన నా మూలాలు
ఒక్క పెట్టున నాతో మొరపెట్టుకున్నట్టు
కదలి పోతున్న దాని పరిమళం
నా చేతనామస్తిస్కం లోంచి పైకి ప్రాకింది
నా బాల్యం తో పాటు నేను కోల్పోయిన నా భూమి.. క్షతగాత్ర గానం.. great poem..
Thank u Vermma garu for ur kind comment
Baagundi
Thanks pl
I think it was Pablo not Plabo. PLease check for me. — Regards.
వేలూరి గారికి,
అచ్చుతప్పును సరిచేసాము.
కృతజ్ఞతలు.